iDreamPost
android-app
ios-app

పుష్ప-2 షూటింగ్‌లో అల్లు అర్జున్‌కు ప్రమాదం.. పిక్ వైరల్

  • Published Feb 10, 2024 | 12:06 PM Updated Updated Feb 10, 2024 | 12:06 PM

పుష్పతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయాడు అల్లు అర్జున్. ఇప్పుడు పుష్ప-2తో రాబోతున్నాడు. ఈ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఆగస్టు 15కు ఈ మూవీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు మేకర్స్. అయితే..

పుష్పతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయాడు అల్లు అర్జున్. ఇప్పుడు పుష్ప-2తో రాబోతున్నాడు. ఈ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఆగస్టు 15కు ఈ మూవీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు మేకర్స్. అయితే..

  • Published Feb 10, 2024 | 12:06 PMUpdated Feb 10, 2024 | 12:06 PM
పుష్ప-2 షూటింగ్‌లో అల్లు అర్జున్‌కు ప్రమాదం.. పిక్ వైరల్

‘పుష్ప.. పుష్ప రాజ్’ ఒక్క డైలాగ్, ‘సామి రారా సామి’ స్టెప్పులతో ఆల్ ఓవర్ ఇండియా షేక్ చేసేసిన మూవీ పుష్ప. లెక్కల మాస్టారు సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం ఎంతటి బజ్ క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. ఈ మూవీకి‌గానూ నేషనల్ అవార్డును కూడా అందుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇప్పుడు ఈ మూవీ సీక్వెల్స్ తెరకెక్కిస్తోంది చిత్ర యూనిట్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సీక్వెల్ పై భారీ అంచనాలున్నాయి. అయితే ఇప్పుడు ఓ ఇంటస్ట్రింగ్ బజ్ క్రియేట్ అవుతుంది. పుష్ప 3 కూడా ఉండబోతుందంటూ వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఆగస్టు 15న సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.. ఇప్పుడు మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ సినిమా కోసం బన్నీ ప్రాణాలే పెట్టేస్తున్నాడు. తాజాగా మరోసారి అల్లు అర్జున్ గాయపడ్డాడని తెలుస్తోంది. దీంతో తృటిలో పెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్నారు. ఈ కారణంగా షూటింగ్ వాయిదా పడినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఒకటి పిక్ బయటకు వచ్చి వైరల్ అవుతుంది. ఇందులో అల్లు అర్జున్ ఎడమ చేతికి దెబ్బతగిలినట్లు తెలుస్తోంది. గంగమ్మ జాతర కోసం కొన్ని సీన్లు తీస్తున్నారట. ఆ సమయంలో వచ్చే ఓ సన్నివేశంలో ఈ ఐకాన్ స్టార్ గాయపడ్డాడని తెలుస్తోంది. గంగమ్మ జాతరను బేస్ చేసుకుని భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతుందని టాక్. ఆ సమయంలోనే ఈ నేషనల్ అవార్డు యాక్టర్ గాయపడ్డాడని సమాచారం. ఆ ఫోటోలో చేతికి కట్టు కట్టుకుని కనిపించాడు ఈ నటుడు.

దీంతో ఆగస్టు 15కు కూడా విడుదలవుతుందా అనే అనుమానాలు వస్తున్నాయి. ఇండిపెండెంట్ డే నాడు రిలీజ్ కాకపోతే.. ఇక దసరానే టార్గెట్ కానుంది. ఇప్పటి వరకు 70 పర్సెంట్ షూటింగ్ పూర్తయ్యిందని, వచ్చే మూడు నెల్లలో మొత్తం షూటింగ్ కంప్లీట్ చేయాలని అనుకుంటున్న సమయంలో అల్లు అర్జున్‌కు ఇలా జరిగింది. మొన్నటికి మొన్న అల్లు అర్జున్ చీరలో కనిపించిన ఓ పిక్ లీకైన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ విషయానికి వస్తే.. భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీలో రష్మిక మందన్న, పహాద్ ఫజిల్, అనసూయ, సునీల్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అల్లు అర్జున్ గాయపడటం ఇది తొలిసారి కాదూ.. గత డిసెంబర్ సమయంలో కూడా పుష్ఫ-2 షూటింగ్ సమయంలోనే గాయపడ్డారని వార్తలు వినిపించాయి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetstarzbetstarzbetStarzbetjojobetgrandpashabetcasibomcasibomcasibombetcio giriş