iDreamPost

BTech చేసి ఖాళీగా ఉన్నారా? ఈ పోస్టులకు ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి.. నెలకు లక్షకు పైగా జీతం

బీటెక్ పాసైన వారికి గుడ్ న్యూస్. ఏఐ ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. నెలకు లక్షకు పైగా జీతం. వెంటనే అప్లై చేసుకోండి.

బీటెక్ పాసైన వారికి గుడ్ న్యూస్. ఏఐ ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. నెలకు లక్షకు పైగా జీతం. వెంటనే అప్లై చేసుకోండి.

BTech చేసి ఖాళీగా ఉన్నారా? ఈ పోస్టులకు ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి.. నెలకు లక్షకు పైగా జీతం

మీరు బీటెక్ గ్రాడ్యూయేట్స్ అయితే జాబ్ కొట్టేందుకు ఇదే మంచి అవకాశం. బీటెక్ కంప్లీట్ అవగానే చాలా మంది ఐటీ సెక్టార్ లో స్థిరపడేందుకు ఇంట్రస్టు చూపిస్తుంటారు. మరికొంత మంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తుంటారు. మరి మీరు కూడా బీటెక్ ఉత్తీర్ణులై జాబ్ కోసం ప్రయత్నిస్తున్నట్లైతే ఏఐ ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ లో జాబ్ పొందే అవకాశం వచ్చింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు లక్షకు పైగా జీతం అందుకోవచ్చు. తాజాగా ఏఐ ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 40 పోస్టులను భర్తీ చేయనున్నది.

ఏఐ ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ (మెటీరియల్స్ మేనేజ్‌మెంట్) 04,ఎగ్జిక్యూటివ్ (మెటీరియల్స్ మేనేజ్‌మెంట్) లెవెల్-I 11 పోస్టులు, ఆఫీసర్ (మెటీరియల్స్ మేనేజ్‌మెంట్) 25 పోస్టులను భర్తీ చేయనున్నది. అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జూన్ 29 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టులను అనుసరించి అభ్యర్థులు బీటెక్, ఎంబీఏ,పీజీడీఎం ఉత్తీర్ణులై ఉండాలి. 45- 58 ఏళ్లలోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం పోస్టులు:

  • 40

విభాగాల వారీగా ఖాళీలు:

  • సీనియర్ ఎగ్జిక్యూటివ్ (మెటీరియల్స్ మేనేజ్‌మెంట్): 04
  • ఎగ్జిక్యూటివ్ (మెటీరియల్స్ మేనేజ్‌మెంట్) లెవెల్-I: 11
  • ఆఫీసర్ (మెటీరియల్స్ మేనేజ్‌మెంట్): 25

అర్హత:

  • పోస్టులను అనుసరించి అభ్యర్థులు బీటెక్, ఎంబీఏ,పీజీడీఎం ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి:

  • 45- 58 సంవత్సరాల వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ఎంపిక విధానం:

  • అభ్యర్థుల వ్యక్తిగత ఇంటర్వ్యూ, డాక్యూమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతం:

  • సీనియర్ ఎగ్జిక్యూటివ్ (MM): నెలకు రూ. 1,24,670,ఎగ్జిక్యూటివ్ (MM) స్థాయి-I: నెలకు రూ. 89,735, అధికారి (MM): నెలకు రూ. 47,625 అందిస్తారు.

దరఖాస్తు ప్రక్రియ:

అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌లను పూరించి, వాటిని పోస్ట్/స్పీడ్ పోస్ట్/కొరియర్ ద్వారా చీఫ్ హెచ్‌ఆర్ ఆఫీసర్, ఏఐఈఎస్‌ఎల్‌కి కింది చిరునామాలో ఒక ఎన్వలప్‌లో పంపాలి.

చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్

ఏఐ ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్

2వ అంతస్తు, సీఆర్ఏ భవనం,

సఫ్దర్‌జంగ్ ఎయిర్‌పోర్ట్ కాంప్లెక్స్,

అరబిందో మార్గ్, న్యూఢిల్లీ – 110 003

దరఖాస్తుకు చివరి తేదీ:

  • 29-06-2024

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి