iDreamPost

Group-2 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. మెయిన్స్ కు ఎంతమంది అర్హత సాధించారంటే?

ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కార్ నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పించడమే లక్ష్యంగా కృషి చేస్తోంది. గతేడాది గ్రూప్ 2కి నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించింది. దీనికి సంబంధించిన ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి.

జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు గతేడాది డిసెంబర్ లో గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా పలు ప్రభుత్వ శాఖల్లోని 899 ఉద్యోగాలను భర్తీ చేయనున్నది ప్రభుత్వం. గ్రూప్ -2కి సంబంధించి ఫిబ్రవరి 25 2024న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. తాజాగా ఏపీ గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. ప్రిలిమ్స్ లో ఉతీర్ణత సాధించిన అభ్యర్థుల వివరాలను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ https://portal-psc.ap.gov.inలో వెల్లడించింది. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు మొత్తం 92,250 మంది అభ్యర్థులను అర్హత సాధించారు.

ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన ఏడు వారాల్లోనే ఫలితాలను విడుదల చేసింది ఏపీపీఎస్సీ. గ్రూప్-2 స్క్రీనింగ్ టెస్ట్ కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 4,83,525 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. వీరిలో 4,04,037 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష రాసిన వారిలో 92,250 మంది మెయిన్స్ కు అర్హత సాధించారు. కాగా పరీక్ష కోసం అప్లై చేసుకున్న వారిలో వివిధ కారణాలతో 2,557 మంది అభ్యర్థులను అధికారులు రిజెక్ట్ చేశారు. మెయిన్స్ కు ఎంపికైన వారికి జులై 28న మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి