Swetha
విజయ్ దేవర కొండ, మృణాల్ ఠాకూర్ నటించిన "ఫ్యామిలీ స్టార్" చిత్రాన్ని.. ఏప్రిల్ 5న విడుదల చేయబోతున్న విషయాన్నీ ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలో ఇప్పుడు "ఫ్యామిలీ స్టార్" చిత్రం ఓటీటీ డీల్ కూడా భారీ ధరలకు.. ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ కొనుగోలు చేసినట్లు సమాచారం.
విజయ్ దేవర కొండ, మృణాల్ ఠాకూర్ నటించిన "ఫ్యామిలీ స్టార్" చిత్రాన్ని.. ఏప్రిల్ 5న విడుదల చేయబోతున్న విషయాన్నీ ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలో ఇప్పుడు "ఫ్యామిలీ స్టార్" చిత్రం ఓటీటీ డీల్ కూడా భారీ ధరలకు.. ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ కొనుగోలు చేసినట్లు సమాచారం.
Swetha
విజయ్ దేవర కొండ, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా .. డైరెక్టర్ పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న తాజా చిత్రం “ఫ్యామిలీ స్టార్”. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్, ఈ చిత్రం నుండి విడుదల చేసిన సాంగ్స్ .. ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5 న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. విడుదలకు ఇంకా కొద్ది రోజులు సమయం మాత్రమే ఉండడంతో.. చిత్ర బృందం మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పనులు కూడా పూర్తయినట్లు సోషల్ మీడియాలో ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు. అయితే, ఇప్పుడు “ఫ్యామిలీ స్టార్” చిత్రం ఓటీటీ డీల్ భారీ ధరలకు ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ కొనుగోలు చేసినట్లు సమాచారం. దీనికి సంబందించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఇప్పటికే పరశురామ్, విజయ్ కాంబినేషన్ లో వచ్చిన గీత గోవిందం చిత్రం సాధించిన విజయం గురించి అందరికి తెలిసిందే. దీనితో ఇప్పుడు వీరిద్దరూ కలిసి జత కట్టడం, అంతే కాకుండా సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగ దగ్గరయ్యిన మృణాల్ ఠాకూర్.. ఈ సినిమాలో విజయ్ తో కలిసి నటించడంతో.. “ఫ్యామిలీ స్టార్” చిత్రం పైన .. అభిమానులకు హోప్స్ బాగా పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ కు .. ఆడియన్స్ నుంచి పోజిటివ్ టాక్ లభించింది. ఇక “ఫ్యామిలీ స్టార్” చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో.. దిల్ రాజు, శిరీష్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 5న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా థియేటర్స్ లో విడుదల చేయబోతున్నారు. ఇక “ఫ్యామిలీ స్టార్” ఓటీటీ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడు పోయినట్లు సమాచారం. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో.. భారీ ధరకు సొంతం చేసుకుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మార్చి19న అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
అయితే, ఫ్యామిలీ స్టార్ ఓటీటీ డీల్ మంచి ధరకే ముగియడంతో.. ఇక ఇప్పుడు నిర్మాతల ఫోకస్ అంతా థియేట్రికల్ రన్ మీదే ఉంది. పైగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలో 54వ చిత్రంగా ఫ్యామిలీ స్టార్.. రూపొందించబడుతోంది. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ ద్వారా సుమారు రూ.50 కోట్లు రావాలని దిల్ రాజు భావిస్తున్నట్లు ఇన్సైడ్ టాక్. అయితే ఇప్పటికే ఓటీటీ డీల్ మంచి ధరకే క్లోజ్ అవ్వడంతో.. పెట్టుబడి విషయంలో దిల్ రాజు సేఫ్ అని అనుకుంటున్నారు. మరి, విడుదల తర్వాత ఈ సినిమా ఎటువంటి టాక్ సంపాదించుకుంటుందో వేచి చూడాలి. మరి, “ఫ్యామిలీ స్టార్” సినిమా ఓటీటీ డిజిటల్ రైట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.