iDreamPost

స్కూల్ పిల్లలే టార్గెట్.. గంజాయి చాక్లెట్స్ అమ్మి

మాదక ద్రవ్యాల మత్తులో చిత్తు అవుతుంది నేటి యువత. చాప కింద నీరులా.. రోజు రోజుకూ దీనికి ఎడిక్ట్ అయిపోతున్నారు. మాఫియా కూడా వీరిని టార్గెట్ చేస్తూ.. అలవాటు చేసి.. మత్తులో ముంచెత్తుతోంది. దీంతో వీరు విచక్షణ కోల్పోతున్నారు. తాజాగా

మాదక ద్రవ్యాల మత్తులో చిత్తు అవుతుంది నేటి యువత. చాప కింద నీరులా.. రోజు రోజుకూ దీనికి ఎడిక్ట్ అయిపోతున్నారు. మాఫియా కూడా వీరిని టార్గెట్ చేస్తూ.. అలవాటు చేసి.. మత్తులో ముంచెత్తుతోంది. దీంతో వీరు విచక్షణ కోల్పోతున్నారు. తాజాగా

స్కూల్ పిల్లలే టార్గెట్.. గంజాయి చాక్లెట్స్ అమ్మి

మాదకద్రవ్యాల వాడకం దేశంలో విస్తృతంగా పెరిగిపోతుంది. ఇప్పుడు ఈ జాడ్యం తెలుగు రాష్ట్రాలకు కూడా పాకింది. ఇప్పటికే సినీ సెలబ్రిటీలు ఈ వలలో చిక్కుకున్న సంగతి విదితమే. టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. ఇటీవల కూడా ఓ స్టార్ నటుడు కూడా డ్రగ్ కేసులో విచారణకు ఎదుర్కొన్నాడు. ఇబ్బడిముబ్బడిగా, విశృంఖలంగా దొరుకుతున్న గంజాయి మత్తులో జోగుతోంది యువత. ముఖ్యంగా కాలేజీ విద్యార్థులకు వీటికి మెల్లిగా అలవాటు చేసి.. ఆ తర్వాత వారి ద్వారానే వ్యాపారాన్ని విస్తృతం చేసుకుంటున్నారు దుర్మార్గులు. ఇప్పుడు ఈ మాఫియా చిన్న పిల్లలను కూడా టార్గెట్ చేసింది.

రంగారెడ్డి జిల్లా కొత్తూరు గవర్నమెంట్ స్కూల్ లో చదువుతున్న విద్యార్థులు.. వారికి తెలియకుండానే గంజాయికి అలవాటు పడ్డారు. అయితే రాను రానూ స్కూల్ విద్యార్థుల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉద్రేకానికి లోను కావడంతో పాటు అల్లరి ఎక్కువగా చేస్తుండటం, మాట వినకపోవడంతో ఉపాధ్యాయులకు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. ఆ షాపు మీద రైడ్స్ చేస్తే విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అభం, శుభం తెలియని స్కూల్ పిల్లలకు గంజాయి చాక్లెట్లు అలవాటు చేసి.. వారిని మత్తులో జోగేలా చేశాడు దుర్మార్గుడు.

స్కూల్ బయట పాన్ డబ్బాలో ఓ వ్యక్తి చాక్లెట్స్ అమ్ముతూ ఉండేవాడు. మొదట్లో వాటిని ఫ్రీగా అందించేవాడు. అవి టేస్టీగా ఉండటంతో పాటు తమకు ఏదో తెలియని ఫీలింగ్ కలగడంతో.. పదే పదే ఆ షాపు వద్దకు వెళ్లి చాక్లెట్స్ కొనేవారు విద్యార్థులు. ఒక్కో చాక్లెట్ రూ. 20 రూపాయలకు అమ్మేవాడు. అయితే ఇవి తిన్న స్టూడెంట్స్ ప్రవర్తనలో రాను రానూ మార్పులు రావడంతో పాటు.. మొండిగా, ముభావంగా.. చెప్పిన మాట వినకపోవడం వంటివి చేసేవారు. దీంతో స్కూల్ టీచర్లకు, యాజమాన్యానికి డౌట్ వచ్చి పోలీసులకు సమాచారం అందించగా.. ఆ పాన్ షాప్ పై సోదాలు చేపట్టారు. తీరా చూస్తే.. భారీ స్థాయిలో చాక్లెట్స్ రూపంలో గంజాయిని అమ్ముతున్నాడు ఆ వ్యక్తి. ఆ పాన్ డబ్బా యజమానితో పాటు పలువుర్ని అరెస్టు చేశారు. వీటిని ఒడిశా నుంచి ఇక్కడకు తీసుకు వచ్చి అమ్ముతున్నారని పోలీసులు వెల్లడించారు. యువతని చెడగొడుతుండడమే కాకుండా ఇప్పుడు చిన్న పిల్లలని కూడా టార్గెట్ చేస్తున్నారు. తల్లిదండ్రులు మీ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి