iDreamPost

బాబు కొంపముంచుతున్న పొత్తు.. YCPలోకి టీడీపీ సీనియర్లు..?

  • Published Feb 22, 2024 | 12:44 PMUpdated Feb 22, 2024 | 12:44 PM

రానున్న ఎన్నికల్లో పరువు నిలుపుకోవడం కోసం జనసేనతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబుకు కొత్త తలనొప్పులు ఎదురవుతున్నాయి. పొత్తు వల్ల టీడీపీ సీనియర్లు వైసీపీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారట. ఆ వివరాలు..

రానున్న ఎన్నికల్లో పరువు నిలుపుకోవడం కోసం జనసేనతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబుకు కొత్త తలనొప్పులు ఎదురవుతున్నాయి. పొత్తు వల్ల టీడీపీ సీనియర్లు వైసీపీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారట. ఆ వివరాలు..

  • Published Feb 22, 2024 | 12:44 PMUpdated Feb 22, 2024 | 12:44 PM
బాబు కొంపముంచుతున్న పొత్తు.. YCPలోకి టీడీపీ సీనియర్లు..?

అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో 175కి 175 స్థానాల్లో విజయం సాధించాలని వైసీపీ గట్టి పట్టుదలతో ఉండగా.. టీడీపీ-జనసేన కూటమి మాత్రం ఇంకా సీట్ల పంపిణీ దగ్గరే ఆగిపోయింది. పైగా బీజేపీతో పొత్తు ఉందా లేదా అనే దాని గురించి ఇంకా ఓ క్లారీటీ రాలేదు. కూటమిలో బీజేపీ చేరితే.. ఆ తర్వాత ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే లెక్కలు తేలడానికి ఇంకా చాలా సమయం పడుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇదిలా ఉంటే.. రానున్న ఎన్నికల్లో పరువు నిలుపుకోవడం కోసం జనసేనతో పొత్తు పెట్టుకున్న టీడీపీకి కొత్త తలనొప్పులు ఎదురవుతున్నాయి.

జనసేనతో పొత్తు వల్ల టీడీపీ కొన్ని స్థానాల్లో పోటీ నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. దాంతో ఏళ్ల తరబడి అక్కడ పార్టీ కోసం పని చేస్తున్న వారు.. ఈ ఎన్నికల్లో టికెట్‌ ఆశిస్తున్న వారు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లుగా సమాచారం. జనసేన కోసం తమ సీట్లను త్యాగం చేయడం ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారట. ఇప్పటికే జనసేన కోసం రాజమండ్రి రూరల్‌ నుంచి టీడీపీ సీనియర్‌ నేత బుచ్చయ్య చౌదరిని పోటీ నుంచి తప్పించిన సంగతి తెలిసిందే.

ఈ జాబితాలో మరి కొందరు సీనియర్లు కూడా ఉన్నారట. ఇక జలీల్‌ ఖాన్‌ వంటి నేతలు బహిరంగంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా.. కొందరు మాత్రం వైసీపీతో మంతనాలు, సంప్రదింపులు జరుపుతున్నారని టాక్‌ వినిపిస్తోంది. ఇక జలీల్‌ ఖాన్‌ అయితే టీడీపీకి 2 రోజుల గడువు ఇచ్చాడు. ఆయన డిమాండ్‌ నెరవేర్చకపోతే వైసీపీలోకి వచ్చేందుకు రెడీగా ఉన్నారని తెలుస్తోంది.

నూజీవీడులో ముద్రబోయిన వెంకటేశ్వరరావు టీడీపీకి గుడ్‌బై చెప్పింది కూడా ఈ కారణంతోనే. వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యే కొలను పార్థసారథికి టికెట్ రాకపోవడంతో ఆయన టీడీపీ గూటికి చేరారు. దాంతో బాబు పార్థసారథిని నూజీవీడు ఇన్ఛార్జిగా ప్రకటించాడు. ఈనేపథ్యంలో ఇప్పటి వరకు అక్కడ టీడీపీ కార్యక్రమాలు చేపట్టిన మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావు పార్టీ మారేందుకు సిద్ధం అయ్యారు. టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడమే కాక.. చంద్రబాబుపై విమర్శలు కూడా చేశారు. టీడీపీ నుంచి బయటకు వచ్చిన ముద్రబోయిన వైసీపీలో చేరతారని జోరుగా ప్రచారం సాగుతోంది.

అలానే మచిలీపట్నం ఎంపీ స్థానాన్ని జనసేనకు కేటాయించినట్లే కాబట్టి అక్కడ టీడీపీ నేత కొనకళ్ల నారాయణ కూడా వైసీపీ నేతలతో సంప్రదింపులు జరిపారు అని జోరుగా ప్రచారం సాగుతోంది. రాయచూట్ మాజీ ఎమ్మెల్యే రెడ్డప్ప గారి రమేశ్ రెడ్డి, పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత కుటుంబం కూడా వైసీపీ వైపు చూస్తోంది అని వార్తలు వస్తున్నాయి. కమలాపురం నుంచి సాయినాథ్ శర్మ, మైదుకూరు నుంచి వెంకటసుబ్బారెడ్డిలు ఎంపీ అవినాశ్ రెడ్డితో మంతనాలు సాగించారట. వీటిని అధికారికంగా ధ్రువీకరించకపోయినా.. సీనియర్లు మాత్రం అసంతృప్తితో ఉన్నారని.. వైసీపీ వైపు చూస్తున్నారన్నది వాస్తవం అంటున్నారు రాజకీయ పండితులు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి