iDreamPost

మరోసారి రాందేవ్ బాబాపై సుప్రీంకోర్టు సీరియస్..! చర్యలకు సిద్దంగా ఉండంటూ..

Supreme Court is Serious about Ramdev Baba: ప్రజలను తప్పదోవ పట్టించే ప్రకటనలు ఇచ్చారని పతంజలి సంస్థపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాందేవ్ బాబా రెండోసారి క్షమాపణలపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

Supreme Court is Serious about Ramdev Baba: ప్రజలను తప్పదోవ పట్టించే ప్రకటనలు ఇచ్చారని పతంజలి సంస్థపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాందేవ్ బాబా రెండోసారి క్షమాపణలపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

మరోసారి రాందేవ్ బాబాపై సుప్రీంకోర్టు సీరియస్..! చర్యలకు సిద్దంగా ఉండంటూ..

దేశంలో యోగాగురు రాందేవ్ బాబా గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఆయన ఒక హిందూ ఆధ్యాత్మిక గురువు. పతాంజలి ఆశ్రమాన్ని స్థాపించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల బాబా రాందేవ్ ఆధ్వర్యంలో మార్కెటింగ్ అవుతున్న పతంజలి ప్రొడక్టులపై నిషేదాలు విధించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ఆయనపై సుప్రీంకోర్టు పలుమార్లు సీరియస్ అయిన సంఘటనలు ఉన్నాయి. సుప్రీం కోర్టులో పతంజలి రామ్ దేవ్ బాబా కు బుధవారం మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. కరోనిల్ ప్రచారంపై రామ్ దేవ్ బాబా రెండోసారి చెప్పిన క్షమాపణపై సుప్రీం ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళితే..

సుప్రీం కోర్టు లో యోగాగురు రాందేవ్ బాబాకు బుధవారం ఎదురు దెబ్బ తగిలింది.కోవిడ్ సమయంలో ఆయన కరోనిల్ ప్రచారం చేశారు. అప్పట్లో దీనిపై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కోర్టు పలుమార్లు నోటీసులు పంపించినప్పటికీ సరైన రెస్పాన్స్ రాకపోవడం కోర్టు సీరియస్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే ఆయన కోర్టుకు క్షమాపణలు కోరారు. బుధవారం రాందేవ్ బాబా రెండోసారి చెప్పిన క్షమాపణ పై సుప్రీం ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. అంతేకాదు కోర్టు దిక్కరణ చర్యలకు రాందేవ్ బాబా సిద్దంగా ఉండాలని న్యాయస్థానం హెచ్చరించింది. పతంజలి ప్రొడక్ట్స్ కి సంబంధించి తప్పుదోవ పట్టించే ప్రకటనలు ప్రసారం చేసినందుకు పతంజలి ఆయుర్వేద్, రాందేవ్ బాబా-బాలకృష్ణ అందాించిన బేషరతు క్షమాపణలను అంగీకరరించడానికి బుధవారం, ఏప్రిల్ 10న సుప్రీం కోర్టు నిరాకరించింది.

ఈ కేసు విషయంలో పలు మార్లు కోర్టు ధిక్కార చర్యలను తెలికగా తీసుకున్నందుకు గాను వారిపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ మీ అఫివడవిట్ ని అంగీకరించడానికి మేం నిరాకరిస్తున్నాం. మీరు ఉద్దేశపూర్వకంగానే.. మా ఆదేశాలను పదే పదే ఉల్లంఘించినట్లు మేం భావిస్తున్నామని, క్షమాపణలు కాగితం మీద మాత్రమే ఉన్నాయి.. నిజానికి దీనికి వ్యతిరేకంగా మీరు వ్యవహరించారు. అఫిడవిట్ తిరస్కరణ తర్వాత దేనికైనా సిద్దంగా ఉండాలి’ అంటూ జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లతో కూడి ధర్మాసనం పేర్కొంది. ఇప్పుడు పతంజలి పై సుప్రీం కోర్టు తదుపరి చర్యలు ఎలా తీసుకోబోతుందో అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి