iDreamPost

నటి మీరా జాస్మిన్ తండ్రి కన్నుమూత

Meera Jasmine Father Issue: ఈ మద్య సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాాలు అభిమానులను శోక సంద్రంలో ముంచేస్తున్నాయి. సెలబ్రెటీలు కాదు వారి బంధువులు వరుసగా కన్నుమూస్తున్నారు.

Meera Jasmine Father Issue: ఈ మద్య సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాాలు అభిమానులను శోక సంద్రంలో ముంచేస్తున్నాయి. సెలబ్రెటీలు కాదు వారి బంధువులు వరుసగా కన్నుమూస్తున్నారు.

నటి మీరా జాస్మిన్ తండ్రి కన్నుమూత

ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నటీనటులు, దర్శక, నిర్మాతలు, ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు కన్నుమూయడంతో వారి కుటుంబ సభ్యులే కాదు.. వారిని అభిమానించే అభిమానులు సైతం శోకసంద్రంలో మునిగిపోతున్నాయి. ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు మాత్రమే కాదు.. వారి కుటుంబ సభ్యులు కన్నుమూయడం తీవ్ర విషాదం నెలకొంటుంది. వయోభారం, హార్ట్ ఎటాక్, రోడ్డు ప్రమాదాలు ఇతర కారణాల వల్ల సెలబ్రెటీలు కన్నుమూయడంతో అభిమానులు తీవ విషాదంలో మునిగిపోతున్నారు.  తాజాగా ప్రముఖ నటి మీరా జాస్మిన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది.

మాలీవుడ్ బ్యూటీ మీరా జాస్మిన్ ఈ పేరు కొత్తగా పరిచయం అక్కరలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నటించి ‘గుడుంబ శంకర్’ మూవీలో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పలు తెలుగు సినిమాల్లో నటించిన మీరా జాస్మిస్ కొంత కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. ఈ మధ్య మళ్లీ రీ ఎంట్రీకి ప్రయత్నాలు మొదలు పెట్టింది.ఇటీవల సముద్ర ఖని, యాంకర్ అనసూయ నటించిన ‘విమానం’ మూవీలో గెస్ట్ రోల్ లో నటించింది. తాజాగా మీరా జాస్మిన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి జోసెఫ్ ఫిలిప్ కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. జోసెఫ్ ఫలిప్ గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్నాడు. జోసెఫ్ ఫిలిప్ కి భార్య ఎలియమ్మ జోసెఫ్ , పిల్లలు జిబి సారా జోసెఫ్, జెని సారా జోసెఫ్, జార్జ్, జాయ్ ఉన్నారు. మీరా జాస్మిన్ నాల్గవ కూతురు.

ప్రముఖ దర్శకులు లోహితదాస్ దర్శకత్వంలో దిలీప్ హీరోగా నటించిన ‘సుత్రధారన్’ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ సినిమా ఫెయిల్ అయినప్పటికీ మీరా జాస్మిన్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. 2002 లో ‘రన్’, ‘బాలా’ ఆమె కెరీర్ ని పూర్తిగా మార్చాయి. వరుస హిట్స్ తో టాప్ హీరోయిన్ లీస్ట్ లోకి వెళ్లింది మీరా జాస్మిన్. రన్ మూవీకి గాను ఆమెకు ప్రతిష్టాత్మక ఫిలింఫేర్ ఉత్తమ మహిళా తొలి నటి పురస్కారం లభించింది. ఆ తర్వాత స్టార్ డైరెక్టర్ మణి రత్నంతొ ‘ఆయుధ ఎజుత్తు’, ఎస్ ఎస్ స్టాన్లీ డైరెక్షన్ లో ‘మెర్క్యూరీ పుక్కల్’ మూవీలో నటించింది. అలా స్టార్ డైరెక్టర్లతో నటించిన ఆమె తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. పెళ్లైన తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చింది. మీరా జాస్మిన్ ఇంట విషాదం నిండటంతో పలువురు సెలబ్రెటీలు ఆమె తండ్రికి నివాళులర్పించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి