iDreamPost
android-app
ios-app

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

Actress Rista Laboni Shimana: ఇటీవల సీనీ ఇండస్ట్రీకి చెందిన పలువురు నటీనటులు ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు వరుసగా కన్నుమూయడంతో అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు.

Actress Rista Laboni Shimana: ఇటీవల సీనీ ఇండస్ట్రీకి చెందిన పలువురు నటీనటులు ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు వరుసగా కన్నుమూయడంతో అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు.

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రముఖ నటీనటులు, దర్శక, నిర్మాతలు ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు వరుసగా కన్నమూస్తున్నారు. అనారోగ్య సమస్యలు, రోడ్డు ప్రమాదం, హార్ట్ ఎటాక్, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏర్పడి కష్టాలు భరించలేక ఆత్మహత్యలకు పాల్పపటం ఇలా ఎన్నో కారణాల వల్ల సెలబ్రెటీలు కన్నుమూయడంతో అటు వారి కుటుంబాల్లో.. ఇటు అభిమానుల్లో తీవ్ర విషాదం నెలకొంటుంది. ఇటీవల కొంతమంది సినీ తారలు క్యాన్సర్ భారిన పడి కన్నుమూసి విషయం తెలిసిందే. బాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ప్రముఖ మోడల్, నటి రిస్టా లబోని షిమానా (39) మంగళవారం ఉదయం బంగబంధు షేక్ ముజీబ్ మెడికల్ యూనివర్సిటీ మెదడు రక్తస్రావం కారణంగా మరణించారు. ఈ విషయాన్ని ఆమె సోదరుడు ఎజాజ్ బిన్ అలీ, ఆమె మాజీ భర్త గాయకుడు పర్వేజ్ సజాద్ ధృవీకరించారు. షిమానా గత కొంత కాలంగా ఎర్లీర్, బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడుతూ గత 14 రోజులుగా ఆపస్మారక స్థితిలో ఉన్న ఆమె మే 21న ఢాకాలోని ధన్మొండిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలోనే ఆమె చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. 2006 లో షిమానా స్టార్-స్టడెడ్ లక్స్-ఛానల్ i సూపర్‌స్టార్ పోటీతో బుల్లితెర ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

రిస్టా లబోని షిమానా మొదట మోడల్ గా కెరీర్ కొనసాగించింది.. పలు యాడ్స్ లో నటించింది. ఆ తర్వాత జాకియా భారీ మెమో, రిన్నర్స్ – ఆప్ అఫ్సానా అరా బిందు, అజ్మెరీ కార్యక్రమాలతో మంచి పాపులారిటీ సంపాదించింది. తౌకిర్ అహ్మద్ ‘దారుచిని ద్విప్’ మూవీతో నటించి విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది. టెలివిజన్ డ్రామాలు, సీరియల్స్, యాడ్స్, సినిమాల్లో నటించిన తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది. ప్రముఖ గాయకుడు పర్వేజ్ సజాద్ ను 2014 లో పెళ్లి చేసుకుంది.2016 లో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత 2019 ద్వితీయ వివాహం చేసుకుంది. ఆమె మృతి పట్ల పలువురు సినీ నటులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు.

Actress rista laboni shimana passed away

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి