iDreamPost

బ్రేకింగ్: హైదరాబాద్ లో RTC బస్సు బోల్తా… 20 మందికి తీవ్ర గాయాలు!

  • Published Nov 27, 2023 | 10:25 AMUpdated Nov 27, 2023 | 10:25 AM

ఈ మద్య నిత్యం ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో ఎంతోమంది చనిపోవడం, గాయాల పాలవడం చూస్తూనే ఉన్నాం.

ఈ మద్య నిత్యం ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో ఎంతోమంది చనిపోవడం, గాయాల పాలవడం చూస్తూనే ఉన్నాం.

  • Published Nov 27, 2023 | 10:25 AMUpdated Nov 27, 2023 | 10:25 AM
బ్రేకింగ్: హైదరాబాద్ లో RTC బస్సు బోల్తా… 20 మందికి తీవ్ర గాయాలు!

దేశ వ్యాప్తంగా ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాలపై అధికారులు డ్రైవర్లకు ఎన్ని అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి చెబుతున్నా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. నిర్లక్ష్యం, అతివేగం, అనుభవ రాహిత్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం లాంటివి చేయడం వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయి. డ్రైవర్లు చేస్తున్న ఒక్క తప్పిదం వల్ల ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. పెద్ద దిక్కు కోల్పోయి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. రోడ్డు భద్రతా చర్యలు తీసుకుంటున్నా, డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. ప్రమాదాలను మాత్రం అరికట్టలేకపోతున్నారు. తాజాగా హైదరాబాద్ శివారులో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ నేషనల్ హైవే పై వేగంగా వెళ్తున్న ఒక ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఇందులో ఉన్న బస్సు డ్రైవర్, కండక్టర్ తో సహా 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. రోడ్డు ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ కావడంతో ఇతర వాహనదారులు చాలా ఇబ్బంది పడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మీదుగా హైదరాబాద్ కు బయలుదేరింది. ఈ క్రమంలోనే నేషనల్ హైవే 44 పైగా బస్సు అతి వేగంగా ప్రయాణిస్తూ ఉండగా హఠాత్తుగా అదుపుతప్పి పక్కనే ఉన్న డివైడర్ ని ఢీ కొట్టి రోడ్డు పక్క వైపు దూసుకువెళ్లింది. అదృష్టం కొద్ది అటువైపు ఎక్కువగా వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిపోయింది.

ఆర్టీసీలో ప్రయాణిస్తున్న డ్రైవర్, కండెక్టర్ సహా మరో 20 మందికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రులకు తరలించారు. సమయానికి వైద్యం అందడంతో కొంతమంది పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు సమాచారం. హైవే పై బస్సు అడ్డంగా బోల్తా పడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలగడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితి సమీక్షించి.. ట్రాఫిక్ ని క్లీయర్ చేశారు. కాగా, డ్రైవర్ అతి వేగంగా ప్రమాదానికి కారణం అయి ఉండవొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి