iDreamPost

తెలంగాణలో సంచలనం.. ఓకేసారి 106 మంది ఉద్యోగులపై వేటు.. ఆ మీటింగే కారణం

  • Published Apr 10, 2024 | 8:02 AMUpdated Apr 10, 2024 | 8:14 AM

Siddipet: తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. 106గురు ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్ చేసింది సర్కార్. ఆ వివరాలు..

Siddipet: తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. 106గురు ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్ చేసింది సర్కార్. ఆ వివరాలు..

  • Published Apr 10, 2024 | 8:02 AMUpdated Apr 10, 2024 | 8:14 AM
తెలంగాణలో సంచలనం.. ఓకేసారి 106 మంది ఉద్యోగులపై వేటు.. ఆ మీటింగే కారణం

సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలంగాణలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకు ఏం జరిగిందంటే.. తెలంగాణ సర్కార్ ఒకేసారి ఏకంగా 106గురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేసింది. కారణం ఏంటి.. ఇంతమందిని ఒకేసారి ఎందుకు తొలగించింది అంటే ఓ రాజకీయ పార్టీ మీటింగ్ అంటున్నారు. ఆ వివరాలు..

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఓ రాజకీయ పార్టీ మీటింగులో పాల్గొన్న 106 మంది ప్రభుత్వ ఉద్యోగులపై ఒకేసారి వేటు పడింది. ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే మీటింగ్ లో పాల్గొన్న ఉద్యోగులంతా ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తూ బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాంతో సదరు 106 మంది ఉద్యోగులను సస్పెండ్‌ చేస్తూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆదేశాలు జారీ చేశారు.

ఏప్రిల్ 7న సిద్దిపేటలోని రెడ్డి సంక్షేమ భవన్‌లో ఈ మీటింగ్ జరిగింది. జిల్లాకు చెందిన ఉపాధి హామీ, సెర్ప్‌ ఉద్యోగులతో మెదక్‌ లోక్‌సభ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, సుడా మాజీ ఛైర్మన్‌ రవీందర్‌ రెడ్డి, మరికొందరు నాయకులు రహస్యంగా సమావేశం నిర్వహించారు. అయితే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఇలాంటి సమావేశాలపై నిషేధం ఉంది. దాంతో మీటింగ్ విషయం కాస్తా లీక్ కావడంతో.. వెంకట్రామిరెడ్డి, రవీందర్‌ రెడ్డిలపై కేసు నమోదైంది.

ఈ క్రమంలోనే సమావేశంలో పాల్గొన్న ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలకు ఉపక్రమించారు సిద్ధిపేట కలెక్టర్. సీసీటీవీ కెమెరా దృశ్యాల ఆధారంగా.. మీటింగ్‌లో పాల్గొన్న ఉద్యోగులను గుర్తించి.. వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. సస్పెండైన వారిలో 38 మంది సెర్ప్‌ ఉద్యోగులు, 68 మంది ఉపాధి హామీ ఉద్యోగులు ఉన్నారు. ఈ నిర్ణయం సంచనలంగా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి