iDreamPost

పాండ్యా గుజరాత్ ను అందుకే వదిలేశాడా? మాజీ క్రికెటర్ ట్వీట్ వైరల్..

  • Author Soma Sekhar Published - 08:42 AM, Tue - 28 November 23

ప్రస్తుతం పాండ్యా టీమ్ మార్పు అనే అంశం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ పాండ్యా పేరు చెప్పకుండా అతడిపై సెటైరికల్ ట్వీట్ చేశాడు.

ప్రస్తుతం పాండ్యా టీమ్ మార్పు అనే అంశం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ పాండ్యా పేరు చెప్పకుండా అతడిపై సెటైరికల్ ట్వీట్ చేశాడు.

  • Author Soma Sekhar Published - 08:42 AM, Tue - 28 November 23
పాండ్యా గుజరాత్ ను అందుకే వదిలేశాడా? మాజీ క్రికెటర్ ట్వీట్ వైరల్..

ఐపీఎల్ 2024, హార్దిక్ పాండ్యా.. ఇప్పుడు ఈ రెండు పేర్లే క్రికెట్ వర్గాల్లో చర్చనీయాశంగా మారాయి. ఆల్ క్యాష్ డీల్ లో భాగంగా పాండ్యా గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ఈ రెండు ఫ్రాంచైజీల మధ్య ఒప్పందం కూడా జరిగిపోయింది. కాగా.. ఐపీఎల్ లో గత రెండు సీజన్లు గుజరాత్ టీమ్ ను ముందుండి నడిపిన పాండ్యా తిరుగులేని సారథిగా పేరొందాడు. టోర్నీలోకి అడుగుపెట్టిన తొలి సీజన్ లోనే జట్టును ఛాంపియన్ గా నిలిపి ఔరా అనిపించాడు. ఇదే జోరును గత సీజన్ లో కూడా చూపించి రన్నరప్ గా నిలిచాడు. ప్రస్తుతం పాండ్యా టీమ్ మార్పు అనే అంశం సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా ట్రెండింగ్ లో ఉంటోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ పాండ్యా పేరు చెప్పకుండా అతడిపై సెటైరికల్ ట్వీట్ చేశాడు.

హార్దిక్ పాండ్యా ఐపీఎల్ లో అదరగొడుతున్న గుజరాత్ టైటాన్స్ టీమ్ నుంచి ముంబై ఇండియన్స్ జట్టుకు వెళ్లడం ఇప్పడు ఐపీఎల్ వర్గాలతో పాటుగా క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక అతడి నిర్ణయాన్ని తప్పు పట్టేలా పరోక్షంగా పేరు తెలపకుండా ట్వీట్ చేశాడు టీమిండియా మాజీ ప్లేయర్ ఆకాశ్ చోప్రా. అతడు తన ట్వీట్ లో..”లైఫ్ లో ఎప్పుడో ఒక సందర్భంలో మనీ, విలువ ఈ రెండింటిలో ఏదో ఒక్కదాన్నే ఎంపిక చేసుకోవాల్సిన టైమ్ వస్తుంది. అప్పుడు మనం తీసుకునే నిర్ణయమే మీ మిగతా జీవితాంతం.. మిమ్మల్ని నిర్వచిస్తూ ఉంటుంది” అంటూ రాసుకొచ్చాడు.

కాగా.. పాండ్యా కెప్టెన్ కావాలనే కోరికతోనే తొలుత ముంబై నుంచి గుజరాత్ కు వచ్చి పగ్గాలు చేపట్టాడని అప్పట్లోనే చెప్పుకొచ్చాడు ఆకాశ్ చోప్రా. ఇక ఫ్రాంచైజీ సారథిగా ఎక్కువ రోజులు ఉండలేమని, ఒక వేళ పాండ్యా టీమిండియా కెప్టెన్ గా పాండ్యా కావాలని అనుకుంటే ప్రస్తుతం అతడు తీసుకున్న నిర్ణయం సరైంది కాదంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అయితే పాండ్యా టీమ్ మారడం అతడి ఫ్యాన్స్ కు, క్రికెట్ లవర్స్ కు అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. గుజరాత్ యాజమాన్యానికి పాండ్యాకు మధ్య ఆర్ధిక పరమైన అంశాల్లో విభేదాలు తలెత్తాయని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. మరి పాండ్యా టీమ్ ఛేంజ్, ఆకాశ్ చోప్రా సెటైరికల్ ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి