iDreamPost

రెచ్చిపోయిన TDP, జనసేన కార్యకర్తలు.. అర్థరాత్రి వేళ మంత్రి విడదల రజిని ఆఫీసుపై దాడి

  • Published Jan 01, 2024 | 9:48 AMUpdated Jan 01, 2024 | 9:48 AM

Vidadala Rajini: ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని పార్టీ ఆఫీసు మీద రాళ్ల దాడి జరగడం సంచలనంగా మారింది. ఆ వివరాలు..

Vidadala Rajini: ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని పార్టీ ఆఫీసు మీద రాళ్ల దాడి జరగడం సంచలనంగా మారింది. ఆ వివరాలు..

  • Published Jan 01, 2024 | 9:48 AMUpdated Jan 01, 2024 | 9:48 AM
రెచ్చిపోయిన TDP, జనసేన కార్యకర్తలు.. అర్థరాత్రి వేళ మంత్రి విడదల రజిని ఆఫీసుపై దాడి

ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని పార్టీ ఆఫీసు మీద దాడి జరగడం సంచలనంగా మారింది. గుంటూరు వెస్ట్ లో ఆదివారం అర్థరాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. మంత్రి రజిని పార్టీ ఆఫీస్‎పై రాళ్లతో దాడి చేశారు టీడీపీ, జనసేన కార్యకర్తలు. ఈ దాడిలో ఆఫీసు అద్దాలు ధ్వంసమయ్యాయి. మంత్రి పార్టీ ఆఫీసు ఎదురుగానే ఎన్టీఆర్ విగ్రహం ఉంటుంది. దీనిని ఎన్టీఆర్ సర్కిల్ అని కూడా పిలుస్తారు స్థానికులు. కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా.. ఆదివారం అర్థ రాత్రి టీడీపీ కార్యకర్తలు పార్టీ జెండాలు పట్టుకొని ఈ ప్రాంతంలో ర్యాలీ చేస్తూ.. అక్కడే ఉన్న మంత్రి కార్యాలయం మీద దాడి చేశారు.

న్యూ ఇయర్ సందర్భంగా విడదల రజిని కార్యాలయం ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద అర్థరాత్రి తెలుగుదేశం, జనసేన నాయకులు ఓవరాక్షన్‌ చేశారు. మంత్రి కార్యాలయంపై రాళ్లు విసిరి.. బీభత్సం సృష్టించారు పచ్చ నేతలు. అంతటితో ఆగక కొందరు టీడీపీ కార్యకర్తలు.. మంత్రి  కార్యాలయంలోకి దూసుకెళ్లారు. ఆఫీసు అద్దాలను పగులగొట్టి నానా రభస చేశారు. ఆఫీసు ముందున్న ఫ్లెక్సీలను చించేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని టీడీపీ, జనసేన కార్యకర్తలను చెదరగొట్టారు.  గుంటూరు వెస్ట్‌లో ఏర్పాటు చేసిన తన ఆఫీసును మంత్రి రజిని నేడు ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో దాడి జరగడం సంచలనంగా మారింది.

attack on vidadala rajani office

జనవరి 1న అనగా సోమవారం ఉదయం 10 గంటలకు మంత్రి రజిని పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా.. కొందరు పని వాళ్లు.. నిన్న అర్థరాత్రి అక్కడ పనులు చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో రాళ్ల దాడి జరగడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. అక్కడ పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు సంబంధించి.. ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గొడవ జరిగినప్పటికీ.. ఈరోజు పార్టీ ఆఫీసును ప్రారంభించేందుకు అక్కడకు చేరుకోనున్నారు విడదల రజిని.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి