iDreamPost

AP హైకోర్టులో ఆంధ్రజ్యోతికి చుక్కెదురు

AP హైకోర్టులో ఆంధ్రజ్యోతికి చుక్కెదురు

తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్టను దిగజార్చడంతో పాటు భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా  టీటీడీలో అన్యమత ప్రచారం జరుగుతుందంటూ ఆంధ్రజ్యోతి 2019లో తప్పుడు కథనం రాసింది. ఈ క్రమంలో తమ పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా తప్పుడు కథనాలు రాసిందని ఆంధ్రజ్యోతిపై టీటీడీ తిరుపతి కోర్టులో రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసింది. అయితే తాజాగా  కేసు విషయంలో ఏపీ హైకోర్టులో ఆంధ్రజ్యోతికి చుక్కెదురైంది.

తిరుపతి కోర్టులో దావా వేసిన టీటీడీ .. తమ తరపున వాదనలు వినిపించేందుకు మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామకి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఒక అనుబంధ పిటిషన్ దాఖాలు చేసింది. ఈ నేపథ్యంలో టీటీడీ వేసిన పిటిన్ కు తిరుపతి కోర్టు అనుమతిస్తూ 2021లో మే1న ఉత్వర్యులు ఇచ్చింది. అయితే తిరుపతి కోర్టు  ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆంధ్రజ్యోతి పబ్లిషన్ కోగంటి వెంటకట శేషగిరి రావు, ఎడిటర్ కె. శ్రీనివాస్, ఎండీ వేమూరి రాధాకృష్ణ తదితరులు సివిల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. టీటీడీ తరపున వాదనలు వినిపించేందకు సుబ్రహ్మణ్యస్వామికి తిరుపతి కోర్టు ఇచ్చిన రద్దు చేయాలని కోరారు.

అయితే తాజాగా ఆంధ్రజ్యోతి యాజమాన్యం దాఖలు చేసిన పిటిషను ఏపీ హైకోర్టు కొట్టేసింది. తిరుపతి కోర్టు ఉత్తర్వులు లో ఎలాంటి తప్పు లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బీఎస్ భానుమతి శుక్రవారం ఉత్తర్యులు ఇచ్చారు. పిటిషను కొట్టివేసే సమయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ తరపున వాదనలు వినిపించేందుకు ఎవరిని నియమించుకోవాలన్నది టీటీడీ ఇష్టమని టీటీడీ తరపున సీనియర్ న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఈ విషయంలో జోక్యం చేసుకునే హక్కు ప్రతి వాదులకు లేదన్న ఆయన వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు.

పరువు నష్టం దావలో  జరుగుతున్న విచారణను జాప్యం చేసేందుకే  ఆంధ్రజ్యోతి యాజమాన్యం ఈ రివిజన్ పిటిషన్ దాఖలు చేసిందని సత్యనారాయణ ప్రసాద్ కోర్టు నివేదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ భానుమతి.. ఈ నెల 10న తీర్పు రిజర్వ్ చేశారు. శుక్రవారం తీర్పు వెలువరిస్తూ  ఆంధ్రజ్యోతి యాజమాన్యం దాఖలు చేసిన సివిల్ రివిజన్ పిటిషన్ కొట్టేశారు. మరి.. ఆంధ్రజ్యోతి దాఖలు చేసిన పిటిషన్ ను ఏపీ హైకోర్టు కోర్టు కొట్టి వేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: MLC కుంభా రవిబాబు చొరవతో.. Phd భారతికి SVUలో ఉద్యోగం!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి