iDreamPost

Vijayawada: ప్రియుడి కోసం భర్తపై భారీ స్కెచ్‌.. బలైన అమాయకురాలు

  • Published Jan 20, 2024 | 8:14 AMUpdated Jan 20, 2024 | 8:14 AM

ప్రియుడి కోసం భర్తను తప్పించాలని ప్లాన్‌ చేసింది ఓ భార్య. అయితే అనుకోకుండా అమయాకురాలు బలైంది. ఇంతకు ఏం జరిగింది అంటే..

ప్రియుడి కోసం భర్తను తప్పించాలని ప్లాన్‌ చేసింది ఓ భార్య. అయితే అనుకోకుండా అమయాకురాలు బలైంది. ఇంతకు ఏం జరిగింది అంటే..

  • Published Jan 20, 2024 | 8:14 AMUpdated Jan 20, 2024 | 8:14 AM
Vijayawada: ప్రియుడి కోసం భర్తపై భారీ స్కెచ్‌.. బలైన అమాయకురాలు

మారుతున్న కాలంతో పాటు సమాజంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు తప్పు చేయడం కాదు కదా.. ఆ ఆలోచన చేసినా మహా పాపం అనుకునేవారు. మరి నేడో.. ఎవరు ఏమనుకుంటే మాకేంటి.. మా సుఖం మాకు ముఖ్యం.. అందుకు అడ్డు వస్తే.. జీవిత భాగస్వామినే కాదు కడుపున పుట్టిన వారిని సైతం చంపేందుకు వెనకాడటం లేదు. వివాహేతర బంధం కారణంగా చోటు చేసుకుంటున్న నేరాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. పైగా ఆడవారు కూడా ఈ తరహా నేరాల్లో ప్రధాన నిందితులుగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రియుడి మీద మోజుతో భర్తను అడ్డు తప్పించేందుకు స్కేచ్‌ వేసింది ఓ మహిళ. అయితే ఈ ప్రయత్నంలో మరో అమాయకురాలు బలవ్వడం సంచలనంగా మారింది. ఆ వివరాలు..

ఈ దారుణ సంఘటన విజయవాడలో చోటు చేసుకుంది. కొన్ని రోజుల క్రితం నగర శివారు ప్రాంతంలోని పంటపొలాల్లో అనుమానాస్పద డెడ్ బాడీని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. మృతి చెందిన వ్యక్తి ఎవరు.. అసలేం జరిగింది అనే కోణంలో విచారించగా.. దారుణ విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివాహేతర సంబంధం వల్ల ఈ దారుణం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. సినీ ఫక్కిలో మర్డర్ ప్లాన్ వేశారు ప్రేయసి, ప్రియుడు. భర్తను జైలుకు పంపటానికి ప్రియుడితో కలిసి భార్య మర్డర్ ప్లాన్ వేసింది. అయితే, డబ్బులకు ఆశపడి ప్రాణాలు పోగొట్టుకుంది మరో వివాహిత.

అసలేం జరిగింది అంటే..

ఈ కేసులో నిందితురాలైన మృదుల అనే మహిళకు వివాహం అయ్యి.. ఇద్దరు పిల్లలు సంతానం ఉన్నారు. ఈ క్రమంలో ఆమెకు ప్రవీణ్‌ అనే యువకుడితో పరిచయం ఏర్పడటం.. అది కాస్త వివాహేతర బంధానికి దారి తీయడం జరిగింది. అయితే తమ ప్రేమకు భర్త రుషేంద్ర అడ్డుగా ఉన్నాడని భావించిన మృదుల అతడిని జైలుకు పంపాలని ప్లాన్‌ చేసింది. దీని కోసం కొన్నేళ్ళ క్రితం ప్రవీణ్ ఇంట్లో అద్దెకు దిగిన నాగమణిని హత్య చేసి.. ఆ నేరాన్ని రుషేంద్ర మీద మోపేలా ప్లాన్‌ చేశారు మృదుల, ఆమె లవర్‌ ప్రవీణ్‌.

డబ్బులకు ఆశపడి ప్రాణాలు పొగొట్టుకున్న నాగమణి

ప్లాన్‌లో భాగంగా నాగమణిని కలిసిన మృదుల.. తన భర్తతో వివాహేతర సంబంధం ఉన్నట్లుగా.. అతడిని బెదిరిస్తే డబ్బులు ఇస్తామని బాధితురాలితో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే మృదుల తన ప్లాన్‌లో భాగంగా తననే హత్య చేయబోతుందని తెలియని నాగమణి.. డబ్బులకు ఆశపడి.. వాళ్లు చెప్పినట్లుగానే.. రుషేంద్రతో ఆమెకు వివాహేతర సంబంధం ఉన్నట్లుగా మెసేజ్‌లు చేయాలని భావించింది. అయితే నాగమణిని హత్య చేయాలని భావించిన మృదుల లవర్‌ ప్రవీణ్‌.. నాగమణిని పెనమలూరు శివారుకు తీసుకుని వచ్చి ఆమె ఫోన్ నుండి మృదుల ఫోన్‌కు ఆమె భర్తతో వివాహేతర సంబంధం వుందంటూ వాయుస్ మెసేజ్‌లు రికార్డ్ చేసి పంపించాడు ప్రవీణ్. మృదుల భర్తే నాగమణిని హత్య చేసినట్లు నాగమణి కే తెలియకుండా ఆమె నుండి ఏవిడెన్స్ క్రియేట్ చేశారు. డబ్బులకు ఆశ పడి వారు చెప్పిన టెక్స్ట్ , వాయిస్‌ మెసేజ్‌లు పెట్టింది నాగమణి.

నాగమణి హత్య..

ప్లాన్ ప్రకారం అనుకున్న పని అయ్యాక అక్కడే నాగమణిని హత్య చేశాడు ప్రవీణ్‌. మరుసటి రోజు నాగమణి డెడ్ బాడీ నీ గుర్తించిన పోలీసులు.. అనుమస్పద మృతిగా కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్త అడ్డు తొలంగించుకోవాలనే మృదుల, ఆమె లవర్‌ ప్రవీణ్‌ ఇలా నాగమణి మర్డర్ ప్లాన్ వేశారని తేలింది. ప్రస్తుతం మృదుల, ప్రవీణ్ తో పాటు వారికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి