iDreamPost

TTD Devotee: శ్రీవారి సేవలో 17 ఏళ్ల బాలిక అరుదైన రికార్డు! మహా మహా భక్తులకి దక్కని అదృష్టం ఇది!!

ఈ ఆధునిక కాలంలో కూడా ఆధ్యాత్మికంగా ఎంతో మంది పిల్లలు తమ ప్రతిభను, ఆసక్తి చూపిస్తున్నారు. రామనామాలు, కృష్ణుడి గీతాలు ఆలపిస్తూ..భక్తి  పారవశ్యంలో మునిగిపోతుంటారు. తాజాగా ఓ 17 ఏళ్ల బాలిక ఆధ్యాత్మిక పరంగా ఓ అరుదైన ఘనతను సాధించింది.

ఈ ఆధునిక కాలంలో కూడా ఆధ్యాత్మికంగా ఎంతో మంది పిల్లలు తమ ప్రతిభను, ఆసక్తి చూపిస్తున్నారు. రామనామాలు, కృష్ణుడి గీతాలు ఆలపిస్తూ..భక్తి  పారవశ్యంలో మునిగిపోతుంటారు. తాజాగా ఓ 17 ఏళ్ల బాలిక ఆధ్యాత్మిక పరంగా ఓ అరుదైన ఘనతను సాధించింది.

TTD Devotee: శ్రీవారి సేవలో 17 ఏళ్ల బాలిక అరుదైన రికార్డు! మహా మహా భక్తులకి దక్కని అదృష్టం ఇది!!

నేటికాలంలో పిల్లలు అనేక రికార్డులు సృష్టిస్తున్నారు. ఆయా రంగాల్లో తమదైన ప్రతిభతో, కృషితో అరుదైన ఘనతలు సాధిస్తున్నారు. క్రీడా రంగంలో, సాహిత్య రంగం, వైద్య, ఆర్థిక రంగం వంటి వాటిల్లో ఎంతో మంది యువత తమ ప్రతిభను నిరూపించారు. ఇదే సమయంలో సాంకేతిక ముసుగులో మునిగిపోతున్న ఈకాలంలో కూడా ఆధ్యాత్మికంగా ఎంతో మంది పిల్లలు తమ ప్రతిభను, ఆసక్తి చూపిస్తున్నారు. రామనామాలు, కృష్ణుడి గీతాలు ఆలపిస్తూ..భక్తి  పారవశ్యంలో మునిగిపోతుంటారు. తాజాగా ఓ 17 బాలిక ఆధ్యాత్మిక పరంగా అరుదైన ఘనత సాధించింది. అంతేకాక టీటీడీ చరిత్రలోనే ఆ బాలిక సాధించిన ఘనతే మొట్టమొదటిది. మరి.. వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

మత మార్పిడులకు అడ్డుకట్ట వేస్తూ, అందరిలో ఆధ్యాత్మిక భావన పెంపొందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో చర్యలు చేపట్టింది. హైందవ సంప్రదాయం చిన్నతనం నుంచే అందరిలో పరిమళించేలా శ్రీ‌వారి ఆల‌యం నుంచే టీటీడీ కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే పూర్వం నుంచి శ్రీ రామ కోటి  రాస్తున్నట్లుగా… గోవింద కోటి రాసే విధంగా టీటీడీ యువతకు, చిన్నారులను ప్రోత్సహిస్తోంది. అలానే ఈ గోవింద కోటి రాసేందుకు టీటీడీ కొన్ని ప్రత్యేక నియమాలను సూచించింది.

గోవింద కోటి రాసే వారి వయస్సు 25 ఏళ్ల లోపు ఉండాలని  తెలిపింది. ఒక్కసారి గోవింద కోటి పూర్తి అయినా భక్తునితో పాటు, వారి కుటుంబ స‌భ్యుల‌కు ఒక‌సారి స్వామివారి బ్రేక్ ద‌ర్శ‌నం టీటీడీ కల్పిస్తుంది. గోవింద కోటిని రాసిన గ్రంథాన్ని తిరుమలలోని ఆర్జితం కార్యాలయంకు అందజేయాలి. పూర్తి స్థాయిలో అధికారులు పరిశీలించిన పిమ్మట రాసిన వ్యక్తితో పాటుగా… వారి కుటుంబ సభ్యులల్లో ఐదుగురికి దర్శన భాగ్యాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం కల్పిస్తుంది. ఈక్రమంలో క్రమంలోనే  మొట్టమొదటిగోవింద కోటి రాసిన పుస్తకాన్ని శ్రీవారికి సమర్పించిన భక్తురాలిగా ఓ 17 బాలిక నిలిచింది. కర్నాటక బెంగళూరుకు చెందిన కీర్తన అనే 17 ఏళ్ల పాప 6 నెలల వ్యవధిలోనే గోవిందకోటి పూర్తి చేసింది. ఇటీవలే సోమవారం నాడు తిరుమలలోని అధికారుల ఆఫీస్ లో సమర్పించారు.

దీంతో టీటీడీ నిర్ణయం మేరకు కీర్తనతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకున్నారు. అనంతరం కీర్తన మీడియాతో మాట్లాడుతూ….. మొదటి గోవింద కోటి రాయడం చాలా సంతోషంగా ఉందని, తమ ఇంటి దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి గోవింద కోటి రాయాలని అనుకున్న తెలిపింది. గొప్ప కార్యక్రమంలో తానే మొదటి వ్యక్తి కావడం చాలా గర్వంగా ఉందని సంతోషం వ్యక్తం చేసింది. 1,00,01,116 సార్లు స్వామి వారి నామాలు వ్రాసి టీటీడీకి సమర్పించానని తెలిపారు. మొత్తంగా టీటీడీ చరిత్రలో తొలిసారి గోవిందా నామాల కోటి రాసి.. ఈ చిన్నారి అరుదైన రికార్డును సాధించింది. మరి.. ఈ చిన్నారి సాధించిన ఘనతపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి