iDreamPost

హైదరాబాద్ లో కల్తీ చాక్లేట్స్ దందా.. గుట్టు రట్టు చేసిన స్థానికులు!

హైదరాబాద్ లో కొందరు కేటుగాళ్లు నాణ్యతా ప్రమాణాలు లేకుండా కల్తీ చాక్లేట్స్ ను తయారు చేస్తున్నారు. వీటిపై స్థానికులు స్పందించి నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

హైదరాబాద్ లో కొందరు కేటుగాళ్లు నాణ్యతా ప్రమాణాలు లేకుండా కల్తీ చాక్లేట్స్ ను తయారు చేస్తున్నారు. వీటిపై స్థానికులు స్పందించి నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

హైదరాబాద్ లో కల్తీ చాక్లేట్స్ దందా.. గుట్టు రట్టు చేసిన స్థానికులు!

హైదరాబాద్ లో కొందరు కల్తీగాళ్లు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతూ డబ్బులు కూడ బెట్టుకుంటున్నారు. కల్తీ పాలు, అల్లం వెల్లుల్లి ఇలా ప్రజలు తినే ఎన్నో రకాల ఆహార పదార్థాలను కల్తీ చేస్తూ దారుణాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో వెలుగు చూసిన విషయం తెలిసిందే. వీటిపై వెంటనే స్పందించిన ఫుడ్ సెఫ్టీ అధికారులు కల్తీ తయారీ సంస్థలపై దాడులు చేసి వారిని అరెస్ట్ చేశారు. ఇక మొన్నటికి మొన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కనున్న అల్ఫా హోటల్ పై అధికారులు దాడి చేసి కల్తీ ఆహారం ఉందని తేల్చి సీజ్ చేశారు. ఈ ఘటన మరువకముందే హైదరాబాద్ లో కొందరు వ్యక్తులు కొన్ని రకాల పేర్లతో కల్తీ చాక్లెట్స్ తయారు చేస్తున్నారు. దీన్ని పసిగిట్టిన కొందరు స్థానికులు వీరి గుట్టును రట్టు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో కాస్త వైరల్ మారుతున్నాయి.

స్థానికుల కథనం ప్రకారం.. నగరంలోని హైదర్ గూడ లో కొందరు నిర్వాహకులు సుప్రజా ఫుడ్స్ పేరుతో కల్తీ దందాను నిర్వహిస్తున్నారు. అనూస్ ఇమ్లీ, క్యాండీ జెల్లి పేరుతో కల్తీ చాక్లేట్స్ తయారు చేస్తూ బిజినెస్ ను కొనసాగిస్తున్నారు. అయితే ఈ చాక్లెట్ల తయారీలో ఈ నిర్వాహకులు ప్రమాదకర రసాయనాలు వాడుతున్నారు. ఇందులో భాగంగానే కుళ్లిపోయిన చింతపండును మరిగించి వాటి నుంచి వచ్చిన గుజ్జును తీసి చిన్న చిన్న ప్యాకెట్స్ లో ప్యాకింగ్ చేస్తారు. ఆ తర్వాత వాటికి ఆకర్షణీయమైన స్టిక్కరింగ్ చేసి మార్కెట్ లో విక్రయిస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలు ఎక్కడా లేకుండా ఈ కల్తీ బిజినెస్ ను కొనసాగిస్తూ పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

ఇంతే కాకుండా వీరు నిర్వాహిస్తున్న ఈ వ్యాపారానికి ఫుడ్ సేఫ్టీ, జీహెచ్ఎమ్ సీ అధికారుల నుంచి ఎలాంటి అనుమతి కూడా తీసుకోకపోవడం విశేషం. ఇలా చాలా కాలం నుంచి ఈ నిర్వాహకులు ఈ కల్తీ దందాను నిర్వహిస్తున్నారు. ఈ విషయం తెలియని ఎంతో మంది పిల్లలు వీరి తయారు చేసిన చాక్లెట్స్ ను తినేసి రోగాల భారిన పడుతున్నారు. అయితే కొందరు స్థానికులు వీరు చేస్తున్న ఈ కల్తీ చాక్లెట్స్ దందాపై ఓ కన్నేసి ఉంచారు. ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి స్థానికులు అంతా తాజాగా వీరు తయారు చేస్తున్న కంపెనీపై దాడులు చేశారు. ఇవన్నీ సెల్ ఫోన్ లో వీడియో తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీరు నిర్వహిస్తున్న ఈ కల్తీ చాక్లెట్స్ దందాపై అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కల్తీ చాక్లెట్స్ దందా వెలుగులోకి రావడంతో స్థానిక ప్రజలు ఒక్కసారిగా షాక్ గురవుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి