iDreamPost

110 ఏళ్లు.. ఇప్పటికీ ఒంటరి జీవితం! ఇతను మరణాన్ని జయించాడు!

  • Published Apr 27, 2024 | 6:55 PMUpdated Apr 27, 2024 | 6:55 PM

సాధారణంగా ఇప్పుడున్న జనరేషన్ లో చిన్న వయసు నుంచే అనగా 30 నుంచి 40 ఏళ్లు రాగానే.. ఎక్కడలేని నొప్పులు రోగాలు పుట్టుకొచ్చేస్తుంటాయి. వాటిలో ముఖ్యంగా.. కీళ్ల నొప్పులు, షుగర్, బీపీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే అమెరికాకు చెందిన ఓ వృద్ధుడు మాత్రం 110 ఏళ్ల వయసులో ఎటువంటి వ్యాధులు లేకుండా.. యువకుడిలా ఆరోగ్యంగా ఉన్నాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమేనండీ. ఇంతకీ అతను ఎవరు, ఎక్కడ ఉంటాడు..? అసలు అతని ఆరోగ్య రహస్యాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా ఇప్పుడున్న జనరేషన్ లో చిన్న వయసు నుంచే అనగా 30 నుంచి 40 ఏళ్లు రాగానే.. ఎక్కడలేని నొప్పులు రోగాలు పుట్టుకొచ్చేస్తుంటాయి. వాటిలో ముఖ్యంగా.. కీళ్ల నొప్పులు, షుగర్, బీపీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే అమెరికాకు చెందిన ఓ వృద్ధుడు మాత్రం 110 ఏళ్ల వయసులో ఎటువంటి వ్యాధులు లేకుండా.. యువకుడిలా ఆరోగ్యంగా ఉన్నాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమేనండీ. ఇంతకీ అతను ఎవరు, ఎక్కడ ఉంటాడు..? అసలు అతని ఆరోగ్య రహస్యాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Published Apr 27, 2024 | 6:55 PMUpdated Apr 27, 2024 | 6:55 PM
110 ఏళ్లు.. ఇప్పటికీ ఒంటరి  జీవితం! ఇతను  మరణాన్ని జయించాడు!

ప్రస్తుతం కాలంలో చాలామంది అతి చిన్న వయసులోనే భారీగా బరువు పెరిగిపోవడం, లేనిపోని అనారోగ్యలకు గురవుతూ ఉండటం వంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా.. ఇప్పుడైతే 30-40 ఏళ్లు వచ్చేసరికి ఎంతోమందికి ముసలి వాళ్లల రకరకాల నొప్పులు పుట్టుకొస్తున్నాయి. పైగా లేనిపోని మానసిక ఒత్తిళ్లకు గురవుతూ.. కనీసం 50 సంవత్సరాల పూర్తవ్వకుండానే రక్తపోటు, మధుమేహం అంటు అనేక అనారోగ్య సమస్యలు గురవుతూ సతమతమవుతున్నారు. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయినా ఓ పెద్ద ఆయన మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటాడు. పైగా అతడు అందరి వృద్ధులా 60 నుంచి 70 సంవత్సరాల మధ్య ఉంటాడు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ప్రస్తుతం అతడు 10 ఏళ్ల వయస్సు ఉన్నాడు. కానీ, ఇంతవరకు అతనికి ఎలాంటి అనారోగ్య సమస్య కూడా లేదు. పైగా ఆ వ్యక్తి యువకుడి వలె అదే చరిష్మాను కొనసాగిస్తున్నాడు. అదేంటి 110 ఏళ్ల వృద్ధుడు యువకుడిలా.. అది కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉన్నాడా..? అని ఆశ్చర్యంగా ఉండవచ్చు. కానీ, నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమేనండీ. ఇంతకీ అతను ఎవరు, ఎక్కడ ఉంటాడు..? అసలు అతని ఆరోగ్య రహస్యాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా ఇప్పుడున్న జనరేషన్ లో చిన్న వయసు నుంచే అనగా 30 నుంచి 40 ఏళ్లు రాగానే.. ఎక్కడలేని నొప్పులు రోగాలు పుట్టుకొచ్చేస్తుంటాయి. వాటిలో ముఖ్యంగా.. కీళ్ల నొప్పులు, షుగర్, బీపీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.  అయితే, 110 ఏళ్ల వయసులో ఉన్న ఓ వృద్ధుడు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాడు. పైగా అతడికి ఎటువంటి ఆనారోగ్య సమస్యలు కూడా లేవు. పైగా ఇప్పటికే ఆ యువకుడిలా ఆరోగ్యంగా ఉన్నాడు. మరి ఎలాంటి జబ్బులు లేకుండా.. తన ఆరోగ్యాన్ని కాపాడుకున్న ఈ వ్యక్తి  తన ఆహారపు అలవాట్ల గురించి తాజాగా వెల్లడించాడు. అయితే 110 ఏళ్ల వయసులో ఉన్న ఈ వ్యక్తి తన ఇంట్లో ఒంటరిగానే ఉంటున్నాడు. పైగా తన పనిని తానే సులువుగా చేసుకుంటున్నాడు. పైగా అతనికి ఒక్క ఆరోగ్య సమస్య కూడా లేకపోవడం గమన్హారం.

ఇక అత్యంత ప్రమాదకరమైన కేన్సర్, మతిమరుపు, వెన్నునొప్పి, బీపీ, తలనొప్పులు కూడా తనకు లేవని, ఇప్పటికి తాను చాలా ఫిట్ నెస్ గా ఉన్నానని తన రహస్యాన్ని బయటపెట్టాడు. అయితే ఇంతకి అతను ఎవరంటే.. అమెరికాలోని న్యూజెర్సీలో నివసిస్తున్న ‘విన్సెంట్ డ్రాన్స్‌ఫీల్డ్’. కాగా, అతను గత నెలలో తన 110వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఇక 100 సంవత్సరాల వయస్సు  దాటినప్పటికీ మంచి జీవితాన్ని గడుపుతున్న ప్రపంచంలోని అద్భుతమైన వ్యక్తులలో ఈయన కూడా ఒకరు. అయితే  డ్రాన్స్‌ఫీల్డ్ అగ్నిమాపక సంస్థలో పనిచేశాడు. ఇక అక్కడే అతను క్రమశిక్షణతో జీవించడం నేర్చుకున్నాడు. పైగా ఇంటి పనులకు కూడా ఇప్పటికి ఎవరినీ నియమించుకోలేదు. సొంతగా ఆయన పనులు చేసుకుంటారు. ఇక తమ ఆహారాన్ని కూడా తానే తయారు చేసుకుంటాడు.

అలాగే తన మూడంతస్తుల ఇంటిని  కూడా తానే శుభ్రం చేస్తాడు. అంతేకాకుండా.. మార్కెట్‌కి తానే డ్రైవ్ చేసుకుంటూ.. ఇంటికి ఏ వస్తువు  కావాలో తెచ్చిపెట్టుకుంటాడు. అయితే అతను తాను 1914లో జన్మించానని, ఇక తాను ఎప్పుడూ ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకోలేదని డ్రాన్స్‌ఫీల్డ్ చెప్పారు. ఈ కారణంగానే ఆయనకు మోకాళ్ల నొప్పులు తప్ప మరే ఇతర వ్యాధి లేవని చెప్పుకొచ్చాడు. అయితే డ్రాన్స్‌ఫీల్డ్ 20 ఏళ్ల వరకు సిగరెట్ తాగేవాడని అతని మనవరాలు తెలిపారు. అలాగే అతను 15 నుంచి 70 సంవత్సరాల వయస్సు వరకు పనిచేశారని చెప్పింది. ఇక అతను హాంబర్గర్లు, మిల్క్ చాక్లెట్, ఇటాలియన్ ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడతాట. అలాగే ఒక్కోసారి బీరు కూడా తాగుతా, దీనితో పాటు నాకు రోజూ కాఫీ తాగడం ఇష్టం అని విన్సెంట్ డ్రాన్స్‌ఫీల్డ్ తెలిపాడు . ఇక నా నా దగ్గర ఉన్న ఏకైక మంత్రం నేను ఇష్టపడేది చేయడమే, అది మనల్నీ మానసికంగా దృఢంగా ఉంచుతుంది, అతను చెప్పాడు. మరి, 110 ఏళ్ల వయసులో విన్సెంట్ డ్రాన్స్‌ఫీల్డ్ ఎటువంటి వ్యాధులు లేకుండా ఆరోగ్యంగా ఉండటం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలయజేయండి.

 

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి