iDreamPost

BREAKING: ప్రచారంలో పాల్గొన్న BRS MLA అభ్యర్థిపై కత్తితో దాడి!

మెదక్ బీఆర్ఎస్ ఎంపీ, దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ పై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ఆయనకు కడుపు భాగంలో గాయమైనట్టుగా తెలుస్తోంది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు.

తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది నేతలు ప్రచారం కూడా జోరుగా సాగిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే మెదక్ బీఆర్ఎస్ ఎంపీ, దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ సోమవారం సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అయితే ఆయన ప్రజలతో మాట్లాడుతుండగా జనాల్లో నుంచి ఓ వ్యక్తి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ఆయనకు కడుపు భాగంలో గాయమైనట్టుగా తెలుస్తోంది. దీంతో అక్కడే ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసిన వ్యక్తిని చితకబాదారు.

అనంతరం గాయపడ్డ కొత్త ప్రభాకర్ రెడ్డి కారులో స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆ తర్వాత అక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి