iDreamPost

Allu Arjun: అల్లు అర్జున్​ సెన్సేషనల్ రికార్డ్.. సౌత్​లో తొలి యాక్టర్​గా..!

  • Published Mar 21, 2024 | 9:52 AMUpdated Mar 21, 2024 | 9:52 AM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సెన్సేషనల్ రికార్డు క్రియేట్ చేశారు. ఈ ఘనత సాధించిన తొలి సౌత్ యాక్టర్​గా బన్నీ నిలిచారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సెన్సేషనల్ రికార్డు క్రియేట్ చేశారు. ఈ ఘనత సాధించిన తొలి సౌత్ యాక్టర్​గా బన్నీ నిలిచారు.

  • Published Mar 21, 2024 | 9:52 AMUpdated Mar 21, 2024 | 9:52 AM
Allu Arjun: అల్లు అర్జున్​ సెన్సేషనల్ రికార్డ్.. సౌత్​లో తొలి యాక్టర్​గా..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక్క సినిమాతోనే పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఆయన కెరీర్​ను ‘పుష్ప’కు ముందు, ఆ తర్వాత అని చెప్పక తప్పదు. అంతలా ఈ సినిమా బన్నీ ఇమేజ్​లో మార్పు తీసుకొచ్చింది. ఈ మూవీకి ముందు వరకు ఆయన నటించిన చిత్రాలు తెలుగుతో పాటు మలయాళంలో మాత్రమే విడుదలయ్యేవి. ఆ తర్వాత టీవీల్లో హిందీలోనూ టెలికాస్ట్ అయ్యేవి. అయితే ఉత్తరాదిన బన్నీకి ఎంత ఇమేజ్, క్రేజ్ ఉందో ‘పుష్ప’ రిలీజ్​తో తెలిసొచ్చింది. ఈ మూవీతో బాలీవుడ్​లో రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్​తో సంచలనం సృష్టించారు బన్నీ. ఫస్ట్ పార్ట్ మెగా హిట్ అవడంతో ‘పుష్ప 2’ను మరింత లావిష్​గా తీస్తున్నారు సుకుమార్. ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్ మరో సెన్సేషనల్ రికార్డు క్రియేట్ చేశారు.

ఇన్​స్టాగ్రామ్​లో ఎంతో యాక్టివ్​గా ఉండే బన్నీ.. ఆ ప్లాట్​ఫామ్​లో 25 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకున్నారు. దీంతో సౌత్​లో 25 మిలియన్ల ఫాలోవర్లను కలిగిన తొలి యాక్టర్​గా ఆయన రికార్డులకెక్కారు. అల్లు అర్జున్ తర్వాత విజయ్ దేవకరొండ (21.3 మిలియన్లు), రామ్ చరణ్​ (20.8 మిలియన్లు), దుల్కర్ సల్మాన్ (14.1 మిలియన్లు), యశ్ (13.5 మిలియన్లు), మహేశ్ బాబు (13.4 మిలియన్లు), ప్రభాస్ (11.7 మిలియన్లు), దళపతి విజయ్ (10.8 మిలియన్లు) ఉన్నారు. మహేష్, ప్రభాస్, చరణ్ లాంటి వాళ్లను కాదని.. ఇన్​స్టా ఫాలోవర్స్ విషయంలో రికార్డు క్రియేట్ చేశారు అల్లు అర్జున్. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు.

Allu Arjun sensational record

బన్నీ క్రేజ్ నెక్స్ట్ లెవల్​లో ఉందనడానికి ఇన్​స్టా ఫాలోవర్స్ ఓ ఎగ్జాంపుల్ అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆయన మరిన్ని మంచి చిత్రాలతో తన క్రేజ్​ను పాన్ వరల్డ్ రేంజ్​కు పెంచుకుంటే చూడాలని ఉందని అంటున్నారు. ఇక, అల్లు అర్జున్ ‘పుష్ప 2’ మూవీ పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. ఈ సినిమా నుంచి బయటకు వస్తున్న లీకులు కూడా ఫిల్మ్​ మీద ఎక్స్​పెక్టేషన్స్​ను మరింత పెంచేస్తున్నాయి. శ్రీవల్లి పాత్రలో కనిపించనున్న రష్మికకు సంబంధించిన లుక్ ఒకటి బయటకు వచ్చింది. పార్ట్​-1లో పేదమ్మాయిగా కనిపించిన రష్మికను.. ‘పుష్ప 2’లో మాత్రం రిచ్​గా చూపించారు. పట్టుచీరలు, ఒంటి నిండా నగలతో మెరిసిపోతున్న రష్మిక లుక్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ యాగంటిలో జరుగుతోంది. అలాగే రామోజీ ఫిల్మ్​సిటీలోనూ సమాంతరంగా మరో షెడ్యూల్​ నడుస్తుండటం విశేషం. మరి.. ఇన్​స్టాలో బన్నీ రికార్డు సృష్టించడంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి