iDreamPost

ఫ్రెండ్స్‌తో దావత్‌.. చికెన్‌ తింటూ కుప్ప కూలిన వ్యక్తి.. ఏం జరిగిందంటే?

  • Published Jan 11, 2024 | 12:50 PMUpdated Jan 11, 2024 | 12:50 PM

వాన రాకడ.. ప్రాణం పోకడ ఎవరూ ఊహించలేరని పెద్దలు అంటుంటారు. అప్పటి వరకు మనతో ఎంతో ఆనందంగా గడిపిన వాళ్లు హఠాత్తుగా కుప్పకూలిపోయి మరణిస్తున్నారు.

వాన రాకడ.. ప్రాణం పోకడ ఎవరూ ఊహించలేరని పెద్దలు అంటుంటారు. అప్పటి వరకు మనతో ఎంతో ఆనందంగా గడిపిన వాళ్లు హఠాత్తుగా కుప్పకూలిపోయి మరణిస్తున్నారు.

  • Published Jan 11, 2024 | 12:50 PMUpdated Jan 11, 2024 | 12:50 PM
ఫ్రెండ్స్‌తో దావత్‌.. చికెన్‌ తింటూ కుప్ప కూలిన వ్యక్తి.. ఏం జరిగిందంటే?

మనిషికి మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు.. అప్పటి వరకు మనతో ఎంతో సంతోషంగా గడిపిన వారు హఠాత్తుగా కానరాని లోకాలకు వెళ్లిపోతుంటారు. హార్ట్ ఎటాక్, రోడ్డు ప్రమాదాలు, కరెంట్ షాక్, అగ్ని ప్రమాదాలు.. ఇలా ఎన్నో కారణాల వల్ల చనిపోవడంతో కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంటుంది. కాలం కలసి రాకుంటే కర్రే పాము అయి కాటేస్తుందని పెద్దలు అంటారు. ఫ్రెండ్స్ తో సంతోషంగా పార్టీలు చేసుకుంటున్న సమయంలో మందుతాగి, మాంసం తిని హఠాత్తుగా చనిపోయిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. అలాంటి ఓ ఘటన హైదరాబాద్ శివారు ఫరూక్ మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ లో ఓ వ్యక్తి చికెన్ ముక్క తిని చనిపోయిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన జితేందర్ కుమార్ వర్మ, ధర్మేందర్ వర్మ కొంతకాలంగా హైదరాబాద్ శివారు ప్రాంతం ఫరూక్ మండలం ఎలికట్టలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని రోజువారీ కూలీ పనులు చేసుకుంటీ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ నెల 8వ తేదీన కూలీ పనులు ముగించుకొని సాయంత్రం ఇంటికి చేరుకున్నారు. దావత్ చేసుకుందామని చికెన్ వండుకున్నారు. అందులోకి పూరీలు చేసుకొని తింటున్న సమయంలో జితేందర్ వర్మ (46) ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ధర్మేందర్ ఎంత లేపినా జితేంతర్ ఉలుకు పలుకు లేకుండా పడి ఉండటం చూసి భయంతో  ఇరుగు పొరుగు వారిని పిలిచి లేపే ప్రయత్నం చేశారు.. కానీ అప్పటికే జిలేందర్ మృతి చెందాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి క్లూస్ టీమ్ తో వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జితేందర్ కుమార్ వర్మ గొంతులో చికెన్ ముక్క ఇరుక్కోవడం వల్ల ఊపిరి అందక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అప్పటి వరకు తన స్నేహితుడితో ఎంతో సంతోషంగా గడిపిన ధర్మేందర్ వర్మ.. జితేందర్ కన్నుమూయడంతో జీర్ణించుకోలేపోయాడు. ఈ విషయం గురించి తెలిసి స్థానికులు సైతం కంటనీరు పెట్టుకున్నారు. ధర్మేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా చికెన్ ముక్క గొంతులో ఇరుక్కొని ఊపిరి అందక చనిపోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. అందుకే చికెన్, మటన్, ఫిష్ తినే సమయంలో జాగ్రత్తలు పాటించాలని అంటుంటారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి