iDreamPost

AP vs HYD: ఈ రెండిట్లో ఎక్కడ పెట్టుబడి పెడితే లాభం ఉంటుంది?

చాలా మంది రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టాలని చూస్తారు. ఇప్పటికే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ హబ్ గా మారింది. కానీ ఎంత పెట్టుబడి పెట్టినా గానీ చాలా మందిలో సౌకర్యం విషయంలో అసంతృప్తి అయితే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెడితే బాగుంటుందా? అసలు ఏపీ వర్సెస్ హైదరాబాద్ ఎక్కడ పెట్టుబడి పెడితే మంచిది?

చాలా మంది రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టాలని చూస్తారు. ఇప్పటికే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ హబ్ గా మారింది. కానీ ఎంత పెట్టుబడి పెట్టినా గానీ చాలా మందిలో సౌకర్యం విషయంలో అసంతృప్తి అయితే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెడితే బాగుంటుందా? అసలు ఏపీ వర్సెస్ హైదరాబాద్ ఎక్కడ పెట్టుబడి పెడితే మంచిది?

AP vs HYD: ఈ రెండిట్లో ఎక్కడ పెట్టుబడి పెడితే లాభం ఉంటుంది?

పెట్టుబడి.. చాలా మంది స్థలాల మీదనో లేక పొలాల మీదనో ఇలా ఏదో ఒక ప్రాపర్టీ మీద పెడుతుంటారు. ఎందుకంటే బంగారం మీద గానీ ఇంకేదైనా వాటి మీద గానీ పెట్టిన దాని కన్నా కూడా స్థలం మీద పెట్టిన పెట్టుబడికే అధిక లాభాలు వస్తాయి. ఈ విషయం హైదరాబాద్ డెవలప్ మెంట్ చూస్తేనే అర్థమవుతుంది. బంగారం మీద, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటి మీద పెట్టుబడి పెట్టిన వారికి కొంత లాభం మాత్రమే వస్తే భూమ్మీద ఇన్వెస్ట్ చేసిన వారికి మాత్రం భారీ లాభాలు వచ్చాయి. భూమి ధర కొన్నేళ్ళకి 500 రెట్లు పెరిగింది. అట్లుంటది రియల్ ఎస్టేట్ తోని. ఏపీ వాళ్ళు హైదరాబాద్ లో ఉంటున్నారు కాబట్టి ఇక్కడే స్థలాలు, ఇల్లు కొనుక్కుంటున్నారు. అయితే అందరికీ ఇది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఏపీలో కూడా స్థలాలు కొని పక్కన పెట్టుకుంటున్నారు. ఏపీ కూడా హైదరాబాద్ ని తలపించేలా డెవలప్ అయ్యేందుకు ఆస్కారం ఉంది. ఈ కథనం ఏపీ వారికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎప్పటికైనా ఏపీకి వెళ్ళేవాళ్ళు కాబట్టి.. హైదరాబాద్ లో ఉంటున్నవారు కాబట్టి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి.

మొదటిది ఆకాశాన్ని అంటుతున్న భూమి ధరలు. రెండు ట్రాఫిక్. మూడు వర్షం పడితే చెరువులను తలపించే రోడ్లు. సెల్లార్ లోకి బురద నీరు వచ్చే పరిస్థితి. ఇంకా గట్టిగా మాట్లాడితే నీరుతో పాటు మురుగునీటి వాసన కూడా వస్తుంది. ఎందుకో మీకు తెలుసు. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకునే ఇలాంటివి తలెత్తకుండా ఇప్పుడు కొత్తగా అభివృద్ధి చేస్తున్న ప్రాంతాల మీద ప్రత్యేక ఫోకస్ పెట్టారు. అయితే ఇప్పుడు డెవలప్ చేయబోయే ప్రాంతాలన్నీ సిటీ మధ్యలో లేవు. నగర శివారులో ఉన్నాయి. కాబట్టి పెట్టుబడి పెట్టినా ఉండాలన్నా ఈ ట్రాఫిక్ ని దాటి ఆఫీసులకు రాలేని పరిస్థితి. ఇప్పుడే ఇలా ఉందంటే మును ముందు ట్రాఫిక్ చాలా ఘోరంగా ఉంటుంది. అసలు ఏపీ వాళ్ళు హైదరాబాద్ లో ప్రాపర్టీ కొనడం లాభమా? ఏపీలో కొనడం లాభమా? అనే విషయాలను తెలుసుకునే ముందు ఇక్కడ రెండు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.

AP VS HYD

అందులో ఒకటి ధర, రెండు సౌకర్యం. తక్కువ ధర ఉన్నది కొనుక్కుని ఎక్కువ లాభాలు పొందితే బాగుంటుంది కదా. కానీ హైదరాబాద్ లో తక్కువ ధరకి ప్రాపర్టీ దొరకని పరిస్థితి. నగర శివారులో కూడా ఇదే పరిస్థితి. ఈ ధరకు ఏపీలో పెట్టుబడి పెడితే ఫ్యూచర్ లో మంచి లాభాలను ఆశించవచ్చు. పైగా సొంత ఊరిలో కబ్జా చేస్తారనో.. మోసాలు చేస్తారనో అన్న భయం ఉండదు. తెలంగాణలో పెట్టుబడి పెట్టాలంటే హైదరాబాద్ ఒకటే. అదే ఏపీకి వెళ్తే మూడు రాజధాని నగరాలతో పాటు తిరుపతి, కాకినాడ వంటి ప్రాంతాలు ఉన్నాయి. రెండు సౌకర్యం. ఎవరైనా లక్షలు, కోట్లు ఇన్వెస్ట్ చేసేది కంఫర్ట్ గా ఉండడానికే కదా. వర్షం పడితే రోడ్లు జలాశయాలను తలపించడం.. మోకాళ్ళ లోతు నీరు చేరడం.. అడుగడుగునా ఇదే పరిస్థితి. మెయిన్ రోడ్లే కాదు.. ఇళ్ల దగ్గర ఉండే రోడ్లు కూడా మునిగిపోయే పరిస్థితి. ఇక్కడ వర్షం నీరు బయటకు పోవాలంటే మ్యాన్ హొల్స్ తెరిచి పెట్టి ఉంచాలి. దీని వల్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి.

హైదరాబాద్ నగరానికి వంకలు పెట్టడం మా ఉద్దేశం కాదు. కానీ ఉన్న ఫ్యాక్ట్ అది. వర్షం పడితే రోడ్లు మునిగిపోవడం, భారీ ట్రాఫిక్, భూముల ధరలు ఈ మూడు అంశాలు తప్పితే హైదరాబాద్ కి వంకలు పెట్టడానికి ఆస్కారం లేదు. అదే ఏపీలో అయితే ఇలాంటి పరిస్థితి కనిపించదు. మరీ వర్షాలు ఏకధాటిగా రెండు, మూడు రోజులు కురిసినా కూడా నీరు నిల్వ ఉండదు. గోదావరి జిల్లాలకు వెళ్తే గోదావరి, ప్రకాశం జిల్లాకి వెళ్తే కృష్ణా నది, ఇటు వైజాగ్ వెళ్తే సముద్రంలో వర్షం నీరు కలిసిపోతుంది. ఇన్ని కంఫర్ట్స్ ఉన్నాయి కాబట్టి ఏపీ పెట్టుబడులకు అనుకూలం అని చెప్పవచ్చు. పైగా హైదరాబాద్ ఏపీకి ఒక ఆదర్శంగా ఉంటుంది. అభివృద్ధి పరంగా ఎలా నిర్మించాలి అనే దానికి.. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎలా డెవలప్ చేయాలి అనే దానికి హైదరాబాద్ బెస్ట్ క్లాసిక్ ఎగ్జాంపుల్ గా నిలుస్తుంది. కాబట్టి ఎలా చూసినా గానీ ఇక్కడ ఉంటున్న ఏపీ వారికి హైదరాబాద్ లో కంటే కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టడం అనేది ఉత్తమం. సంక్షేమం మీద ఫోకస్ పెట్టిన వైఎస్ జగన్ సర్కార్.. ఇక డెవలప్ మెంట్ మీద ఫోకస్ చేయబోతుంది. కాబట్టి ఏపీలో పెట్టుబడులు పెట్టే వారికి మంచిది, లాభదాయకం అని చెప్పవచ్చు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి