iDreamPost
android-app
ios-app

OTTని షేక్ చేస్తున్న అదా శర్మ కాంట్రవర్షియల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Adah Sharma Movie Trending In OTT: అందాల తార అదా శర్మ ఈ మధ్య అన్నీ కాంట్రవర్సీ సినిమాలే చేస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఆమె నటించిన ఒక కాంట్రవర్సీ మూవీ ఓటీటీలో వైరల్ అవుతోంది. వచ్చీ రాగానే ట్రెండింగ్ లోకి వెళ్లిపోయింది.

Adah Sharma Movie Trending In OTT: అందాల తార అదా శర్మ ఈ మధ్య అన్నీ కాంట్రవర్సీ సినిమాలే చేస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఆమె నటించిన ఒక కాంట్రవర్సీ మూవీ ఓటీటీలో వైరల్ అవుతోంది. వచ్చీ రాగానే ట్రెండింగ్ లోకి వెళ్లిపోయింది.

OTTని షేక్ చేస్తున్న అదా శర్మ కాంట్రవర్షియల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓటీటీలోకి చాలానే కొత్త సినిమాలు వస్తున్నాయి. ఒక్కో వారం 20కి పైగా కొత్త సినిమాలు వచ్చేసి స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ మే 17న ఒక్కరోజే ఏకంగా 12 సినిమాలు వచ్చేశాయి. ఆడియన్స్ అంతా ఏ సినిమా చూడాలి అంటూ చాలానే వెతికేస్తున్నారు. అయితే ఈ హై డిమాండ్ లో వచ్చిన అదాశర్మ సినిమా ఒకటి ఓటీటీని షేక్ చేస్తోంది. ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన గంటల్లోనే ఏకంగా ఆ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. నిజానికి అదాశర్మ ఈ మధ్య ఏ మూవీ చేసినా కాంట్రవర్సీ అవుతోంది. లేదా ఆమె కాంట్రవర్సీ సినిమాలనే ఎంచుకుంటోందో అర్థం కావడం లేదు. ఈ మూవీ కూడా దేశవ్యాప్తంగా పెద్ద రచ్చే చేసింది.

ఇప్పటికే అదాశర్మ చేసిన ది కేరళ స్టోరీ దేశవ్యాప్తంగా ఎంత రచ్చ అయ్యిందో అందరికీ తెలిసిందే. అలాగే ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన బస్తర్: ది నక్సలైట్ స్టోరీ అనే మూవీ కూడా అంతే కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఈ మూవీకి సంబంధించి మొదటిసారి అదా శర్మా లుక్ ని రివీల్ చేసినప్పుడే పెద్ద చర్చ జరిగింది. చాలాచోట్ల వ్యతిరేకత కూడా వచ్చింది. కానీ, మేకర్స్ ఈ మూవీని విడుదల చేశారు. ఆ తర్వాత మిక్స్డ్ టాక్ తో ఈ మూవీ బాగానే పర్ఫామ్ చేసింది. ఇప్పుడు ఏకంగా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చి ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. ఓటీటీలోకి రావడమే కాకుండా.. ట్రెండ్ కూడా అవుతోంది.

ఈ మూవీ కథ విషయానికి వస్తే.. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో నక్సలిజం చుట్టూ తిరిగే యధార్థ ఘటనల ఆధారంగా ఈ బస్తర్: ది నక్సల్ స్టోరీ అనే సినిమాని తెరకెక్కించారు. ఆ ప్రాంతంలో నక్సల్ కార్యకలాపాలు, వారు చేసే విధ్వంసానికి అడ్డుకట్ట వేసే ఐపీఎస్ అధికారిగా అదా శర్మ లీడ్ రోల్ ప్లే చేసింది. ప్రస్తుతం ఈ బస్తర్ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, హిందీ రెండు వర్షన్స్ లో స్ట్రీమ్ అవుతోంది. ప్రస్తుతం జీ5 ఓటీటీ ప్లాట్ ఫామ్ లో అదా శర్మ లేడీ ఓరియంటెడ్ మూవీ బస్తర్: ది నక్సల్ స్టోరీ ట్రెండ్ అవుతోంది. మరి.. ఈ నక్సల్ బ్యాగ్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని మీరు చూశారా? చూస్తే మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి