iDreamPost

26 ఏళ్లు..150 కిలోలు.. ప్రాణం తీసిన బరువు తగ్గాలనే కోరిక!

Weight Loss Surgery: ఆ యువకుడి వయస్సు 26 ఏళ్లు మాత్రమే. ఉండాల్సిన దానికంటే అత్యధిక బరువు ఉండటంతో స్థూలకాయంతో బాధపడుతున్నాడు. ఎలాగైన తాను బరువు తగ్గాలని భావించాడు. ఆ కోరికే ఆ యువకుడి ప్రాణాలు పోయేందుకు కారణమైంది.

Weight Loss Surgery: ఆ యువకుడి వయస్సు 26 ఏళ్లు మాత్రమే. ఉండాల్సిన దానికంటే అత్యధిక బరువు ఉండటంతో స్థూలకాయంతో బాధపడుతున్నాడు. ఎలాగైన తాను బరువు తగ్గాలని భావించాడు. ఆ కోరికే ఆ యువకుడి ప్రాణాలు పోయేందుకు కారణమైంది.

26 ఏళ్లు..150 కిలోలు.. ప్రాణం తీసిన బరువు తగ్గాలనే కోరిక!

ప్రతి మనిషి ఏదో ఒక సమస్యతో బాధ పడుతునే ఉంటారు. అలానే కొందరు  పుట్టుకతోనే వివిద రకాల అనారోగ్య సమస్యలతో బాధ పడుతుంటారు. ఇది ఇలా ఉంటే..మరికొందరు నల్లగా, లావుగా ఉన్న తమ శరీరా ఆకృతి చూసుకుని మానసికంగా వేదనకు గురవుతుంటారు. ఇక తెల్లగా వచ్చేందుకు, లావు తగ్గేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే కొందరు ప్రాణాలు సైతం కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. తాజాగా 26 ఏళ్ల యువకుడు.. బరువు తగ్గించుకోవాలనే కోరికతో చేసిన ఓ పని ప్రాణాలు బలి తీసుకుంది. ఈ ఘటన తమిళనాడు రాష్టరంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

పాండిచ్చేరికి చెందిన హేమచంద్రన్‌ అనే 26 ఏళ్ల యువకుడు అధిక బరువుతో బాధ పడుతున్నాడు. అతడు 150 కిలోలకు పైగానే ఉన్నాడు. ఈ అధిక బరువు కారణంగా హేమచంద్రన్ తీవ్ర మానసికవేదనకు గురవుతున్నాడు. అలానే కొందరు అతడి చూసి హేళన సైతం చేసేవారని సమాచారం. ఈ క్రమంలోనే తాను ఎలాగైన బరువు తగ్గాలనే భావించాడు. బరువు తగ్గేందుకు తమిళనాడు, చెన్నైలోని బీపీ జైన్‌ ఆస్పత్రిని హేమచంద్రన్ సంప్రదించాడు. ఆస్పత్రి వైద్యులు బరువు తగ్గేందుకు శస్త్ర చికిత్స చేస్తామని  తెలిపారు. దీనికి అంగీకరించిన హేమచంద్రన్‌ కు ఈనెల 23వ తేదీన ఉదయం వైద్యులు శస్త్ర చికిత్స జరిపారు.

వైద్యులు చికిత్స చేసిన కాసేపటికే అతడి పరిస్థితి విషమించింది. ఆ వెంటనే అక్కడి వైద్యులు  రేలా ఆస్పత్రికి తరలించారు. ఆ  ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ యువకుడు శుక్రవారం రాత్రి చనిపోయాడు. ఈ శస్త్రచికిత్సకు రూ.8 లక్షలు ఖర్చయ్యాయని తెలుస్తోంది. అతడి మృతితో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. బరువు తగ్గి వస్తాడని అనుకుంటే.. విగతజీవిగా మారాడంచూ రోధించారు. అంతేకాక తమ బిడ్డ మృతికి చికిత్స చేసిన వైద్యులే కారణం అంటూ ఆస్పత్రి ఎదుట మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో యువకుడికి చికిత్స చేసిన ఆస్పత్రి పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. హేమచంద్రన్‌ ఘటన తమిళనాడు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపింది.

ఈ ఘటనపై స్టాలిన్ ప్రభుత్వం స్పందించింది. యువకుడి మృతి ఘటనపై విచారణకు ఆదేశించింది. మొత్తంగా 26 ఏళ్ల వయస్సులోనే బరువు తగ్గాలని  కోరుకున్న ఆ యువకుడు.. కొందరి నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలే కోల్పోయాడని పలువురు అభిప్రాయా పడుతున్నారు. గతంలోనూ కొందరు యువతులు అందంగా కనిపించేందుకు  వివిధ చికిత్సలు చేయించుకుని చివరకు దారుణగా తయారయ్యారు. కొందరికి అయితే వివిధ రకాల రోగాలు సైతం వచ్చాయి. అందుకే ఏదైనా సమస్య ఉన్నప్పుడు సహజ పద్ధతిలో ప్రయత్నిస్తే.. ఆలస్యం అయినా ఫలితాలు అనుకూలంగా ఉంటాయని పలువురు అభిప్రాయా పడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి