iDreamPost

మీరు లిప్‌స్టిక్ ఎక్కువగా వాడుతున్నారా? అయితే జాగ్రత్త.. ఇవి తెలుసుకోండి..

మీరు లిప్‌స్టిక్ ఎక్కువగా వాడుతున్నారా? అయితే జాగ్రత్త.. ఇవి తెలుసుకోండి..

ఎవరికైనా అందాన్ని తెచ్చేది చిరునవ్వు. ఆడవాళ్ళకి కూడా అందాన్ని తెచ్చిపెడుతుంది అదే చిరునవ్వు. అది మరింత అందంగా కనబడడానికి ఉపయోగించేదే లిప్‌స్టిక్. చాలా మంది రోజూ లిప్‌స్టిక్ ని వాడతారు. ఎప్పుడో ఫంక్షన్లకు, పెళ్లిళ్లకు రాస్తే తప్పులేదు కానీ రోజూ రెండు పూటలా కొంతమంది పెదాలకు లిప్‌స్టిక్ రాసుకునే ఉంటారు. లిప్‌స్టిక్ లో క్రోమియం, మెగ్నీసియం, లెడ్, కాడ్మియం, పెట్రో వంటి కెమికల్స్ వాడుతుంటారు. వీటి వలన అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది.

లెడ్ కెమికల్ అనేది నాడీ వ్యవస్థపై చెడు ప్రభావం చూపుతుంది. ఇది మెదడు ఆరోగ్యాన్ని కుంగదీస్తుంది. అంధత్వం వచ్చే ప్రమాదం ఉంది. హార్మోన్ల సమతుల్యత దెబ్బ తినే అవకాశం ఉంది. కాడ్మియం అనే కెమికల్ వలన కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంది మరియు కడుపులో కణితులు ఏర్పడే ప్రమాదం ఉంది. పెట్రో కెమికల్ వలన తెలివితేటలు మందగిస్తాయి. చర్మం బాగా ఇరిటేట్ అవడం జరుగుతుంది. పునరుత్పత్తి వ్యవస్థపై కూడా చెడు ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఎక్కువగా రోజూ లిప్‌స్టిక్ వేసుకోవడం వలన పైన చెప్పిన అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. ఎపుడైనా పార్టీలు, అకేషన్స్, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఉపయోగిస్తే పర్వాలేదు కానీ రోజూ మూడు పూటలు పెదాలకు లిప్‌స్టిక్ రాసుకుంటే మంచిది కాదు. ఎందుకంటే రోజూ రాసుకుంటే ఎక్కువగా పెదాల ద్వారా మన శరీరం లోనికి కెమికల్స్ వెళ్లి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. కావాలంటే ఎప్పుడైనా లిప్‌స్టిక్ వాడుకొని రోజూ రెగ్యులర్ గా పెదాలకు వెన్న లేదా నెయ్యి రాసుకుంటే కూడా మంచి ఫలితం ఉంటుంది. పెదాలకు నెయ్యి రాసుకున్నా కూడా షైనింగ్ గానే కనబడతాయి. కాబట్టి ఇకపై లిప్‌స్టిక్ రాసేటప్పుడు ఆలోచించండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి