iDreamPost

ఈమె హీరోయిన్ కాదు.. ఆ స్టార్ డైరెక్టర్ భార్య! ఎవరో తెలిస్తే నమ్మలేరు!

ఈ ఫోటోలో తన అందాలతో మెస్మరైజ్ చేస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు హీరోయిన్ కాదు. ఓ డైరెక్టర్ భార్య. అతడ్ని పెళ్లి చేసుకున్నాక.. ఆమె లైమ్ లైట్లోకి వచ్చినట్లు. అతడి విజయం వెనుక ఆమె ఉంది. ఇంతకు ఆమె ఎవరంటే..?

ఈ ఫోటోలో తన అందాలతో మెస్మరైజ్ చేస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు హీరోయిన్ కాదు. ఓ డైరెక్టర్ భార్య. అతడ్ని పెళ్లి చేసుకున్నాక.. ఆమె లైమ్ లైట్లోకి వచ్చినట్లు. అతడి విజయం వెనుక ఆమె ఉంది. ఇంతకు ఆమె ఎవరంటే..?

ఈమె హీరోయిన్  కాదు.. ఆ స్టార్ డైరెక్టర్ భార్య! ఎవరో తెలిస్తే నమ్మలేరు!

ఇండస్ట్రీలో ఓ హీరోను స్టార్ చేయాలన్నా, పడగొట్టాలన్నా దర్శకుల చేతుల్లోనే ఉంటుంది. 24 క్రాఫ్టులను మేనేజ్ చేస్తూ.. సకాలంలో పనిచేయించుకుంటూ.. సమయానికి ధియేటర్లలో సినిమా రిలీజ్ అయ్యేలా చూసుకునే బాధ్యత అతడిపై ఉంటుంది. అందుకే సినిమా బాగుంటే. . హీరోని.. బాగోకపోతే దర్శకుడ్ని తిడుతూ ఉంటారు. అలాగే ఇండస్ట్రీలో ప్రతి దర్శకుడు సక్సెస్ కాలేడు. అలా అని ఫెయిల్ కూడా కాడు. ప్రతి సక్సెస్ పర్శన్ వెనుక.. ఓ ఉమెన్ ఉన్నట్లే.. ప్రతి దర్శకుడి విజయం వెనుక.. అతడి తల్లి కానీ, భార్య కానీ కచ్చితంగా ఉంటారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సక్సెస్ ఫుల్ దర్శకుడి వెనుక కచ్చితంగా ఆయన భార్య ఉంటుంది.

ఇటీవల కాలంలో తెలుగులో ఓటమి ఎరుగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు దర్శక ధీరుడు, జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి. తమిళంలో కూడా అలాంటి దర్శకుడు ఒకరు ఉన్నారు. ఇదిగో ఈ ఫోటోలో తన గ్లామరస్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న ఈ భామ.. ఆయన భార్యనే. ఫస్ట్ సినిమాతోనే కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్ చూపును కూడా తన వైపు తిప్పుకున్నాడు ఈ డైరెక్టర్. ఇప్పుడు బాలీవుడ్ దృష్టిని కూడా తన వైపు మరల్చుకున్నాడు. అంత విజయాన్ని పొందడానికి కారణమైంది అతడి భార్య. ఇంతకు ఆ దర్శకుడు ఎవరంటే.. అట్లీ కుమార్. అతడి అసలు పేరు అరుణ్ కుమార్. అతడి భార్యనే కృష్ణ ప్రియ.. అలియాస్ ప్రియా అట్లీ. ప్రియా పలు సినిమాల్లో, సీరియల్స్ నటించేది. అప్పట్లో అట్లీ ఎస్. శంకర్ దగ్గర అసిస్టెంట్‌గా చేసేవాడు. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా వీరిద్దరూ కలుసుకున్నారు.

ఇద్దరీ అభిప్రాయాలు పంచుకున్నారు. అలా వీరిద్దరు ఒకరికొకరు ప్రపోజ్ చేసుకున్నారు. ఇక ఇంట్లో చెప్పడమే తరువాయి. రాజా రాణీ సమయంలో.. ప్రియా, తన తల్లిదండ్రుల్ని ప్రీమియర్ షోకి పిలిచి.. పెళ్లి సెట్ చేసేసుకున్నారు. 2014లో వీరిద్దరూ ఒక్కటయ్యారు. ఇక అక్కడ నుండి వరుస విజయాలతో దూసుకెళ్లాడు అట్లీ. తేరీ, మెర్సల్, బిగిల్ వంటి సినిమాలే కాకుండా.. ఏకంగా బాలీవుడ్ బాద్ షా షారూఖ్ తో సినిమా తీసే ఛాన్స్ కొట్టేశాడు. జవాన్ మూవీ తెరకెక్కించగా.. ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందో అందరికీ తెలిసిందే. అలాగే నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు ఈ దంపతులు. ఏ ఫర్ యాపిల్ కంపెనీ అనే పేరుతో పలు సినిమాలను నిర్మించారు. ఈ దంపతులకు ఓ బాబు. ప్రియా ఇప్పుడు నిర్మాణ రంగాన్ని చూసుకుంటూ.. సోషల్ మీడియాలో మాత్రం..ఫోటోలను షేర్ చేస్తూ మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. ఈమె ఓ పిల్లాడి తల్లా అంటే మాత్రం ఆశ్చర్యమేయకమానదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి