iDreamPost

Telugu Indian Idol show ఆహా అనిపిస్తున్న బాలయ్య బంధం

Telugu Indian Idol show ఆహా అనిపిస్తున్న బాలయ్య బంధం

గత ఏడాది ఆహా యాప్ కోసం బాలకృష్ణ చేసిన టాక్ షో అన్ స్టాపబుల్ సూపర్ హిట్ కావడం చూశాం. సెలబ్రిటీలతో బాలయ్య ఇంటరాక్ట్ అయిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. యాంకర్ గా అయన ఎంత మేరకు సక్సెస్ కాగలరనే అనుమానాలు పటాపంచలు చేస్తూ షోకి అదరగొట్టే రెస్పాన్స్ తెచ్చారు. త్వరలో సెకండ్ సీజన్ తీసుకురాబోతున్నారు. ఆమేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా అదే ఆహాలో రన్ అవుతున్న ఇండియన్ ఐడల్ సింగింగ్ షో సెమి ఫైనల్ ఎపిసోడ్ కి బాలయ్య అతిథిగా రావడమే కాదు పాటలతో హుషారెత్తించి డాన్సులు కూడా చేశారు. దీని తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో అభిమానుల మధ్య హల్చల్ చేస్తున్నాయి.

నిజానికి బాలయ్య ఇలాంటి ప్రోగ్రాంస్ చేసిన దాఖలాలు గతంలో లేవు. ఎంతసేపు సినిమాలంటూ తన పరిధి దాటి బయటికి వచ్చేవారు కాదు. చిరంజీవి మీలో ఎవరు కోటీశ్వరుడు చేసినా, నాగార్జున బిగ్ బాస్ తో వ్యాఖ్యాతగా విజయం అందుకున్నా, వెంకటేష్ యాడ్స్ లో నటిస్తూ అదనపు ఆదాయాలు చూసుకున్నా బాలకృష్ణ మాత్రం వీటి జోలికి వెళ్ళలేదు, ఆలోచించలేదు. ఎప్పుడైతే ఆహాతో బంధం ఏర్పడిందో అప్పటి నుంచి తన పరిమితులను తీసేశారు. గంభీరంగా ఉండే తనలో ఎంత జోవియల్ యాంగిల్ ఉందో అన్ స్టాపబుల్ లో ఆవిష్కరించారు. ఇప్పుడు ఈ సెమి ఫైనల్ కు రావడం ద్వారా ఫ్యాన్స్ కు మరింత వినోదాన్ని అందించేందుకు రెడీ అయ్యారు.

ఇదంతా చూస్తూ అభిమానుల ఆనందం ఎలా ఉంటుందో వేరే చెప్పాలా. ప్రస్తుతం గోపీచంద్ మలినేని సినిమాలో బిజీగా ఉన్న బాలయ్య అది పూర్తి కాగానే అనిల్ రావిపూడిది స్టార్ట్ చేస్తారు. ప్రస్తుతం చేసుకున్న కమిట్మెంట్లు ఈ రెండే.. వీటి తర్వాత ఎవరితో చేస్తారనే క్లారిటీ ఇంకా లేదు. ఆదిత్య 999 అన్నారు కానీ అది ఇప్పట్లో జరిగేది అనుమానమే. పూరితో ఓ ప్రాజెక్టు అనుకున్నారు. కానీ ఆయన లైగర్ తర్వాత నెక్స్ట్ జనగణమనకు షిఫ్ట్ అయ్యారు. సో అదీ లేనట్టే. మొత్తానికి చిరంజీవి బావమరిది అల్లు అరవింద స్వంత ప్లాట్ ఫార్మ్ లో మెగా హీరో కన్నా ఎక్కువగా బాలయ్య యాక్టివ్ గా ఉండటం ఊహించలేనిదే. గీత ఆర్ట్స్ లో త్వరలో ఓ సినిమా కూడా ఉండొచ్చట.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి