iDreamPost

ITI చేసి ఖాళీగా ఉన్నారా?.. అయితే ఈ ఉద్యోగాలు మీకోసమే.. వెంటనే అప్లై చేసుకోండి

ప్రభుత్వ ఉద్యోగం సాధించడం మీ లక్ష్యమా? అయితే ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. ఐటీఐ ఉత్తీర్ణులైతే చాలు కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి. వెంటనే అప్లై చేసుకోండి.

ప్రభుత్వ ఉద్యోగం సాధించడం మీ లక్ష్యమా? అయితే ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. ఐటీఐ ఉత్తీర్ణులైతే చాలు కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి. వెంటనే అప్లై చేసుకోండి.

ITI చేసి ఖాళీగా ఉన్నారా?.. అయితే ఈ ఉద్యోగాలు మీకోసమే.. వెంటనే అప్లై చేసుకోండి

చాలా మంది యువత జీవితంలో త్వరగా స్థిరపడాలని ఒకేషనల్ కోర్సులను ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా ఐటీఐ చేసేవారి సంఖ్య పెరుగుతోంది. కోర్సుల వ్యవధి ఏడాది, రెండేళ్లు ఉండడంతో త్వరగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఐటీఐ పూర్తి చేసుకున్న వారికి పరిశ్రమల్లో ఉద్యోగాలు విరివిగా లభిస్తున్నాయి. అంతేకాదు ప్రభుత్వ సంస్థల్లో కూడా మంచి వేతనాలతో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. మరి మీరు కూడా ఐటీఐ పూర్తి చేసి ఖాళీగా ఉన్నారా? ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఇదే మంచి అవకాశం. కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందిన ఫర్టిలైజర్ సంస్థ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది.

ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్‌కోర్ లిమిటెడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 98 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత ట్రేడ్‌లో 60% మార్కులు, ఎస్సీ/ఎస్టీలకు 50% మార్కులతో ఐటీఐ /ఐటీసీ, సంబంధిత ట్రేడ్‌లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 23 నుంచి 28 ఏళ్ల వయసు మించకూడదు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు మే 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోదలిచిన వారు పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

  • అప్రెంటిస్ ఖాళీల సంఖ్య:
  • 98

విభాగాల వారీగా ఖాళీలు:

  • ఫిట్టర్: 24
  • మెషినిస్ట్: 08
  • ఎలక్ట్రీషియన్: 15
  • ప్లంబర్: 04
  • మెకానిక్ మోటార్ వెహికల్: 06
  • కార్పెంటర్: 02
  • మెకానిక్ (డీజిల్): 04
  • ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్: 12
  • వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్): 09
  • పెయింటర్: 02
  • సీవోపీఏ/ ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్: 12

అర్హత:

  • సంబంధిత ట్రేడ్‌లో 60% మార్కులు, ఎస్సీ/ఎస్టీలకు 50% మార్కులతో ఐటీఐ /ఐటీసీ కలిగి ఉండాలి. సంబంధిత ట్రేడ్‌లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

వయోపరిమితి:

  • 02.04.2001 లేదా ఆ తర్వాత పుట్టిన తేదీ ఉన్న జనరల్ అభ్యర్థులకు 01.04.2024 నాటికి 23 సంవత్సరాలు మించకూడదు.
  • 02.04.1998 లేదా ఆ తర్వాత పుట్టిన తేదీ ఉన్న ఓబీసీ అభ్యర్థులకు 01.04.2024 నాటికి 26 సంవత్సరాలు మించకూడదు.
  • 02.04.1996 లేదా ఆ తర్వాత పుట్టిన తేదీ ఉన్న ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 01.04.2024 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌లైన్

స్టైపెండ్:

  • ఈ పోస్టులకు ఎంపికైన వారికి రూ. 7000.

దరఖాస్తు హార్డు కాపీలు పంపాల్సిన చిరునామా:

  • సీనియర్ మేనేజర్(ట్రైనింగ్),
    ఫ్యాక్ట్ ట్రైనింగ్ అండ్ డెవలప్ మెంట్ సెంటర్,
    ఉద్యోగమండల్, పిన్ 683501.

దరఖాస్తుకు చివరితేదీ:

  • 20-05-2024

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి