iDreamPost

మహిళా ఉద్యోగికి బలవంతంగా ముద్దు పెట్టిన అడ్వకేట్.. చివరకు

అన్యాయం జరిగితే న్యాయం చేయాలంటూ కోర్టు మెట్టెక్కుతున్నారు సామాన్యులు. కానీ ఆ న్యాయ స్థానాల్లో కూడా మహిళలకు రక్షణ లేకుండా పోయింది. కళ్లు మూసుకుపోయిన కామాంధులు.. న్యాయ దేవత ఆవరణలో అరచకాలకు ఒడిగడుతున్నారు.

అన్యాయం జరిగితే న్యాయం చేయాలంటూ కోర్టు మెట్టెక్కుతున్నారు సామాన్యులు. కానీ ఆ న్యాయ స్థానాల్లో కూడా మహిళలకు రక్షణ లేకుండా పోయింది. కళ్లు మూసుకుపోయిన కామాంధులు.. న్యాయ దేవత ఆవరణలో అరచకాలకు ఒడిగడుతున్నారు.

మహిళా ఉద్యోగికి బలవంతంగా ముద్దు పెట్టిన అడ్వకేట్.. చివరకు

ఆడవాళ్లకు ఎక్కడా రక్షణ లేకుండా పోయింది. ఇంట్లో, పని ప్రదేశాల్లోనే కాదు.. ఇప్పుడు రక్షణ వ్యవస్థలుగా పరిగణించే పోలీస్ స్టేషన్స్, కోర్టుల్లో కూడా లైంగిక దాడి, సెక్సువల్ హెర్రాస్ మెంట్ జరుగుతోంది. లైంగికంగా వేధించడంతో పాటు ఎవరికైనా చెబితే.. ప్రాణం తీస్తామంటూ బెదిరించడంతో మిన్నకుండిపోతున్నారు కొంత మంది మహిళలు. ఇక ఇంట్లో చెబితే..మొత్తానికి ఉద్యోగానికి పంపరన్న ఉద్దేశంతో ఆ బాధను పంటి బిగువున పెట్టుకుని బతుకుతున్నారు. తాజాగా మాజీ గవర్నమెంట్ ప్లీడర్..మహిళా సహోద్యోగిని బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు. అయితే ఈ ఘటన కెమెరా కంటికి చిక్కింది. ఫిబ్రవరిలో ఈ ఘటన జరగ్గా.. తాజాగా ఆ మహిళ ఫిర్యాదు ఇవ్వడంతో మరోసారి చర్చనీయాంశమైంది.

తెలంగాణలోని హైదరాబాద్ హైకోర్టు భవనం టెర్రస్ పై మహిళను బలవంతంగా మద్దుపెట్టుకున్నాడు ప్రభుత్వ మాజీ ప్లీడర్, అడ్వకేట్ ఎ. సంజయ్ కుమార్. అతడు ముద్దు పెట్టుకున్న ఘటన కెమెరా కంటికి చిక్కడంతో వైరల్ అయ్యింది. ఇంతకు ఆ వీడియోలో ఏం కనిపిస్తుందంటే.. హైకోర్టు భవనం టెర్రస్ పై మహిళా ఉద్యోగిని నిలబడి ఉంటే.. ప్లీడర్ దుస్తుల్లో ఉన్న సంజయ్ ఫోనులో మాట్లాడుతూ కనిపిస్తున్నాడు. ఫోన్ పూర్తయ్యాక ఆమె దగ్గరకు వెళ్లి.. ముఖాన్ని తన చేతిలోకి తీసుకుని బలవంతంగా ముద్దు పెట్టినట్లు తెలుస్తోంది. అతడు బలవంతంగా టెర్రస్ పైకి రావాలని బలవంతం చేయడంతోనే ఆమె అక్కడికి వెళ్లినట్లు సమాచారం.

అయితే సంజయ్ కుమార్ కోర్టు ఆవరణలోనే తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని, తన పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నాడని, సెక్స్ కోరికలు తీర్చమని బలవంతం చేస్తున్నాడని, నిత్యం తనను వెంబడిస్తున్నాడని, తనకున్న బలంతో బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఫిర్యాదు అందిన వెంటనే షీటీమ్స్ కేసు నమోదు చే సి, విచారణ చేపడుతోంది. సాక్ష్యాధారాలను, సాక్షుల వాంగ్మూలాలను సేకరిస్తోంది షీటీమ్స్. చార్మీనార్ పోలీస్ స్టేషన్‌లో సంజయ్ కుమార్ పై ఐపీసీలోని 354, 354డి, 506 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై విచారణ చేపడుతోంది టీమ్. న్యాయ దేవత ఆవరణలోనే మహిళలకు రక్షణ కొరవడిందంటే.. మిగిలిన ప్రాంతాల్లో ఆడవాళ్లపై జరుగుతున్న లైంగిక వేధింపుల సంగతేంటీ అన్న ప్రశ్న మొదలౌతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి