iDreamPost

ఐష్-అభిషేక్ డైవర్స్ న్యూస్!.. ప్రస్తుతానికి ఓ ఇంటర్వెల్ ట్విస్ట్!

బాలీవుడ్ అందాల తార ఐశ్యర్యరాయ్, అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకోబోతున్నారంటూ నేషనల్ మీడియా కోడై కూస్తోంది. అటు సినీ వర్గాల్లో కూడా వీరి డైవర్స్ అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది.

బాలీవుడ్ అందాల తార ఐశ్యర్యరాయ్, అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకోబోతున్నారంటూ నేషనల్ మీడియా కోడై కూస్తోంది. అటు సినీ వర్గాల్లో కూడా వీరి డైవర్స్ అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది.

ఐష్-అభిషేక్ డైవర్స్ న్యూస్!.. ప్రస్తుతానికి ఓ ఇంటర్వెల్ ట్విస్ట్!

వాళ్ళిద్దరి పెళ్ళి 17 ఏళ్ళ క్రితం జరిగినప్పుడు మీడియా ఇంత లేదు. కానీ ఉన్నంతలో నేషనల్ మేగజైన్స్, కాలమ్స్ మాత్రం చాలా వరకూ పండగ చేసుకున్నాయి. ఎందుకంటే వాళ్ళ క్రేజ్ అలా ఉంది ఆరోజుకి. వాళ్ళ పేర్లు రాసినా సరే సేల్స్ రికార్డు బ్రేక్ చేసేవి. వాళ్ళే ఐశ్వర్యరాయ్ అండ్ అభిషేక్ బచ్చన్. ఎవడి గురించో రాస్తే న్యూస్ వేల్యూ ఏముంటుంది? ఇదిగో ఇలాటి వాళ్ళ గురించి రాస్తే ఉంటుంది మజా. దాన్నే నేషనల్ మీడియా బాగా ఎన్కేష్ చేసుకుంది. ఇంకిప్పుడు సోషల్ మీడియా వచ్చాక ప్రతీ గంటకీ పండగే పండగ. ముఖ్యంగా ఆ రోజుల్లో సల్మాన్ ఖాన్ తో కూడా ఐశ్యర్యరాయ్ ప్రేమాయణం సాగిస్తోందని, అందుకు ప్రత్యక్ష నిదర్శనాలివి అని ఊదరగొట్టడంతో, మధ్యలో రామాయణంలో పిడకల వేటలా అబిషేక్ బచ్చన్, ఐషూ మేరేజ్ బిగ్ బజ్ నే క్రియేట్ చేసింది. రాసుకున్నవాడికి రాసుకున్నంత మహదేవ.

తర్వాత పెళ్ళి సెటిల్ అయిన వార్త బైటకు వచ్చిన దగ్గర్నుంచీ మీడియా కొంచెం సైలెంట్ అయిపోవాల్సివచ్చింది. అయిపోయింది కూడా. ఇంకేముంది? శుభం షాట్ పడిన తర్వాత సినిమా అయిపోయినట్టే కదా. కథ కంచికి మనమింటికి అనుకున్నారు. మళ్ళీ ప్రారంభమైంది. బచ్చన్ ఫ్యామిలీకి సంప్రదాయాలు, ఆచారాలు చాలా ఎక్కువ. జాతకాలు, దోషాలకి పరిహారాలు… వీటికి కూడా లోటేం లేదు. ఐషూ జాతకం ప్రకారం ఉన్నదోషాన్ని తొలగించడానిక చెట్టుకిచ్చి ముందు పెళ్ళి చేస్తారని వార్త వచ్చిందని మళ్ళీ మీడియా గొడవలో పడిపోయింది. పెళ్ళిలో ఆ ఫోటోలు కూడా బైటకు వచ్చేశాయి. మొత్తానికి పెళ్ళయిపోయింది. మళ్ళీ సైలెన్స్.

ముచ్చటగా మూడోసారి నేషనల్ మీడియాకి ఫుల్ కేఎఫ్సీ ఫుడ్…. దర్ఢ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఐషూ, జూనియర్ బిలకి. ఈసారి ఏకంగా విడాకులిచ్చేయాలనుకున్నారు. దానికి రకరకాల అధారాలు వెతికారు. ఏ ఫంక్షన్ కీ ఫ్యామిలీ అంతా కల్సి రావడంలేదు అన్నది మీడియా అబియోగాల్లో ఒకటి. మొన్నమొన్న నవంబర్ ఫస్ట్ న ఐషూ 50వ పుట్టినరోజుకి అనమాట బచ్చన్లు ఎవ్వరూ అచూకీ లేరు. రెండో అబియోగం. మూడోది కొంచెం గట్టిగానే పట్టుకుంది నేషనల్ మీడియా.

అది జూనియర్ బి వెడ్డింగ్ రింగ్ పెట్టుకోలేదని, ఐషూ ఇన్ స్టాగ్రామ్ ని అభి అన్ ఫాలో చేస్తున్నాడని… చాలా సీరియస్ పాయంట్ల సపోర్ట్ పెట్టుకుని కేంపైన్ ముమ్మరం చేశారు. మీడియాని తప్పించుకోవడం ఎంత కష్టం ఈరోజుల్లో? ప్రిన్సెస్ డయానాయే తప్పించుకోలేక పడిగాపులు పడింది. అయితే వీళ్ళిద్దరూ ఎలా బైటపడ్డారంటే ప్రస్తుతానికి… మొన్నీ మధ్యే అమితాబ్ డాటర్ సన్ నెట్ ఫ్లిక్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ద ఆర్చీస్ లో అరంగేట్రం చేస్తున్న సందర్భంగా అభి, ఐషూ ఇద్దరూ ఇతర ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు పాపరజ్జీకి ఫోజులిచ్చిన సందర్భంగా అనమాట. ఇది కూడా ప్రస్తుతానికి మాత్రమే. జస్ట్ యాన్ ఇంటర్వెల్…

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి