iDreamPost

పవన్‌ కళ్యాణ్‌పై మండిపడుతున్న వాలంటీర్లు.. క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్‌!

  • Published Jul 11, 2023 | 10:39 AMUpdated Dec 21, 2023 | 6:43 PM

జగన్‌ తీసుకున్న నిర్ణయాల్లో వాలంటీర్‌ వ్యవస్థ ఎంతో ముఖ్యమైనది. ఒకప్పుడు ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు చేరాలంటే.. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చేది. ఏదైనా పథకానికి అప్లై చేయాలంటే.. అధికారులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది.

జగన్‌ తీసుకున్న నిర్ణయాల్లో వాలంటీర్‌ వ్యవస్థ ఎంతో ముఖ్యమైనది. ఒకప్పుడు ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు చేరాలంటే.. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చేది. ఏదైనా పథకానికి అప్లై చేయాలంటే.. అధికారులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది.

  • Published Jul 11, 2023 | 10:39 AMUpdated Dec 21, 2023 | 6:43 PM
పవన్‌ కళ్యాణ్‌పై మండిపడుతున్న వాలంటీర్లు.. క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్‌!

వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అనేక సంస్కరణలు చేపట్టారు. జగన్‌ తీసుకున్న నిర్ణయాల్లో వాలంటీర్‌ వ్యవస్థ ఎంతో ముఖ్యమైనది. ఒకప్పుడు ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు చేరాలంటే.. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చేది. ఏదైనా పథకానికి అప్లై చేయాలంటే.. అధికారులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ సీఎం జగన్‌ తీసుకువచ్చిన వాలంటీర్ల వ్యవస్థ వల్ల ఈ పరిస్థితి సమూలంగా మారింది. పెన్షన్‌ మొదలు.. ప్రభుత్వ పథకాలు ఏవైనా సరే.. వారే ఇంటికి వచ్చి అందించడం.. అవసరమైన వివరాలు సేకరించడం చేస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. జగన్‌ తీసుకువచ్చిన వాలటీర్ల వ్యవస్థ ప్రభుత్వాన్ని మన గడపలోకి తీసుకువచ్చింది. సామాన్యుడికి చేరువ చేసింది. ప్రజలకు ఎంతో మేలు చేస్తోన్న వాలంటీర్ల మీద ప్రతి పక్షాలు ముందు నుంచి విషం చిమ్ముతున్నాయి. తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ వాలంటీర్ల వ్యవస్థ మీద చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి.

పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలపై పలువురు రాజకీయ నేతలు, సెలబ్రిటీలు మండి పడుతున్నారు. కేఏ పాల్‌ లాంటి వాళ్లు పవన్‌ను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇక తమ్మారెడ్డి భరద్వాజ అయితే.. పవన్‌ కళ్యాణ్‌, వాలంటీర్ల మీద చేసిన వ్యాఖ్యలు చాలా బాధకరం. నోటికి ఏది తోస్తే అది మాట్లాడటం సరికాదు.. మీరు అసలు మనుషులా.. దున్నపోతులా అంటూ ఓ రేంజ్‌లో మండి పడ్డారు. ఇక పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై వాలంటీర్లు మండిపడుతున్నారు. ఆయన దిష్టి బొమ్మ దహనం చేసి.. నిరసన వ్యక్తం చేస్తున్నారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు.

వారాహి విజయయాత్ర ఏలూరు బహిరంగ సభలో పాల్గొన్న పవన్‌ కళ్యాణ్‌.. వాలంటీర్ల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 30 వేల మంది మహిళలు అదృశ్యం అయితే వారిలో 14 వేల మంది సమాచారం లేకుండా పోయిందని.. రాష్ట్రంలో మహిళల అక్రమ రవాణ జరుగుతోందని.. అందుకు వాలంటీర్లే కారణం అన్నారు పవన్‌ కళ్యాణ్‌. వైఎస్సార్‌సీపీ పాలనలో ప్రతి గ్రామంలో వాలంటీర్లను పెట్టి కుటుంబంలో ఎంత మంది ఉన్నారు.. వారిలో మహిళలు ఎందరు, వితంతువులున్నారా వంటి వివరాలు ఆరా తీస్తున్నారని తెలిపారు. ఒంటరి మహిళలే లక్ష్యంగా సమాచారం సేకరించి.. దాన్ని సంఘ విద్రోహ శక్తులకు ఇస్తున్నారని.. రాష్ట్రంలో మహిళల అదృశ్యాలకు వాలంటీర్లే కారణమంటూ పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి