iDreamPost

జడ్జి హిమబిందుని దూషించిన వ్యక్తి అరెస్ట్! టీడీపీ నేతగా ధృవీకరణ!

జడ్జి హిమబిందుని దూషించిన వ్యక్తి అరెస్ట్!  టీడీపీ నేతగా ధృవీకరణ!

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు చేసి విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణకు హాజరు పర్చగా.. ఆ కోర్టు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి విదితమే. ఆ తర్వాత మరో రెండు రోజులు..తాజాగా అక్టోబర్ 5 వరకు రిమాండ్‌ను పొడిగించింది ఏసీబీ కోర్టు. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. వీటితో పాటు ఆయనపై ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, అంగళ్లు కేసులు కూడా నమోదయ్యాయి. ఇదిలా ఉంటే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఆయన కుమారుడు లోకేశ్ ను సైతం ఏ 14గా చేర్చింది సీఐడీ. స్కిల్ స్కాం కేసులో బయటపడేందుకు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా.. సెలవుల నేపథ్యంలో విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది.

అరెస్టు తర్వాత నుండి ఇప్పటి వరకు అన్ని చోట్ల చంద్రబాబుకు చుక్కెదురైంది. దీంతో టీడీపీ శ్రేణులు రెచ్చిపోతున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు కేసులకు సంబంధించిన పిటిషన్లపై విచారణ చేపడుతున్న జడ్జిలపై దారుణంగా సోషల్ మీడియాలో కామెంట్స్, మీమ్స్, ట్రోల్స్ చేస్తున్నారు. అసభ్యకర రీతితో పోస్టులు పెట్టడంపై ఏపీ హైకోర్టు కూడా సీరియస్ అయ్యింది.  వారికి నోటీసులు పంపాలని సూచించగా.. టీడీపీ నేత బుద్దా వెంకన్నతో పాటు పలువురుకు నోటీసులు జారీ అయ్యాయి. చంద్రబాబు జైలుకు వెళ్లేందుకు కారణమయ్యారంటూ ఏసీబీ జడ్జి హిమ బిందుపై విపరీతంగా, ఇష్టమొచ్చినట్లు అసభ్యకరమైన రీతిలో పోస్టులు దర్శనం ఇస్తున్నాయి. దీనిపై విచారణ చేపట్టిన నంద్యాల పోలీసులు.. తాజాగా ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. ఆ వ్యక్తి టీడీపీ వ్యక్తినేని పోలీసులు వెల్లడించారు.

టీడీపీ సోషల్ మీడియా రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ముల్లా ఖాజా హుస్సేన్.. జడ్జి హిమ బిందుపై అసభ్యకరమైన పోస్టులు పెట్టినట్లు పేర్కొన్నారు. పీజీ పూర్తి చేసిన ఖాజా.. ప్రస్తుతం ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. అతడు నేరం అంగీకరించినట్లు చెప్పారు. అతడిని కోర్టులో హాజరు పరుస్తామని వెల్లడించారు. టీడీపీ సోషల్ మీడియా రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి పదవిలో ఉండే తాను కావాలనే ఈ అసభ్యకర పోస్టులు పెట్టినట్లు ముల్లా ఖాజా హుస్సేన్ ఒప్పుకున్నారు. జడ్జి హిమ బిందుపై అనుచిత పోస్టులు పెట్టినట్లు అంగీకరించారు. దీన్ని చూస్తే ఎల్లో శ్రేణులు ఎంతకు భరితెంచాయో అర్థమౌతుందని భావిస్తున్నారు జనాలు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి