iDreamPost

APలో ఇల్లు మంజూరైన వారికి మరో గుడ్ న్యూస్! ప్రభుత్వం క్లారిటీ!

AP Govt Good News: ఇటీవల ఏపీలో పేద ప్రజలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల విషయంలో కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్నారు. దీనిపై ఏపీ సర్కార్ క్లారిటీ ఇచ్చింది.

AP Govt Good News: ఇటీవల ఏపీలో పేద ప్రజలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల విషయంలో కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్నారు. దీనిపై ఏపీ సర్కార్ క్లారిటీ ఇచ్చింది.

APలో ఇల్లు మంజూరైన వారికి మరో గుడ్ న్యూస్! ప్రభుత్వం క్లారిటీ!

ఆంధ్రప్రదేశ్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ది పథకాలు అమలు చేస్తున్నారు. విద్య, వైద్య, వ్యవసాయ, మహిళా సంక్షేమ కోసం వివిధ పథకాలు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. పాదయాత్ర సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నారు. ఏపీలో పేద ప్రజలకు సొంత ఇంటి కల నిజం చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల ఏపీలో పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు పంపినీ చేసిన సంగతి తెలిసిందే. అది ఒక విలువైన ఆస్తిగా పేదలకు ఇచ్చేందుకు రిజిస్ట్రేషన్ చేయడాన్ని తప్పు పడుతూ.. కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్నారు. దీనిపై లబ్దిదారులకు ఏపీ సర్కార్ క్లారిటీ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే..

ఆంధ్రప్రదేశ్ లో పేద ప్రజలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఇకపై ఇళ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్ చేయించిన వారికి బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకి రుణం తెచ్చుకనే అవకాశం ఉన్నట్లు ఏపీ సర్కార్ క్లారిటీ ఇచ్చింది. దీనికి సంబంధించి డేటా బేస్ లోనూ సమాచారం పదిలంగా ఉంటుందని.. రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఎప్పుడంటే అప్పుడు సర్టిఫైడ్ కాపీ పొందే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఫోర్జరీ, ట్యాంపర్ చేస్తారన్న భయం కూడా ఉండదని తెలిపారు. అవసరాలకు అమ్మాలనుకుంటే ఈ డాక్యుమెంట్ ఒకటి ఉంటే సరిపోతుందని అన్నారు. ఇటీవల ఓ వర్గం మీడియా వాళ్లు పట్టా రిజిస్ట్రేషన్ల పేరిట మోసాలు జరగుతున్నాయని అసత్య ప్రచారం చేస్తున్నారని.. లబ్దిదారులు వారి ప్లాట్ ఎక్కడ ఉందో గుర్తించలేని స్థితిలో ఉన్నారని చేస్తున్న ప్రచారాలు ఖండించారు. అవన్నీ అవాస్తవని తేల్చి చెప్పారు.

Another good news for AP house allottees

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం పేద ప్రజల సంక్షేమం కోసం అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని.. నిరుపేదలందరికీ ఇళ్ల పథకంలో భాగంగా ఇంటి స్థలంతో పాటు, ఇళ్లు కట్టించే సహకరిస్తామని జగన్ సర్కార్ తెలిపింది. ఇప్పటి వరకు ఇచ్చిన మాట కన్నా ఎక్కువగా 31 లక్షల 19 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి.. అందులో 22 లక్షల మందికి ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. ప్రస్తుతం లబ్దిదారులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు. ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేస్తుంది కనుక బ్యాంకులు రుణం మంజూరు చేస్తుందని అన్నారు. ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్ రిజిస్టర్ అయి ఉంటుంది కనుక డేటాబేస్ ఆ వివరాలను పదిలంగా భద్రపరుస్తుందని అన్నారు. ప్రత్యర్థులు చేసే అసత్య ప్రచారాలను ఎవరూ నమ్మవొద్దని జగన్ సర్కార్ క్లారిటీ ఇచ్చింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి