ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరుగులు పెడుతోంది. అన్ని రంగాలు, విభాగాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు సీఎం జగన్. అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం ఫలాలు అందిస్తున్నారు. అన్నింటా ఏపీని నంబర్ వన్ చేయాలనే సత్సంకల్పంతో అహర్నిషలు ఆయన కష్టపడుతున్నారు. దీని ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంపై జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. ఇప్పుడు మరోమారు అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంది ఏపీ. ఇంధన సామర్థ్య ప్రాజెక్టు అమలు విషయంలో జగన్ సర్కారును అందరూ మెచ్చుకుంటున్నారు.
‘నవరత్నాలు’లో భాగంగా రాష్ట్రంలోని పేదలందరికీ ఇంటి పథకం కోసం ఎనర్జీ ఎఫిషియన్సీపై ఆంధప్రదేశ్ ప్రభుత్వం చూపుతున్న దృఢమైన అంకితభావానికి అంతర్జాతీయ ప్రశంసలు అందుకుంది. హౌసింగ్ డిపార్ట్మెంట్తో పాటు ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) సహకారంతో లబ్ధిదారులకు ఎనర్జీ ఎఫిషియన్సీ స్టార్ రేటెడ్ ఉపకరణాలను అందించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంది. దీని వల్ల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు గణనీయమైన ఇంధన వనరుల పరిరక్షణకు హామీ లభిస్తుంది.
గృహనిర్మాణ పథకంలో ఇంధన సామర్థ్య ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం అద్భుతంగా అమలు చేస్తోందని స్విట్జర్లాండ్ మెచ్చుకుంది. ఈ మేరకు ఢిల్లీలోని స్విట్జర్లాండ్ ప్రభుత్వ రాయబార కార్యాలయంలో ఎనర్జీ హెడ్ ఆఫ్ కోఆపరేషన్ అండ్ కౌన్సెలర్ జొనాథన్ డెమెంగే.. ఈఈఎస్ఎల్ సలహాదారులు ఎ.చంద్రశేఖర్ రెడ్డికి సందేశం పంపారు. ఏపీ ప్రభుత్వం పనితీరును ఆయన మెచ్చుకున్నారు. గ్రీన్హౌస్ గ్యాస్ ఎమిషన్ తగ్గింపుపై ప్రజల్లో అవగాహన పెంచడం ఇప్పుడు చాలా అవసరం అని అన్నారు. వాతావరణ మార్పులను సమర్థవంతంగా పరిష్కరించడంలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అత్యవసరమని డెమెంగే పేర్కొన్నారు.
ఇదీ చదవండి: బాబు జైల్లోనే ఉండాలని పవన్ ఫ్యాన్స్ పూజలు?