iDreamPost

పది పాసైతే చాలు.. పరీక్ష లేకుండానే ఎయిర్పోర్ట్ లో ప్రభుత్వ ఉద్యోగాలు.. త్వరపడండి

  • Published Apr 04, 2024 | 1:45 PMUpdated Apr 04, 2024 | 1:48 PM

ఉద్యోగం కోసం చూస్తున్నారా.. అయితే ఇది మీకోసమే. పదో తరగతి పాసైన వారికి కూడా ఎలాంటి పరీక్ష లేకుండా ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగం పొందే అవకాశం. పూర్తి వివరాలు..

ఉద్యోగం కోసం చూస్తున్నారా.. అయితే ఇది మీకోసమే. పదో తరగతి పాసైన వారికి కూడా ఎలాంటి పరీక్ష లేకుండా ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగం పొందే అవకాశం. పూర్తి వివరాలు..

  • Published Apr 04, 2024 | 1:45 PMUpdated Apr 04, 2024 | 1:48 PM
పది పాసైతే చాలు.. పరీక్ష లేకుండానే ఎయిర్పోర్ట్ లో ప్రభుత్వ ఉద్యోగాలు.. త్వరపడండి

నేటి కాలంలో మంచి జీతంతో ఉద్యోగం దొరకడం చాలా కష్టంగా మారింది. డిగ్రీలు, పీజీలు చేసినా సరైన ఉద్యోగాలు లభించక లక్షల మంది నిరుద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగాలకు ఉన్న పోటీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పోస్టుల సంఖ్య వందల్లో ఉంటే.. అభ్యర్థులు లక్షల్లో పోటీ పడుతుంటారు. పదో తరగతి అర్హతతో ఉన్న ఉద్యోగాలకు కూడా పీజీలు చేసిన వారు అప్లై చేస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా నిరుద్యోగులు ఎగిరి గంతేసి వార్త ఒకటి తెచ్చాం. పదో తరగతి పాసైన వారికి సైతం ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం. అది కూడా ఎలాంటి రాత పరీక్ష లేకుండా.. ఇంకెందుకు ఆలస్యం.. తర్వపడండి

ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఏఎస్ఎల్)లో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీ కోసం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్యూటీ టెర్మినల్ మేనేజర్, డిప్యూటీ ఆఫీసర్, జూనియర్ ఆఫీసర్ ప్యాసింజర్, జూనియర్ ఆఫీసర్ టెక్నికల్, ఇతర పోస్టులతో సహా మొత్తం 247 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అయితే ఈ నియామకాలన్నీ పూణే అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించినవి.

ఇక ఎలాంటి ఎగ్జామ్ లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ద్వారానే ఈ పోస్టులకు ఎంపిక ఉంటుంది. ఈ క్రమంలో సదరు సంస్థ ఆన్‌లైన్ దరఖాస్తు, వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీ విడుదల చేసింది. దీని కోసం, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ aiasl.in ని సందర్శించాలి. ఏ పోస్ట్ కు ఎంత వయసు ఉండాలి.. జీతం ఎంత.. క్వాలిఫికేషన్ వంటి వివరాలు..

పోస్ట్ ల వివరాలు..

డిప్యూటీ టెర్మినల్ మేనేజర్ (ప్యాసింజర్) : 15-18 సంవత్సరాల అనుభవంతో పాటు గ్రాడ్యుయేషన్, ఎంబీఏ చేసి ఉండాలి. గరిష్ట వయస్సు 55 సంవత్సరాలు. జీతం రూ. 60 వేలు. ఇంటర్వ్యూ తేదీ ఏప్రిల్ 15-16,2024.

డిప్యూటీ ఆఫీసర్ (ప్యాసింజర్): గ్రాడ్యుయేషన్‌తో పాటు 12 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. గరిష్ట వయస్సు 50 సంవత్సరాలు. జీతం రూ. 32,200. ఇంటర్వ్యూ తేదీ ఏప్రిల్ 15-16,2024.

జూనియర్ ఆఫీసర్( ప్యాసింజర్): గ్రాడ్యుయేషన్‌తో పాటు 9 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. 35 సంవత్సరాల వయస్సు మించకూడదు. జీతం రూ. 29,760. ఇంటర్వ్యూ తేదీ ఏప్రిల్ 15-16,2024.

జూనియర్ ఆఫీసర్ (టెక్నికల్): హెవీ మోటార్ వెహికల్ యొక్క చెల్లుబాటు అయ్యే లైసెన్స్‌తో పాటు మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో ఇంజనీరింగ్ డిగ్రీని కలిగి ఉండాలి. వయోపరిమితిని 28 సంవత్సరాలు. జీతం 29,760 రూపాయలు. ఇంటర్వ్యూ తేదీ ఏప్రిల్ 15-16,2024.

కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్‌ పోస్టు : గరిష్ట వయస్సు 28 సంవత్సరాలు. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్ట్ కోసం అప్లై చేసుకోవచ్చు. జీతం రూ.27,450. ఇంటర్వ్యూ తేదీ ఏప్రిల్ 15-16,2024.

ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టు : ఈ పోస్టుకి అప్లయ్ చేయాలంటే అభ్యర్థి తప్పనిసరిగా మెకానికల్/ఎలక్ట్రికల్/ప్రొడక్షన్ ఎలక్ట్రానిక్స్‌లో డిప్లొమా కలిగి ఉండాలి. గరిష్ట వయస్సు 28 సంవత్సరాలుగా నిర్ణయించబడింది. జీతం రూ.27450. ఇంటర్వ్యూ తేదీ ఏప్రిల్ 17-18,2024.

యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్: మీరు 10వ తరగతి పాసైన వారు యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ 28 సంవత్సరాలు. జీతం రూ. 24,960. ఇంటర్వ్యూ తేదీ ఏప్రిల్ 17-18,2024.

హ్యాండిమ్యాన్, హ్యాండీ ఉమెన్ : ఈ పోస్టుకు 10వ తరగతి పాసైతే చాలు. గరిష్ఠ వయసు 28 సంవత్సరాలు. జీతం రూ.22,530గా నిర్ణయించారు. ఇంటర్వూ తేదీ ఏప్రిల్ 19-20,2024.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి