iDreamPost

అందుకే అవుట్‌డేటెడ్‌ అంటున్నారు

అందుకే అవుట్‌డేటెడ్‌ అంటున్నారు

ఆంధ్రప్రదేశ్‌ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌.. రాజకీయ పార్టీగా మాత్రమే మిగులుతుందని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఘనమైన చరిత్ర గల ఓ రాజకీయ పార్టీగా ఉన్న పేరును నిలిపేలా ఆ పార్టీ నేతలు రాజకీయాలు చేస్తే హుందాగా ఉంటుంది. కానీ ఆ పార్టీలో అడపాదడపా వాయిస్‌ వినిపించే ఏపీ అధ్యక్ష, కార్యనిర్వాహక అధ్యక్షులు.. సాకే శైలజానాథ్, తులసిరెడ్డిలు.. అవుట్‌డేటెడ్‌ పాలిటిక్స్‌ చేస్తూ కాంగ్రెస్‌ను నవ్వులపాలు చేస్తున్నారు.

కరోనా వైరస్‌ చికిత్సను ఆరోగ్యశ్రీలోకి వైసీపీ ప్రభుత్వం చేసిన తర్వాత కొన్ని రోజులకు.. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలోకి చేర్చాలని సాకే సైలజానాథ్‌ డిమాండ్‌ చేసి నవ్వులపాలయ్యారు. ఇప్పుడు ఇదే తరహాలోనే తులిసి రెడ్డి కూడా పయనించారు. రోజు వారీ రాజకీయాలను ఫాలో కాకుండా మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే నాలుక్కరుచుకోవాల్సిందే. మరీ ముఖ్యంగా ప్రభుత్వంపై విమర్శలు చేసే సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. పూర్వా పరాలు తెలుసుకుని, అత్యంత జాగ్రత్తగా విమర్శ చేయాల్సి ఉంటుంది. కానీ ఇవేమీ పట్టించుకోనట్లుగా ఉన్నారు తులసిరెడ్డి. ఈ రోజు ప్రారంభమైన వైఎస్సార్‌ జళకళ పథకంపై విమర్శలు చేశారు. బోరు వేస్తే సరిపోతుందా.. పంపుసెట్లు, విద్యుత్‌ కనెక్షన్‌ కూడా ఉచితంగా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ఉదయం ఆంధ్రజ్యోతి పత్రిక వైఎస్సార్‌ జళకళపై కథనం రాసింది. ఈ పథకం పాతదేనని చెబుతూ.. బోరు వేసి ఊరుకుంటే ఎలా మోటారు ఎవరిస్తారని పేర్కొంది. ఆ కథనాన్ని తులసి రెడ్డి చదివినట్లుగా ఉన్నారు. కానీ పథకం ప్రారంభంలో సీఎం జగన్‌ స్పీచ్‌ విననట్లుగా ఉన్నారు. మోటారు కూడా ప్రభుత్వమే ఉచితంగా బిగించి ఇస్తుందని సీఎం జగన్‌ ప్రకటించారు. ఇది గమనించని తులసి రెడ్డి ఉదయం ఆంధ్రజ్యోతి పత్రికలో రాసిన కథనం గుర్తు చేసుకుని తీరిగ్గా సాయంత్రం.. మోటారు, విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వాలనే డిమాండ్‌ వినిపించి నవ్వులపాయ్యారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి