iDreamPost

క్షమాపణ మీ ప్రకటనల స్థాయిలో ఉన్నాయా? బాబా రామ్‌దేవ్‌కు సుప్రీం చురకలు!

Patanjali Misleading Ads: పతంజలి ఆయుర్వేద సంస్థ తప్పుదోవ పట్టించే ప్రకటనకు సంబంధించిన దిక్కార కేసులో బాబా రామ్ దేవ్, మేనేజింగ్ డైరెక్టర్ బాలకృష్ణ కు సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

Patanjali Misleading Ads: పతంజలి ఆయుర్వేద సంస్థ తప్పుదోవ పట్టించే ప్రకటనకు సంబంధించిన దిక్కార కేసులో బాబా రామ్ దేవ్, మేనేజింగ్ డైరెక్టర్ బాలకృష్ణ కు సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

క్షమాపణ మీ ప్రకటనల స్థాయిలో ఉన్నాయా? బాబా రామ్‌దేవ్‌కు సుప్రీం చురకలు!

పతంజలి ఆయుర్వేత సంస్థ సహ వ్యవస్థాపకులు బాబా రామ్ దేవ్ అంటే ప్రత్యేక పరిచయం అక్కరలేదు. తన యోగ విన్యాసాలతో ప్రపంచ స్థాయిలో గొప్ప పేరు సంపాదించిన యోగ గురువు. కరోనా సమయంలో పతంజలి ఆయుర్వేద ఔషదం కరోనిల్ పై ప్రచారం చేయడంపై అభ్యంతరాలు తెలుపుతూ ఆయనపై సుప్రీం కోర్టులో పిటీషన్ వేసిన విషయం తెలిసిందే. అలాగే ఆయన పదే పదే కోర్టు దిక్కరణ పాల్పపడటం, తర్వాత క్షమాపణలు కోరడం జరిగింది. తాజాగా బాబా రామ్ దేవ్, పతంజలి ఆయుర్వేత సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బాలకృష్ణపై సుప్రీం కోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనిల్ ఔషద ప్రకటనలపై మంగళవారం మరోసారి తప్పుపట్టింది. వివరాల్లోకి వెళితే..

బాబా రామ్ దేవ్ ఆయన స్నేహితుడు బాలకృష్ణ గత కొంత కాలంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. కరోనా సమయంలో తప్పుదోవ పట్టించే ప్రకటనలు.. ఆ తర్వాత కోర్టు దిక్కరణ వ్యవహారంలో పతంజలి ఆయుర్వేద సంస్థ తీరును  సుప్రీం కోర్టు క్షమించే ప్రసక్తే లేదని చెబుతుంది. సుప్రీం కోర్టు కఠిన నిర్ణయం తర్వాత పలు మార్లు పతంజలి ఆయుర్వేదం క్షమాపణలు చెబుతూ వస్తుంది.  ఈ రోజు మంగళవారం విచారణలో ఆ కంపెనీ నిర్వాహకులు బాబా రాందేవ్, బాలకృష్ణలపై సుప్రీం కోర్టు మండిపడింది. జస్టిస్ హిమా కోహ్లీ ధర్మాసనంలో విచారణ జరిగింది. ‘ఈ రోజు న్యూస్ పేపర్ లో ఇచ్చిన క్షమాపణల ప్రకటన.. గతంలో పతంజలి ఉత్పత్తుల కోసం ఇచ్చిన ఫుల్ పేజీ ప్రకటనల మాదిరే ఉన్నాయా? మీరు కోరే ఆ క్షమాపణలు తాలూకు అక్షరాల సైజు కూడా ప్రకటనలప్పుడు ఇచ్చిన సైజులో ఉన్నాయా? ’ అంటూ ద్విసభ్య ధర్మాసనం ఇరువురిని ప్రశ్నిచింది.

ఇదిలా ఉంటే క్షమాపణలు కోసం పతంజలి లక్షలు వెచ్చించిందని, సుమారు రూ.10 లక్షలతో 67 పత్రికల్లో ప్రకటనలు ఇచ్చిందని పతంజలి తరుపు న్యాయవాది రోహిత్గీ కోర్టుకు తెలియజేశారు. దాని వల్ల మాకొచ్చిన ఇబ్బంది ఏమీ లేదని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. పతాంజలి పై కేసు వ్యవహారంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ర. 100 కోట్ల జరిమానా విధించాలంటూ ఒక విజ్ఞప్తి చేసిందని కోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించిది. దీనిపై అనుమానాలు ఉన్నాయని బెంజ్ పేర్కొంది.. అయితే ఆ అభ్యర్థులతో తమ క్లయింట్స్ ఏ సంబంధం లేదని లాయర్ రోహిత్గీ కోర్టుకు వివరణ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. పత్రికల్లో క్షమాపణలు మరింత పెద్ద సైజులో ప్రకటిస్తామని బాబా రాందేవ్ చెప్పడంతో ఈ కేసు విచారణ మరో వారం వాయిదా వేసింది సుప్రీం కోర్టు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి