iDreamPost

వీడియో: మగ బిడ్డకు జన్మనిచ్చిన అమలా పాల్.. పేరు కూడా పెట్టేశారు!

Amala Paul Blessed With Baby Boy: అమలా పాల్ ఇంట సంబరాలు అంబరాన్ని అంటాయి. ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అలాగే పేరును కూడా రివీల్ చేసింది.

Amala Paul Blessed With Baby Boy: అమలా పాల్ ఇంట సంబరాలు అంబరాన్ని అంటాయి. ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అలాగే పేరును కూడా రివీల్ చేసింది.

వీడియో: మగ బిడ్డకు జన్మనిచ్చిన అమలా పాల్.. పేరు కూడా పెట్టేశారు!

స్టార్ హీరోయిన్ అమలా పాల్ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో ఎన్నో అద్భుతమైన చిత్రాలు చేసింది. అలాగే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ప్రస్తుతం సౌత్ లో చాలా బిజీ హీరోయిన్ గా కూడా మారిపోయింది. అంతేకాకుండా నిర్మాతగా మారి సొంతంగా సినిమాలు కూడా చేసేస్తోంది. అయితే అమలా పాల్ అన్నింటికన్న అత్యంత ముఖ్యమైన రోల్ ను స్వీకరించింది. అదే అమ్మగా తన సమయాన్ని తాను ఎంతగానో ఆస్వాదిస్తోంది. అమలా పాల్ గర్భవతి అని అందరికీ తెలిసిందే ఇటీవలే నిండు గర్భంతో స్టెప్పులేసిన వీడియో కూడా అంతా చూశారు. అయితే ఇంకా డెలివరీ కాలేదా అని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే అమలా పాల్ కి డెలివరీ జరిగి దాదాపుగా వారం కావొస్తోంది.

ఒక వైరల్ రీల్ తర్వాత అమలా పాల్ ఇన్ స్టాగ్రామ్, సోషల్ మీడియా పేజెస్ అన్నీ సైలెంట్ అయిపోయాయి. అయితే బిడ్డ, డెలివరీ విషయంలో మాత్రం ఎలాంటి అప్ డేట్ రాలేదు అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఆ శుభవార్తను ఈ హీరోయిన్ తాజాగా ఫ్యాన్స్ తో పంచుకుంది. ఆమెకు పండంటి మగ బిడ్డ పుట్టాడు. అది కూడా డెలివరీ జూన్ 11నే జరిగింది. బిడ్డను తీసుకుని భార్యా భర్తలు ఎంతో సంతోషంగా ఇంటికి కూడా తిరిగి వచ్చేశారు. ఆ వీడియో షేర్ చేస్తూ అమలా పాల్ తన సంతోషాన్ని అందిరితో పంచుకుంది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

అంతేకాకుండా కాకుండా అమలా పాల్ దంపతులు బాబుకు పేరు కూడా పెట్టేశారు. ఆ విషయాన్ని కూడా తన ఇన్ స్టాగ్రామ్ పోస్టులో క్యాప్షన్ గా పెట్టింది. ఇట్స్ ఏ బోయ్ అని చెప్తూనే.. అతనికి ఇలాయ్(ILAI) అని పేరు పెట్టిన విషయాన్ని వెల్లడించింది. వినడానికి కాస్త కొత్తగా ఉన్నా కూడా పేరు మాత్రం చాలా బాగుంది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అమలా పాల్ కు డెవలిరీ జరిగి దాదాపుగా వారం కావొస్తోంది. జూన్ నెల 11వ తారీఖున తాను బిడ్డకు జన్మనిచ్చింది. కానీ, ఆ విషయాన్ని మాత్రం ఇప్పటి వరకు బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు నేరుగా ఇంటికి తీసుకొచ్చిన వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో.. అమలా పాల్ కొడుకు పేరు వైరల్ అవుతోంది. మరి.. అమలా పాల్ దంపతులుకు కామెంట్స్ రూపంలో మీ శుభాకాంక్షలు తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Jagat Desai (@j_desaii)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి