iDreamPost

APలోని ఆ శాఖలో ఉద్యోగాలు.. నెలకు 70 వేల జీతం.. ఈ అర్హతలుంటే చాలు

ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా? గవర్నమెంట్ ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా? ఆంధ్రప్రదేశ్ లో భారీ వేతనంతో ఆ శాఖలో నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది వెంటనే అప్లై చేసుకోండి.

ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా? గవర్నమెంట్ ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా? ఆంధ్రప్రదేశ్ లో భారీ వేతనంతో ఆ శాఖలో నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది వెంటనే అప్లై చేసుకోండి.

APలోని ఆ శాఖలో ఉద్యోగాలు.. నెలకు 70 వేల జీతం.. ఈ అర్హతలుంటే చాలు

ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇప్పటికే రాష్ట్రంలో గ్రూప్ 1,2, డీఎస్సీ, ఇతర ప్రభుత్వ శాఖల నుంచి నోటిఫికేషన్లు విడుదలైన విషయం తెలిసిందే. వీటికి సంబంధించిన భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఈసారి ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని నిరుద్యోగులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఖచ్ఛితమైన ప్రణాళికతో లక్ష్యం చేధించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఏపీలోని ఆ శాఖ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు 70 వేల వేతనం పొందొచ్చు. అయితే ఈ ఉద్యోగాలకు పోటీపడాలంటే కావాల్సిన అర్హతలు ఏంటి? ఆ వివరాలు మీకోసం..

ఏపీ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ట్యూటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 158 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌ లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థి గుర్తింపు పొందిన కాలేజీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసి ఉండాలి. ఏపీ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. మే 04 నుంచి అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మే 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోదలిచిన అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం ఖాళీలు :

  • 158 ట్యూటర్ పోస్టులు

అర్హతలు :

  • దరఖాస్తు చేసుకునే అభ్యర్థి గుర్తింపు పొందిన కాలేజీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసి ఉండాలి. ఏపీ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి.

వేతనం:

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 70,000 అందిస్తారు.

వయసు:

  • అభ్యర్థుల వయసు 47 ఏళ్ల లోపు ఉండాలి.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్‌

దరఖాస్తు ఫీజు :

  • ఓసీ అభ్యర్థులు రూ. 1000 చెల్లించాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 500 చెల్లించాలి.

దరఖాస్తులు ప్రారంభ తేదీ :

  • 04-05-2024

దరఖాస్తులకు తుది గడువు :

  • 15-05-2024

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి