iDreamPost

లేడీ ఫ్యాన్​కు సాయం చేసిన అల్లు అర్జున్.. అసలు ఎవరీ అశ్విని..?

  • Author singhj Updated - 12:22 PM, Fri - 1 December 23

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక లేడీ ఫ్యాన్​కు చేసిన సాయం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక లేడీ ఫ్యాన్​కు చేసిన సాయం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

  • Author singhj Updated - 12:22 PM, Fri - 1 December 23
లేడీ ఫ్యాన్​కు సాయం చేసిన అల్లు అర్జున్.. అసలు ఎవరీ అశ్విని..?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్​కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ గురించి స్పెషల్​గా చెప్పనక్కర్లేదు. ఒక్కో సినిమాతో స్టార్ కథానాయకుడిగా మారిన బన్నీ.. తెలుగు రాష్ట్రాలతో పాటు మలయాళంలోనూ అంతే ఇమేజ్ సంపాదించుకున్నారు. అల్లు అర్జున్​ను మలయాళీలు ముద్దుగా మల్లు అర్జున్ అని పిలుచుకుంటారు. ఈ ప్రేమ పేరులోనే కాదు బాక్సాఫీస్ కలెక్షన్లలోనూ చూపిస్తారు. బన్నీ గత చిత్రం ‘పుష్ప’ తెలుగుతో పాటు మలయాళంలోనూ బ్లాక్ బస్టర్​గా నిలిచింది. ఇక, హిందీలోనైతే రూ.100 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్​తో సంచలనం రేపింది. టాలీవుడ్ నుంచి తన బాలీవుడ్ వరకు పెంచుకున్ అల్లు అర్జున్ నుంచి నెక్స్ట్ మూవీ ఎప్పుడు వస్తుందా అని అభిమానులతో పాటు సాధారణ మూవీ లవర్స్ కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

వచ్చే ఏడాది ‘పుష్ప 2’ ప్రేక్షకుల్ని అలరించనుంది. ఇక, అల్లు అర్జున్​కు సోషల్ మీడియాలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. తెలుగు హీరోల్లోనూ అత్యధికంగా ఇన్​స్ట్రాగ్రామ్​లో 23.5 మిలియన్ల మంది ఫాలోవర్లను ఆయన కలిగి ఉన్నారు. ‘పుష్ప’తో ఉత్తరాదిన కూడా ఆయనకు ఫాలోయింగ్ అమాంతం పెరిగింది. అలాంటి బన్నీ ఒక లేడీ ఫ్యాన్​తో చేసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటు వేసేందుకు వచ్చిన ఆయన్ను ఓ లేడీ అభిమాని కలిశారు. ఆమె పేరు అశ్విని. ఇన్​స్టాలో వీడియోలు చేసే ఆమె కోసం బన్నీ స్వయంగా తనే ఓ వీడియో తీశారు. ‘నీకు బాగా ఫాలోవర్స్ రావాలని కోరుకుంటున్నా. ఎంత మంది ఫాలోవర్స్ కావాలి? ఇప్పుడు ఎంత మంది ఉన్నారు’ అని అశ్వినీని బన్నీ అడిగారు.

ప్రస్తుత 13కే ఫాలోవర్స్ ఉన్నారని.. 20కే నుంచి 30కే ఫాలోవర్స్ కావాలని అల్లు అర్జున్​ ప్రశ్నకు సమాధానంగా చెప్పింది అశ్విని. దీంతో ఈ వీడియోతో 30కే వస్తారా? అని బన్నీ క్వశ్చన్ చేశారు. అందుకు లేడీ ఫ్యాన్ వస్తారని అంది. లేడీ ఫ్యాన్​తో అల్లు అర్జున్ తీసిన సెల్ఫీ వీడియోకు ఇన్​స్టాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. అనుకోని విధంగా అశ్విని ఇన్​స్టా అకౌంట్​లో ఫాలోవర్స్ పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ అశ్విని ఎవరు? అని అందరూ సెర్చ్ చేస్తున్నారు. బన్నీ ఆమెతో కలసి ఇన్​స్టా రీల్ చేసేంత పరిచయం ఉందా? అని అందరిలోనూ సందేహం మొదలైంది. ఈ క్రమంలోనే అశ్విని గురించి సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు.

చాన్నాళ్లుగా అల్లు అర్జున్ ఇంట్లో అశ్విన్ పనిచేస్తోందని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. గతంలో కూడా బన్నీతో ఆమె దిగిన ఫొటోలను షేర్ చేయడాన్ని గుర్తుచేస్తున్నారు. అల్లు అయాన్, అల్లు అర్హ వీడియోల్లో కూడా ఈ అమ్మాయి కనిపిస్తోందని చెబుతున్నారు. అశ్విని కోరిక మేరకు ఫాలోవర్స్ పెంచాలనే ఉద్దేశంతోనే అల్లు అర్జున్ స్పెషల్ ఇన్​స్టా రీల్ చేశారని తెలుస్తోంది. ఈ రీల్ చేయకముందు వరకు ఆమెకు 13కే ఫాలోవర్స్ ఉండగా.. కొన్ని గంటల్లోనూ పెరుగుతూ దాదాపు 20కే వరకు చేరుకోవడం గమనార్హం. మరి.. లేడీ ఫ్యాన్​కు ఫాలోవర్స్ పెంచాలనే ఉద్దేశంతో బన్నీ చేసిన పనిపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: నయన్‌కు విగ్నేష్‌ సర్‌ప్రైజ్‌ గిప్ట్‌.. ధర తెలిస్తే షాక్‌ అవుతారు!

 

View this post on Instagram

 

A post shared by _its_me_ashwini_❤️‍🩹 (@_its_me_ashwini_23)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి