iDreamPost

పెళ్లింట విషాదం.. ట్రాక్టర్ బోల్తాపడి..

మరణం ఎటు నుండి పొంచి ఉందో చెప్పలేం కానీ.. కొన్ని సార్లు ఊహించిన ఉపద్రవంలా వస్తుంటాయి. అటువంటివే రోడ్డు ప్రమాదాలు. వీటి కారణంగా అనేక మంది తమ జీవితాలను కోల్పోతున్నారు.

మరణం ఎటు నుండి పొంచి ఉందో చెప్పలేం కానీ.. కొన్ని సార్లు ఊహించిన ఉపద్రవంలా వస్తుంటాయి. అటువంటివే రోడ్డు ప్రమాదాలు. వీటి కారణంగా అనేక మంది తమ జీవితాలను కోల్పోతున్నారు.

పెళ్లింట విషాదం.. ట్రాక్టర్ బోల్తాపడి..

నిత్యం ఏదో ఒక చోట రోడ్లు రక్తమోడుతూనే ఉన్నాయి. అనారోగ్య సమస్యలతో మరణించే వారి కన్నా.. రహదారి ప్రమాదాల్లో మృతి చెందుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వాలు ఎన్ని భద్రతా చర్యలు తీసుకున్నా అతివేగం, రాంగ్ రూట్, మద్యం సేవించి వాహనం నడపడం, నిద్రలేమి, రాష్ డ్రైవింగ్ ఈ యాక్సిడెంట్లకు కారణమౌతున్నాయి. ఈ ప్రమాదాలు కుటుంబాల్లో విషాదాలు నింపుతున్నాయి. పెద్దలకు పిల్లల్ని, పిల్లలకు తల్లిదండ్రుల్ని దూరం చేస్తున్నాయి. కుటుంబ పెద్ద కోల్పోవడంతో ఫ్యామిలీ నడి వీధికి వచ్చే పరిస్థితి దాపురిస్తోంది. తాాజాగా ఓ పెళ్లి ఇంట్లో విషాదాన్ని నింపింది. బుధవారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు.

మెదక్ జిల్లాలోని పాపన్న పేటలో బాచారం గ్రామంలోని ప్రజలను ఈ రోడ్డు ప్రమాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవల కాలంలో జరిగిన పలు ప్రమాదాల్లో గ్రామానికి చెందిన ఐదుగురు మృత్యువాత పడటం విచారకరం. 40 రోజుల వ్యవధిలో ఐదుగురు మరణించారు. వీరిలో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. ఫిబ్రవరి 20న ఆ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు నిశ్చితార్థానికి వెళ్లి వస్తుండగా… అల్లాదుర్గం మండలం గడి పెద్దాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ ఘటన మర్చిపో ముందే.. ఇప్పుడు మరో ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళితే.. బాచారం గ్రామానికి చెందిన సొంగ రాము వివాహం జోగిపేటకు చెందిన అమ్మాయితో పెళ్లి నిశ్చయమైంది. గురువారం ముహుర్తం ఫిక్స్ చేశారు పెద్దలు. కాగా, పెళ్లి కూతురును గ్రామానికి తీసుకురావడానికి బుధవారం బంధువులు, కొంద మంది గ్రామస్థులు కలిసి ట్రాక్టర్‌లో జోగిపేటకి బయలు దేరారు.

జోగిపేట మండల పరిధిలోని మన్సాన్పల్లి గ్రామ శివారుకు ట్రాక్టర్ రాగానే.. అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో జెట్టిగారి సంగమ్మ (45), రావుగారి బూదమ్మ (46)లు అక్కడికక్కడే మృతి చెందారు. 20 మంది వరకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని హుటా హుటిన జోగిపేట్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. కాగా, తాజాగా ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మహిళలు మరణించారు. పెళ్లికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కందుకూరుకు చెందిన ఓ కుటుంబం తెలంగాణలోని ఖమ్మం జిల్లా పాల్వంచలో వివాహానికి హాజరైంది. తిరిగి కారులో తమ స్వగ్రామానికి బయలు దేరారు. కారు టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం దగ్గరకు చేరుకోగానే డివైడర్‌ని ఢీకొట్టి బోల్తా పడింది. కారులో ఉన్న ముగ్గురు మహిళలు మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి