iDreamPost

చంద్రబాబుకు మరో షాక్.. క్వాష్ పై వాదనలు వినాలంటూ సీఐడీ పిటిషన్

చంద్రబాబుకు మరో షాక్.. క్వాష్ పై వాదనలు వినాలంటూ సీఐడీ పిటిషన్

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఏపీ సీఐడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సిట్ విచారణ జరిపి రిమాండ్ రిపోర్టును తయారు చేసి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టింది. ఇరు వాదనలు విన్న కోర్టు సీఐడీ వాదనలతో ఏకీభవించి బాబుకు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. ఆ తర్వాత ఈ కేసులో అనూహ్య మలుపులు చోటుచేసుకున్నాయి. బాబు ఈ కేసు నుంచి బయటపడేందుకు క్వాష్ పిటీషన్, బెయిల్ పిటీషన్లు హైకోర్టులో దాఖలు చేశారు. దీనిపైన విచారణ జరిపిన కోర్టు ఆ పిటీషన్లను కొట్టేసింది. దీంతో బాబుకు హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. దీంతో చేసేదేం లేక సుప్రీం కోర్టును ఆశ్రయించాడు బాబు. సుప్రీం కోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో సీఐడీ చంద్రబాబుకు మరో షాక్ ఇచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో తన ప్రమేయం ఏమీ లేకున్న తప్పుడు ఆరోపణలతో తనను అరెస్టు చేశారని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారన జరిపిన హైకోర్టు ఏపీ సీఐడీ ప్రాథమిక విచారణలో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని క్వాష్ పిటీషన్ ను కొట్టేసింది. కాగా హైకోర్టులో షాక్ తగలడంతో సుప్రీంకోర్టులో క్వాష్ పిటీషన్ ను దాఖలు చేశారు. ఈ క్రమంలోనే ఏపీ సీఐడీ బాబుకు ఊహించని షాక్ ఇచ్చింది. క్వాష్ పిటీషన్ పై తమ వాదనలను వినాలని సుప్రీం కోర్టులో కేవియట్ పిటీషన్ ను దాఖలు చేసింది సీఐడీ. బాబు పిటీషన్ పై తమ వాదనలు వినకుండా నిర్ణయం తీసుకోవద్దని సుప్రీం కోర్టును కోరింది. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో బాబు పాత్రపై ఆధారాలు ఉన్నాయని సీఐడీ తెలిపింది. మరోవైపు అక్టోబర్ 3న సుప్రీం కోర్టు బాబు పిటీషన్ పై విచారణ చేయనున్నది. ఈ నేపథ్యంలో సీఐడీ కేవియట్ పిటీషన్ దాఖలు చేయడంతో బాబుకు షాక్ తగిలినట్లైంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి