iDreamPost

వార్-2లో NTRకి జోడీగా యానిమల్ బ్యూటీ!

Tripti Dimri with NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ వార్-2. ఈ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ ఉంది. ఈ క్రమంలో తాజాగా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Tripti Dimri with NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ వార్-2. ఈ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ ఉంది. ఈ క్రమంలో తాజాగా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వార్-2లో NTRకి జోడీగా యానిమల్ బ్యూటీ!

టాలీవుడ్ సార్ట్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మోస్ట్ అవెయిటెడ్  మూవీ  వార్-2.  ఈ సినిమాతో తారక్ బాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నాడు. స్పై జోనర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నాడు.  ఇటీవలే వార్ షూట్ కోసం తారక్ ముంబైలో ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విజువల్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలానే ఈ సినిమా కోసం తారక్ అభిమానులు ఈగర్ గా ఉన్నారు. అలానే ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ ను తెలుసుకునేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే వార్ -2 ప్రాజెక్ట్ కు సంబంధించి ఓ క్రేజ్ న్యూస్ బయటకు వచ్చింది.

ఆర్ఆర్ఆర్ సినిమాతో నేషనల్ స్టార్ గా మారారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అంతేకాక సినిమాతో  దేశ వ్యాప్తంగా ఎన్టీఆర్ కి  ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో పెరిగింది. ప్రస్తుతం దేవర సినిమాతో తారక్ బిజీగా ఉన్నారు. ఇదే సమయంలో వార్-2తో తొలిసారి నేరుగా బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఎన్టీఆర్,  హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న ఈ మల్టీ స్టారర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల పది రోజుల షూటింగ్ కోసం ఎన్టీఆర్ ముంబైలో అడుగుపెట్టగా, ప్రస్తుతం హృతిక్-ఎన్టీఆర్ కాంబోలో ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాపై చాలానే రూమర్స్ వచ్చాయి. తాజాగా మరో ఇంట్రస్టింగ్ న్యూస్ కూడా ఒకటి వైరల్ అవుతోంది. అదే ఈ చిత్రంలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి నటిస్తుందంటూ  న్యూస్ చక్కర్లు కొడుతుంది.

యానిమల్ సినిమాలో త్రిప్తి దిమ్రి ఉన్నది తక్కువ సమయమే అయినా.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. ఈ సినిమాతో ఆమెకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. యానిమల్ సినిమాతో ఈ అమ్మడు నేషనల్ క్రష్ గా మారింది. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అయ్యింది. ఇంకా చెప్పాలంటే.. యానిమల్ సినిమాలో హీరోయిన్  రష్మిక మందన్న కంటే త్రిప్తికే ఎక్కువ క్రేజ్ వచ్చింది. అలాంటి బ్యూటీ ఇప్పటికే పలు సినిమాలో ఛాన్స్ లు కొట్టేసింది. అయితే తాజాగా త్రిప్తి మరో అద్భుతమైన ఆఫర్ ను కొట్టేసినట్లు టాక్ వినిపిస్తోంది.

ఈ బ్యూటీ వార్-2లో ఛాన్స్ కొట్టేసిందంటూ  ఓ న్యూస్ బయటకు వచ్చింది. అయితే త్రిప్తిని తారక్ జోడీగా తీసుకున్నారా లేక హృతిక్‌కి జంటగానా అనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. అలానే త్రిప్తి దిమ్రి వార్ 2లో భాగమైందనే దానిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం తారక్ నటిస్తున్న ఈ వార్ 2పై మంచి బజ్ ఉంది. తొలిసారి ఎన్టీఆర్ స్ట్రయిట్ బాలీవుడ్ మూవీ చేయడం ఓ కారణం అయితే, ఇందులో హృతిక్ రోషన్‌తో కలిసి నటించడం మరో కారణం. ఇక ఈ సినిమాలో తారక్ పాత్ర ఎలా ఉండబోతుందోనని  అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Triptii Dimri (@tripti_dimri)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి