iDreamPost

ఏపీ ఓటెత్తిన రోజు

ఏపీ ఓటెత్తిన రోజు

ఏప్రిల్ 11వ తేదీ.. సరిగ్గా ఇదే రోజు ఆంధ్ర ప్రదేశ్ ఓట్లతో పోటెత్తింది. చంద్రబాబు ఐదేళ్ల పరిపాలన కాలంలో కరువుతో విసుగెత్తిపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ వద్ద ఉన్న వజ్రాయుధాన్ని బయటకు తీశారు. ఆంధ్రప్రదేశ్ లో మార్పును కోరుకుంటున్న ప్రజలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి పక్షాన నిలిచారు. అన్ని జిల్లాల్లో దాదాపు 80శాతం మేర పోలింగ్ నమోదవడం అప్పటి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కు నిదర్శనంగా నిలిచింది. రాష్ట్రంలో 3,93 45,717 ఓటర్లు ఉండగా 3,13,33,631 మంది ఓటేశారు.

రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజధాని కూడా లేని ఆంధ్రప్రదేశ్ కు పరిపాలన అనుభవం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే మేలు జరుగుతుందని ప్రజలు భావించారు. దాంతో పాటు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన రైతు, డ్వాక్రా రుణాల మాఫీ రైతులను, మహిళలను ఆకర్షించింది. ఆ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు టిడిపి కి పట్టం కట్టారు. అయితే ఐదేళ్ల కాలంలో రాష్ట్ర రాజధాని, అభివృద్ధి పై మాటలే తప్ప చేతల్లో చూపించిన చంద్రబాబు ప్రజల నెత్తిన రెండున్నర లక్షల కోట్ల రూపాయల అప్పు పెట్టారు. డ్వాక్రా, రైతు రుణమాఫీ ని ఆటకెక్కించి పసుపు కుంకుమ అంటూ ప్రజల చెవుల్లో పూలు పెట్టారు. దీనికితోడు రాష్ట్రంలో ఐదేళ్ళ పాటు కరువు విలయతాండవం చేసింది. చంద్రబాబు అధికారంలో ఉంటే కరువు ఉంటుందన్న నానుడి నిజమైంది. కృష్ణా డెల్టా పరిధిలోని గుంటూరు కృష్ణా జిల్లాలో గోదావరి డెల్టా పరిధిలోని గోదావరి జిల్లాలు మినహా రాష్ట్రంలోని రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు వలస బాట పట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు.

పోలింగ్ కోసం ఇతర ప్రాంతాలకు, రాష్ట్రాలకు వెళ్లిన ప్రజలు ఓటు వేసేందుకు బస్సుల్లో తండోపతండాలుగా తమ స్వగ్రామాలకు వచ్చారు. ప్రయాణ సమయంలో ప్రజల మధ్య ఎన్నికల పైన చర్చ జరిగింది. ప్రధానంగా ఎవరికి ఓటు వేయాలన్న దానిపై ప్రజలు చర్చించుకున్నారు. ప్రయాణాల్లో నిద్ర కూడా పోకుండా ఓటు ఎవరికి వేయాలన్న అంశంపై చర్చించుకున్న ప్రజలు బహిరంగంగానే.. ఈసారి జగన్ కి ఓటు వేయాలని మాట్లాడుకున్నారు. ఎన్నికలకు ముందు టిడిపి పసుపు కుంకుమ అంటూ జిమ్మికులు చేసినా, నగదు పంచినా ప్రజలు మార్పును కోరుకున్నారు. ఆచరణ సాధ్యమైన హామీలు ఇచ్చిన జగన్ వైపే నిలిచారు.

పోలింగ్ ముగిసిన మరుసటి రోజు కే చంద్రబాబు కి సీన్ అర్థం అయిపోయింది వైసిపి బిజెపితో కలిసి ఈవీఎం ట్యాంపరింగ్ పాల్పడిందని చంద్రబాబు విమర్శలు చేయడం ప్రారంభించారు. దీంతో ఓట్ల లెక్కింపు కు ముందే విజయం ఎవరిదో రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. 151 సీట్ల తో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైంది. టీడీపీ 23 సీట్లకు పరిమితం అవగా.. తొలిసారిగా పోటీ చేసిన జనసేన ఒక్క సిటు తో సరి పెట్టుకుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి