iDreamPost

YCPకి రాజీనామా చేయడంపై క్లారిటీ ఇచ్చిన రాయుడు!

Ambati Rayudu: టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అనేక అనుమానాలు, ఆరోపణలు వినిపించాయి. తన రాజీనామాపై అంబటి రాయుడు క్లారిటీ ఇచ్చారు.

Ambati Rayudu: టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అనేక అనుమానాలు, ఆరోపణలు వినిపించాయి. తన రాజీనామాపై అంబటి రాయుడు క్లారిటీ ఇచ్చారు.

YCPకి రాజీనామా చేయడంపై క్లారిటీ ఇచ్చిన రాయుడు!

టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత్ తరపున పలు అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడి ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. అలానే ఐపీఎల్ లోనూ గుజరాత్, ముంబై ఇండియన్స్ జట్ల తరపున ఆడారు. అంతేకాక క్రికెట్  కి గుడ్ బై చెప్పాక పరోక్షంగా రాజకీయా కార్యక్రమాల్లో యాక్టివ్ గా ఉన్నారు. గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో సందర్శించి.. ఏపీ ప్రభుత్వం పాలనపై ప్రశంల వర్షం కురిపించారు. అయితే ఇటీవలే వైఎస్సార్ సీపీలో చేరిన అంబటి రాయుడు.. కొద్ది రోజుల్లోనే ఆ పార్టీకి రాజీనామా చేశారు. అయితే  వైసీపీకి రాజీనామా చేయడంపై అంబటి రాయుడు క్లారిటీ ఇచ్చారు.

కొంతకాలం క్రితం వరకు అంబటి రాయుడు రాజకీయాల్లో లేనప్పటికి.. ఆ కార్యక్రమాల్లో చాలా యాక్టీవ్ గా ఉండేవారు. ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల్లో తరచూ పర్యటిస్తూ ప్రభుత్వ పథకాలను పరిశీలించేవారు. ముఖ్యంగా గుంటూరు జిల్లాలోని వివిధ గ్రామాలను సందర్శించి.. ప్రభుత్వ అమలు చేస్తున్న పథకాల అమలను పరిశీలించారు. అంతేకాక జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలపై అంబటి రాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలోనే ఆయన వైసీపీలో చేరుతారనే వార్తలు వినిపించాయి. అయితే చాలా కాలం పాటు పరోక్షంగా వైసీపీ ప్రభుత్వం పాలనకు మద్దతుగా మాట్లాడారు.

Good bye to politics for cricket

ఇటీవలే సీఎం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో రాయుడు వైఎస్సార్ సీపీ కండువా కప్పుకున్నాడు. అయితే కేవలం పదిరోజుల వ్యవధిలోనే ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక అంబటి రాయుడు వైసీపీకి రాజీనామా చేయడంపై ప్రతిపక్ష టీడీపీ అసత్య ఆరోపణలుకు శ్రీకారం చుట్టుంది. జగన్ మోహన్ రెడ్డిపై వివిధ రకాల ఆరోపణలు చేశారు. అయితే తాజాగా తన రాజీనామాపై అంబటి రాయుడు క్లారిటీ ఇచ్చారు. తాను  మళ్లీ బ్యాట్ పట్టనున్నట్లు  అంబటి రాయుడు ప్రకటించాడు. వృతిపరమైన క్రీడను ఆడుతున్నందున రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉందంటూ ఎక్స్ లో అంబటి రాయుడు ట్వీట్ చేశారు. త్వరలో  దుబాయ్ లో జరగనున్న ఇంటర్నేషనల్ టీ20 లీగ్ లో ఆడనున్నట్లు ఆయన వెల్లడించారు.

ప్రొఫెషన్ క్రికెట్ లీగ్  ఆడాలంటేలే ఏ రాజకీయ పార్టీతో అనుబంధం ఉండకూడదని, అందుకే వైసీపీ రాజీనామా చేసినట్లు రాయుడు చెప్పుకొచ్చారు. ఇంటర్నేషనల్ లీగ్లో రాయుడు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీతో జతకట్టనున్నాడు. రాయుడు గతంలో ఐసీఎల్ లోనూ ముంబై ఇండియన్స్ తరపున రాయుడు ఆడారు. ఇక దుబాయ్ లో జరిగే ఇంటర్నేషనల్ టీ20 లీగ్ జనవరి 20 నుంచి ప్రారంభం కానుంది. మొత్తంగా ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలకు అంబటి రాయుడు గట్టి సమాధానం ఇచ్చారని పలువురు వైసీపీ నేతలు అన్నారు. మరి.. అంబటి రాయుడు చేసిన ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి