ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ప్రజా సంక్షేమం కోసం అనేక సంస్కరణలు చేపట్టారు. అంతేకాక అన్ని వర్గాల ప్రజల అభివృద్దే ధ్యేయంగా ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారు. అభివృద్ధి పనులు ఒకవైపు, సంక్షేమ పథకాలు మరొక వైపు జోడెద్దుల పరుగులు పెడుతున్నాయి. ఇక మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతేనే కుటుంబం, రాష్ట్రం అభివృద్ధి పథంలో వెళ్తుందని సీఎం జగన్ బలంగా నమ్మారు. అందుకే మహిళల కోసం అనేక స్కీమ్ లో ప్రవేశ పెట్టారు. అలాంటి వాటిలో సున్నా వడ్డీకే రుణం ఒకటి. ఆగష్టు 10న సున్నవడ్డీ కార్యక్రమం నిర్వహించాలని సీఎం జగన్ సూచించారు.
సోమవారం పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. సీఎం జగన్ అధ్యక్షతన ఈ సమీక్ష సమావేశం చేపట్టారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం పలు కీలక సూచనలు చేశారు. గ్రామాల్లో సమగ్ర సర్వేపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. అలానే డిజిటల్ లైబ్రరీల నిర్మాణంపై కూడా దృష్టిపెట్టాలని, అర్బన్ ప్రాంతాల్లో కూడా డిజిటల్ లైబ్రరీలను తీసుకురావాలన్నారు. చేయుత కింద స్వయం ఉపాధి పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని సీఎం జగన్ సూచించారు.
ఇంకా సీఎం జగన్ మాట్లాడుతూ..” గ్రామీణాభివృద్ధి శాఖ కింద చేపట్టే ఉపాధి కార్యక్రమాలపై నిరంతరం సమీక్ష చేయాలి. కార్యక్రమాల పనితీరుపై మదింపు చేసేందుకు శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. నివేదికల ఆధారంగా యూనిట్లు విజయవంతగా నడిచేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. స్వయం ఉపాధి కార్యక్రమాల్లో మహిళలకు చేయూత నిచ్చి ..ముందుకు నడిపించడం కీలకం. ఆగష్టు 10న మహిళలకు సున్నావడ్డీ కార్యక్రమం నిర్వహించాలి” అని సీఎం జగన్ సూచించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్. జవహర్ రెడ్డి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. మరి.. ఈ సమీక్ష సమావేశంలో సీఎం జగన్ చేసిన కీలక సూచనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: వరద బాధితులకు అండగా సీఎం జగన్.. ఆర్థిక సాయం, నిత్యావసరాల పంపిణీ