iDreamPost

ఇండియన్ నేవీలో చేరాలనుకుంటున్నారా?.. 8th పాసైతే చాలు.. వెంటనే అప్లై చేసుకోండి

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఇదే మంచి అవకాశం. ఎనిమిదో తరగతి అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగం పొందే అవకాశం వచ్చింది. వెంటనే అప్లై చేసుకోండి.

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఇదే మంచి అవకాశం. ఎనిమిదో తరగతి అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగం పొందే అవకాశం వచ్చింది. వెంటనే అప్లై చేసుకోండి.

ఇండియన్ నేవీలో చేరాలనుకుంటున్నారా?.. 8th పాసైతే చాలు.. వెంటనే అప్లై చేసుకోండి

ఇటీవలికాలంలో డిగ్రీలు, పీజీలు పూర్తి చేసినా ఉద్యోగాలు రావడం కష్టంగా మారింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో విపరీతమైన పోటీనెలకొంది. ఏ ఉద్యోగామైనా సరే సాధించాలంటే పోటీపరీక్షల్లో అసాధారణ ప్రతిభ కనబర్చాల్సిందే. ఆ తర్వాత ఇంటర్వ్యూలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇన్ని వడపోతల అనంతరం ఉద్యోగం దక్కుతుంది. అయితే చాలా మంది ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులై ప్రైవేట్ రంగంలో చిన్న ఉద్యోగాలు చేస్తుంటారు. ఇలాంటి వారు తమకున్న అర్హతకు ప్రభుత్వ ఉద్యోగాలు లేవని బాధపడుతుంటారు. ఇలాంటి వారికి గుడ్ న్యూస్. ఏకంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం పొందే అవకాశం వచ్చింది. భారత త్రివిధ దళాల్లో ఒకటైన ఇండియన్ నేవీ పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది.

నేవల్ డాక్‌యార్డ్‌ ముంబైలో వివిధ ట్రేడ్ లలో అప్రెంటిస్ షిప్ ట్రైనింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 301 ఖాళీల భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు 8, 10వ తరగతి, ఐటీఐ పాసైన వాళ్లు అర్హులు. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు మే 10 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం కోసం అభ్యర్థులు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

పోస్టుల వివరాలు:

 • ఫిట్టర్-50 పోస్టులు
 • ఎలక్ట్రీషియన్-40 పోస్టులు
 • మెకానిక్-35 పోస్టులు
 • ఎలక్ట్రానిక్స్ మెకానిక్-26 పోస్టులు
 • షిప్‌రైట్‌లు (వుడ్)-18పోస్టులు
 • వెల్డర్లు(గ్యాస్ & ఎలక్ట్రిక్) -15 పోస్టులు
 • మెషినిస్ట్‌లు-13పోస్టులు
 • ఎంఎంటీఎం-13పోస్టులు
 • పైప్ ఫిట్టర్లు-13పోస్టులు
 • పెయింటర్లు-9 పోస్టులు
 • ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్‌లు-7పోస్టులు
 • షీట్ మెటల్ వర్కర్లు-3పోస్టులు
 • టైలర్లు-3పోస్టులు
 • ప్యాటర్న్ మేకర్లు-2పోస్టులు
 • ఫౌండ్రీమ్యాన్-1 పోస్టుపోస్టులు
 • మెకానిక్ Ref & A/C-7 పోస్టులు

విద్యార్హత:

 • అభ్యర్థులు 8, 10వ తరగతి, ఐటీఐ పాసైన వాళ్లు అర్హులు. ఐటీఐయేతర ట్రేడ్‌కు 8వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి. ఫోర్జర్ హీట్ ట్రీటర్ కోసం10వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి.

వయోపరిమితి:

 • అభ్యర్థుల కనీస వయస్సు 14 సంవత్సరాలు, గరిష్టంగా 18 సంవత్సరాలు ఉండాలి.

శారీరక ప్రమాణాలు:

 • అభ్యర్థి ఎత్తు 150 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు, బరువు 45 కిలోల కంటే తక్కువ ఉండకూడదు. అలాగే అభ్యర్థి ఛాతీ విస్తరణ తర్వాత 5 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు. అలాగే కంటి చూపు 6/6 నుండి 6/9 వరకు ఉండాలి.

ఎంపిక ప్రక్రియ:

 • రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు చివరి తేదీ:

 • 10-05-2024

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి