iDreamPost

IND vs PAK: నిన్న పాక్‌నే కాదు ఇండియాని వణికించిన పంత్! అశ్విన్ ముందే చెప్పాడు!

  • Published Jun 10, 2024 | 12:34 PMUpdated Jun 10, 2024 | 12:34 PM

Rishabh Pant, Ravichandran Ashwin, IND vs PAK, T20 World Cup 2024: రిషభ్‌ పంత్‌ విషయంలో రవిచంద్రన్‌ అశ్విన్‌ ఏం చెప్పాడు టీ20 వరల్డ్‌ కప్‌కి ముందు.. నిన్న ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌లో పంత్‌ అదే చేశాడు. దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Rishabh Pant, Ravichandran Ashwin, IND vs PAK, T20 World Cup 2024: రిషభ్‌ పంత్‌ విషయంలో రవిచంద్రన్‌ అశ్విన్‌ ఏం చెప్పాడు టీ20 వరల్డ్‌ కప్‌కి ముందు.. నిన్న ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌లో పంత్‌ అదే చేశాడు. దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

  • Published Jun 10, 2024 | 12:34 PMUpdated Jun 10, 2024 | 12:34 PM
IND vs PAK: నిన్న పాక్‌నే కాదు ఇండియాని వణికించిన పంత్! అశ్విన్ ముందే చెప్పాడు!

టీ20 వరల్డ్‌ కప్‌లో టీమిండియా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను చిత్తుగా ఓడించిన భారత్‌.. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై విజయానికి మాత్రం కాస్త చెమటోడ్చాల్సి వచ్చింది. ఆదివారం న్యూయార్క్‌లోని నసావు గ్రౌండ్‌లో ఈ మ్యాచ్‌ జరిగింది. అయితే.. మ్యాచ్‌కి ముందు వర్షం రావడంతో మ్యాచ్‌ కాస్త ఆలస్యంగా మొదలైంది. పిచ్‌ పరిస్థితులు బౌలింగ్‌కు అనుకూలంగా ఉండటంతో.. రెండు జట్ల బౌలర్ల మధ్య భీకర యుద్ధం జరిగింది. బ్యాటర్లకు చుక్కలు చూపిస్తూ.. ఇరు జట్ల బౌలర్లు నిప్పులు చెరిగారు. బౌలర్ల యుద్ధంలో అంతిమంగా టీమిండియానే పైచేయి సాధించింది. అయితే.. ఈ మ్యాచ్‌లో టీమిండియాకు రిషభ్‌ పంత్‌ బ్యాటింగ్‌లో మూల స్తంభంలా నిలుచున్నాడు. పంత్‌ లేకపోయి ఉంటే.. భారత్‌ 119 పరుగులు కూడా చేయలేకపోయేది.

ఓపెనర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ తక్కువ స్కోర్లకే అవుటైనా.. పంత్‌ మాత్రమ నిలకడగా ఆడుతూ.. టీమిండియాను ఆదుకున్నాడు. మ్యాచ్‌ పరిస్థితులకు తగ్గట్లు అక్షర్‌ పటేల్‌ను బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందు పంపడం కూడా టీమిండియా చాలా బాగా కలిసి వచ్చింది. పంత్‌-అక్షర్‌ పటేల్‌ కలిసి ఒక మంచి భాగస్వామ్య నెలకొల్పి.. కొద్ది సేపు వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడారు. పంత్‌ 31 బంతుల్లో 6 ఫోర్లతో 42 పరుగులు చేసి టీమిండియాలో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అయితే.. పంత్‌ బ్యాటింగ్‌ చేస్తుంటే.. ఇటు టీమిండియా అభిమానులు, అటు పాకిస్థాన్‌ అభిమానులు కంగారు పడ్డారు. ఎలా పడితే అలా ఆడుతూ.. ఫియర్‌లెస్‌ క్రికెట్‌ ఆడాడు. ఎందుకు ఆడుతున్నాడో కూడా ఎవరికీ అర్థం కాలేదు.

పంత్‌ బ్యాటింగ్‌ చేస్తున్న విధానం చూసి.. రెండు జట్ల ఆటగాళ్లు కూడా తికమకలో పడ్డారు. ఈ క్రమంలోనే పంత్‌కు ఏకంగా మూడు లైఫులు దొరికాయి. ఇలా ఒకే మ్యాచ్‌లో సొంత జట్టుకు అలాగే ప్రత్యర్థి జట్టుకు హార్ట్‌ ఎటాక్‌ తెప్పించాడు రిషభ్‌ పంత్‌. అయితే.. ఇదే విషయాన్ని టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ టీ20 వరల్డ్‌ కప్‌ ఆరంభానికి ముందే చెప్పాడు. రిషభ్‌ పంత్‌ ఎలాంటి ప్లేయర్‌ అంటే.. ఒకే సారి సొంత టీమ్‌కు, ప్రత్యర్థి టీమ్‌కు హార్ట్‌ ఎటాక్‌ తెప్పిస్తాడని.. టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోర్‌తో జరిగిన ఇంటర్వ్యూలో అశ్విన్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. అశ్విన్‌ చెప్పినట్లే.. పాక్‌తో మ్యాచ్‌లో పంత్‌ తన ఫియర్‌లెస్‌ బ్యాటింగ్‌ ఇండియా, పాకిస్థాన్‌ రెండు టీమ్స్‌కు చెమటలు పట్టించాడు. ఎక్కడ భారీ షాట్‌ ఆడతాడో అని పాకిస్థాన్‌, ఎక్కడ అవుట్‌ అవుతాడో అని ఇండియా అభిమానులు భయపడి చచ్చారు. మరి పంత్‌ విషయంలో అశ్విన్‌ చెప్పింది చెప్పినట్లు జరగడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి