iDreamPost

ప్రతి జిల్లాకూ వేలాది ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు

ప్రతి జిల్లాకూ వేలాది ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖర్చుకు వెనుకాడకుండా కరోనా కట్టడికి అన్నీ చర్యలూ సత్వరంగా తీసుకుంటోంది. ఇప్పటికే వైరస్ నిర్దారణ పరీక్షలు 10 లక్షలకు చేరు వయ్యాయి. జూలై లో కరోనా మహమ్మారి మరింత ఉధృతం అవుతుందని కేంద్రం హెచ్చరించి న నేపథ్యంలో టెస్టుల నిర్వహణలో ఏపీ మరింత వేగం పెంచింది. ఆస్పత్రుల్లో అడ్మిషన్ల సమయంలో కరోనా అనుమానితుల పరీక్షల కోసం ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు వినియోగించుకోవాలని వైద్యారోగ్యశాఖ ఆదేశించింది.

జిల్లాకు మరో 20 వేల  కిట్లు

ఆంధ్రప్రదేశ్ లోని ప్రతీ జిల్లాకు 20 వేల చొప్పున ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టు కిట్లను ప్రభుత్వం పంపించింది. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులో పాజిటివ్ అని తేలితే తక్షణం చికిత్స ప్రారంభించి సదరు రోగిని ఐసోలేట్ చేయాలని జిల్లా కలెక్టర్లు, డీఎంహెచ్ఓలకు సూచనలు చేసింది. కరోనా లక్షణాలు కలిగి యాంటీజెన్ టెస్టులో నెగెటివ్ వస్తే అలాంటి వారికి మరోమారు రియల్ టైమ్‌లో ఆర్టీపీసీఆర్ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఆ ప్రాంతాల్లో నెగెటివ్ వచ్చినా..

హైరిస్కు కేసులు కలిగిన ప్రాంతాలు, కంటైన్మెంట్ జోన్లలో వ్యాధి లక్షణాలు కలిగి కరోనా నెగెటివ్ ఫలితాలు వచ్చిన వారిని కూడా పరీక్షించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆస్పత్రుల్లో గర్భిణులు, శస్త్ర చికిత్స చేయాల్సిన రోగులకు పరీక్షించేందుకు కూడా ఈ కిట్లు వినియోగించాలని వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది. క్వారంటైన్ కేంద్రాల్లో 10 రోజుల క్వారంటైన్ అనంతరం డిశ్చార్జి అవుతున్న వారిని కూడా ఈ కిట్లతో పరీక్షించవచ్చని సూచించింది. అయితే కరోనా లక్షణాలు కలిగి ఉన్న రోగులందరినీ డిశ్చార్జి చేసేందుకు ట్రూనాట్, ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి అని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కట్టడి ఇకపై మరింత పక్కాగా అమలు కానుంది. కొన్ని జిల్లాలకు ఇప్పటికే యాంటీజెన్ టెస్ట్ కిట్టులు చేరాయి. శాంపిల్స్ సేకరణ కార్యక్రమంలో సిబ్బంది వేగం పెంచారు. అతి త్వరలోనే కరోనా మహమ్మారి కట్టడి లో దూకుడు పెంచాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల అమలుకు అధికారులు క్షేత్ర స్థాయి కార్యాచరణలో నిమగ్నం అయ్యారు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి