iDreamPost

మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. మహేష్ బాబు సినిమా చూసే రాజకీయాల్లోకి

  • Published Nov 28, 2023 | 8:41 AMUpdated Nov 28, 2023 | 8:41 AM

మంత్రి మల్లారెడ్డి మాస్ స్పీచ్ వింటే పూనకాలు లోడింగ్ అన్నట్లుగానే ఉంటుంది. ఇక తాజాగా మరోసారి తన మాస్ స్పీచ్ తో హాల్చల్ చేశారు మల్లారెడ్డి. యానిమిల్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మల్లా రెడ్డి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. ఆ వివరాలు..

మంత్రి మల్లారెడ్డి మాస్ స్పీచ్ వింటే పూనకాలు లోడింగ్ అన్నట్లుగానే ఉంటుంది. ఇక తాజాగా మరోసారి తన మాస్ స్పీచ్ తో హాల్చల్ చేశారు మల్లారెడ్డి. యానిమిల్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మల్లా రెడ్డి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. ఆ వివరాలు..

  • Published Nov 28, 2023 | 8:41 AMUpdated Nov 28, 2023 | 8:41 AM
మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. మహేష్ బాబు సినిమా చూసే రాజకీయాల్లోకి

మంత్రి మల్లారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన మాటలు వింటే.. ఫుల్ లెంత్ మాస్ ఎంటర్టైనర్ సినిమా చూసినట్లు అనిపిస్తుంది. పాలమ్మినా, పూలమ్మినా.. కష్టపడ్డా అంటూ మల్లారెడ్డి చేప్పిన డైలాగులు ఎంత ఫేమస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన ఎక్కడుంటే.. అక్కడ నవ్వులు వెల్లి విరియాల్సిందే. ఇక తాజాగా మంత్రి మల్లారెడ్డి మాస్ స్పీచ్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ సందర్భంగా మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహేష్ బాబు సినిమా చూసే తాను రాజకీయాల్లోకి వచ్చానని తెలిపాడు మంత్రి మల్లారెడ్డి. ఆ వివరాలు..

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, రష్మిక జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యానిమల్. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ వైల్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ డిసెంబర్ 1 న పాన్ ఇండియా వైడ్ గా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సినిమాలో అనిల్ కపూర్, బాబీ డియోల్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

విడుదల సమయం దగ్గరపడుతుండటంతో సోమవారం నాడు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్ కు డైరెక్టర్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిధులుగా విచ్చేశారు. ఇక వీరితో పాటు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి సైతం స్పెషల్ గెస్ట్ గా విచ్చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. ’’ఈరోజు మల్లారెడ్డి యూనివర్సిటీకి యానిమల్ చిత్రబృందం వచ్చింది. మహేష్ బాబు గారు.. నేను మీ సినిమా బిజినెస్ మేన్ చూసే రాజకీయాల్లోకి వచ్చాను. ఆ సినిమా పదిసార్లు చూసి ఎంపీ అయ్యాను. సేమ్ మోడల్.. సేమ్ సిస్టమ్. రణబీర్ నీకు నేనొక విషయం చెప్తాను. అప్పట్లోనే నేను చెప్పాను.. బాలీవుడ్, హాలీవుడ్ ను.. తెలుగు హీరోలు రూల్ చేస్తారు అని.. మా తెలుగువాళ్లు చాలా స్మార్ట్. రాజమౌళి, దిల్ రాజు.. ఇప్పుడు సందీప్ వచ్చాడు. హాలీవుడ్, బాలీవుడ్ ను మేం రూల్ చేస్తున్నాం‘‘ అన్నాడు.

’’మా తెలుగు ప్రజలు చాలా స్మార్ట్. పుష్పతో అల్లు అర్జున్.. దుమ్మురేపాడు.. ఇప్పుడు సందీప్ మరోసారి బాలీవుడ్ లో దుమ్మురేపుతాడు. మీరు మరో ఏడాదిలో హైదరాబాద్ కు షిఫ్ట్ అవుతారు. ముంబై ఓల్డ్ అయ్యింది.. బెంగళూరులో ట్రాఫిక్ జామ్. ఇక ఇండియాకున్న నగరం మా హైదరాబాద్ మాత్రమే‘‘అంటూ మాస్ స్పీచ్ తో దుమ్ములేపాడు మల్లారెడ్డి అంతేకాక మల్లారెడ్డి యూనివర్సిటీలో నాలుగుసార్లు అశ్వమేధ యాగం జరిగింది. ఇక్కడ ఇంజనీర్లు, డాక్టర్లు తయారవుతున్నారు. ఇక్కడ ఏ సినిమా రిలీజ్ అయినా కూడా 500 కోట్లు కలక్షన్స్ వస్తాయి .. పక్కా.. ఈ సినిమా సూపర్ హిట్” అంటూ ముగించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి